Cooking Oil: ఈ వంట నూనెలను అస్సలు వాడొద్దు..
మనం చేసే వంటల్లో రకరకాల నూనెలను వాడతాం. నూనె లేకపోతే ఏ వంట కూడా చేయలేం. అలాంటి ప్రాముఖ్యత ఉన్న వంటనూనె రుచిగానే కాకుండా మన ఆరోగ్యాన్ని రక్షించేది ఉండాలి. అయితే.. కొన్ని వంటనూనెలు వాడటం వల్ల మనం డేంజర్ లో పడినట్లేనంట. ఇంతకీ ఆ హనికరమైన వంటనూనెలెంటో ఓ లూక్కేయండి.

ఆవ నూనె
ఆవ నూనెను చాలామంది వంటల్లో వాడుతున్నారు. ఈ నూనెను ఎక్కువ వేడి చేస్తే.. ట్రాన్స్ ఫ్యాట్స్ వెలువడుతాయి. ఇవి గుండె జబ్బులకు దారితీస్తాయి. కనోలా గింజలు జన్యుపరంగా మార్చబడినవి. ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల వాపు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి సమస్యలు వస్తాయి.
సోయాబీన్ నూనె (Soybean Oil):
సోయాబీన్ నూనె చౌకగా దొరుకుతుంది. సోయాబీన్ గింజల నుండి తీస్తారు. ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. ఒమేగా-3, ఒమేగా-6 ల మధ్య సమతుల్యత అవసరం. ఒమేగా-6 ఎక్కువైతే వాపు, గుండె జబ్బులు, క్యాన్సర్ వస్తాయి.
వెజిటబుల్ ఆయిల్ (Vegetable Oil):
వెజిటబుల్ ఆయిల్ ఆరోగ్యకరమైనదిలా అనిపించినా, రకరకాల గింజల నుండి (సోయా, సన్ ఫ్లవర్
, మొక్కజొన్న) కలిపి తయారు చేస్తారు. దీనిని ఎక్కువ వేడి చేసి రసాయనాలతో శుద్ధి చేస్తారు. పోషకాలు నశించి, ట్రాన్స్ ఫ్యాట్స్, ఆల్డిహైడ్స్, ఫ్రీ రాడికల్స్ వంటివి వస్తాయి. క్యాన్సర్, డిఎన్ఏ దెబ్బతినే ప్రమాదముంది.
రిఫైన్డ్ సన్ ఫ్లవర్ ఆయిల్
సన్ ఫ్లవర్ నూనె ఆరోగ్యానికి మంచిదే. అయినా.. రిఫైన్డ్ సన్ ఫ్లవర్ ఆయిల్ ని ఎక్కువ వేడిలో శుద్ధి చేస్తారు. యాంటీఆక్సిడెంట్స్, ఇతర పోషకాలు నశిస్తాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ వచ్చే ప్రమాదం ఉంది. దీనికి బదులు తక్కువ శుద్ధి చేసిన లేదా కోల్డ్ ప్రెస్డ్ సన్ ఫ్లవర్ ఆయిల్ వాడటం మంచిది.
రైస్ బాన్ అయిల్ (Rice Bran Oil):
రైస్ బాన్ అయిల్ ను బియ్యం తవుడు నుండి తీస్తారు. ఎక్కువ వేడిలో వాడొచ్చు. కానీ, రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ ని హెక్సేన్, బ్లీచింగ్ చేస్తారు. ఇది ఆరోగ్యానికి హానికరం.