MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Food
  • Reheat Food: ఇవి వేడి చేసి తింటే విషంతో సమానం

Reheat Food: ఇవి వేడి చేసి తింటే విషంతో సమానం

Reheat Food: చాలామందికి ఫుడ్ వేడిగా తినడం అలవాటు. అందుకే మిగిలిన ఫుడ్‍ను కూడా వేడి చేసేస్తుంటారు. కానీ ప్రతి ఆహారం ఇలా వేడి చేయడానికి పనికిరాదు. కొన్ని పదార్థాలు పదే పదే హీట్ చేస్తే పోషకాలు తగ్గి ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉంది. అవేంటో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Nandini Arava
Published : May 04 2026, 02:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
ఇవి అస్సలు వేడి చేయకూడదు
Image Credit : Asianet News

ఇవి అస్సలు వేడి చేయకూడదు

మిగిలిపోయిన వంటలను ఫ్రిజ్‌లో నిల్వ చేసి తర్వాత మళ్లీ వేడి చేసుకుని తినడం సౌకర్యంగా ఫీల్ అవుతారు. కానీ ప్రతి ఆహారానికి అలా కుదరదు. కొన్ని పదార్థాలను పదేపదే వేడి చేస్తే విషంగా మారే ప్రమాదం ఉంది. జీర్ణ సమస్యలు రావొచ్చు. కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ అవ్వొచ్చు. కాబట్టి ఏవి తిరిగి వేడి చేయడం మంచిది కాదో తెలుసుకుని జాగ్రత్తగా ఉండడం అవసరం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
మాంసం
Image Credit : Getty

మాంసం

చికెన్‌లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ చికెన్‌ను మళ్లీ వేడిచేసేటప్పుడు జాగ్రత్త అవసరం.వేడి చేయడం వల్ల దానిలోని ప్రోటీన్లు తగ్గిపోతాయి. తీరా సరిగా జీర్ణం కాక కడుపు ఉబ్బరం, అజీర్తికి దారితీస్తుంది. చికెన్‌ను ఫ్రిజ్‌లో పెడితే బ్యాక్టీరియా పెరుగుతుంది. వండిన వెంటనే తినడం ఉత్తమం. మొదటిసారి వండేటప్పుడు 75 డిగ్రీల సెల్సియస్ వద్ద వండాలి. అప్పుడే బ్యాక్టీరియా చనిపోతుంది.

Related Articles

Related image1
Mango Tree Vastu: మామిడి చెట్టు ఇంటి ముందు పెంచితే ఏమవుతుంది?
Related image2
Ragi Ambali: రోజూ రాగి అంబలి తాగితే ఏమవుతుంది?
38
గుడ్డు
Image Credit : Getty

గుడ్డు

ఉడికించిన గుడ్లను లేదా వేయించిన గుడ్లను మళ్లీ మళ్లీ వేడి చేయకూడదు. చికెన్ లాగే గుడ్లలో కూడా ప్రోటీన్లు ఎక్కువ. వండిన గుడ్లను మళ్లీ వేడిచేస్తే వాటి ప్రోటీన్ నిర్మాణం దెబ్బతిని, విషపూరితం కావచ్చు. ఇది తీవ్రమైన కడుపునొప్పి, జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. గుడ్లను మళ్లీ వేడిచేస్తే రబ్బరులా మారి రుచిని కోల్పోతాయి. అందుకే గుడ్లను ఫ్రెష్‍గా వండుకోవడం మంచిది.

48
పుట్టగొడుగులు
Image Credit : stockPhoto

పుట్టగొడుగులు

పుట్టగొడుగులను వండిన వెంటనే తినడం ఉత్తమం. వీటిలో ప్రోటీన్లు, ఎంజైమ్‌లు ఉంటాయి. వీటిని మళ్లీ వేడి చేసినప్పుడు అవి విచ్ఛిన్నమవుతాయి. ఇది గుండె, జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. సరైన ఉష్ణోగ్రతలో మళ్లీ వేడి చేయకపోతే, పుట్టగొడుగులలోని ప్రోటీన్లు విషపూరితంగా మారే ప్రమాదం పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. కాబట్టి పుట్టగొడుగులను మళ్లీ వేడి చేసి తినకూడదు.

58
ఆకుకూరలు
Image Credit : Getty

ఆకుకూరలు

ఆకుకూరల్లో సహజంగానే నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఆకుకూరలను మళ్లీ మళ్లీ వేడి చేసినప్పుడు, ఈ నైట్రేట్లు నైట్రైట్‌లుగా మారతాయి. ఇవి శరీరానికి విషపూరితం. క్యాన్సర్ కణాలను ప్రేరేపించే కారకాలుగా మారొచ్చు. అంతేకాదు, వాటిలోని ప్రోటీన్లు విచ్ఛిన్నమై ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఆకుకూరల రుచి, పోషకాలను కాపాడుకోవాలంటే, తాజాగా కొని, అప్పటికప్పుడు వండుకుని తినడమే ఉత్తమం.
68
అన్నం
Image Credit : Getty

అన్నం

మిగిలిపోయిన అన్నాన్ని మరుసటి రోజు వేడి చేసి తినడం పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అన్నాన్ని గది ఉష్ణోగ్రతలో ఎక్కువసేపు ఉంచితే, అందులో 'బాసిల్లస్ సెరియస్' అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. దీన్ని మళ్లీ వేడి చేసినా, ఆ బ్యాక్టీరియా విషపదార్థాలు విడుదల చేస్తుంది. ఇది వాంతులు, విరేచనాలకు కారణమవుతుంది. అందుకే అన్నాన్ని పదేపదే వేడి చేసి తినకూడదు.

78
బంగాళాదుంపలు
Image Credit : stockPhoto

బంగాళాదుంపలు

బంగాళదుంపలను వండిన తర్వాత గది ఉష్ణోగ్రతలో ఎక్కువసేపు ఉంచి, ఆ తర్వాత వేడి చేయకూడదు. ఇలా చేస్తే 'బోటులిజం' అంటే ఆహారం విషమవ్వడానికి కారణమయ్యే అరుదైన బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. వేడి చేసినప్పటికీ, ఈ బ్యాక్టీరియా విషం పోదు. ఇది తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది. ఈ బ్యాక్టీరియా ఆహారాన్ని విషపూరితం చేసి, వ్యాధులు వ్యాపించడానికి కారణమవుతుంది.

88
వంట నూనె
Image Credit : Istock

వంట నూనె

ఒకసారి వాడిన నూనెను మళ్లీ వేడి చేసి వాడటం చాలా ప్రమాదకరం. నూనెను మళ్లీ వేడి చేసినప్పుడు, దాని సాంద్రత మారి 'ట్రాన్స్ ఫ్యాట్' అనే విషపూరిత పొగ ఏర్పడుతుంది. ఇది క్యాన్సర్, గుండె జబ్బులకు ప్రధాన కారణం. ముఖ్యంగా ఆలివ్ ఆయిల్ వంటి తక్కువ స్మోక్ పాయింట్ ఉన్న నూనెలను మళ్లీ వేడి చేస్తే, అవి హానికరమైన సమ్మేళనాలను సృష్టిస్తాయి. దీనివల్ల శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్, వాపు వంటి సమస్యలు వస్తాయి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Related Stories
Recommended image1
Mango Tree Vastu: మామిడి చెట్టు ఇంటి ముందు పెంచితే ఏమవుతుంది?
Recommended image2
Ragi Ambali: రోజూ రాగి అంబలి తాగితే ఏమవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved