Telugu

Ragi Ambali: రోజూ రాగి అంబలి తాగితే ఏమవుతుంది?

Telugu

రాగి అంబలి

రాగి జావ కేవలం ఒక డ్రింక్ మాత్రమే కాదు, మన పూర్వీకులు అందించిన అమృతం. వేసవి తాపాన్ని తట్టుకోవడానికి దివ్యౌషధంలా పనిచేస్తుంది.  మీ డైట్‍లో చేర్చుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు చూడొచ్చు.

Image credits: Instagram
Telugu

చేయడం చాలా సులువు

రాగి పిండి: 3 పెద్ద చెంచాలు
నీళ్లు: 1 కప్పు
పల్చటి మజ్జిగ: 1 కప్పు
వేయించిన జీలకర్ర పొడి: 1/2 చెంచా (tsp)
పచ్చి మిరపకాయ: 1 (చీల్చింది - ఐచ్ఛికం)
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: కొద్దిగా

Image credits: Instagram
Telugu

ఉండల్లేకుండా కలపాలి

ముందుగా ఒక కప్పులో రాగి పిండిని తీసుకుని, అర కప్పు నీళ్లతో కలపాలి. ఉండలు లేకుండా మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.

Image credits: Instagram
Telugu

నీళ్లు మరుగుతున్నప్పుడు పేస్ట్ వేసుకోవాలి

మిగిలిన నీటిని ఒక గిన్నెలో పోసి మరిగించాలి. నీళ్లు మరగడం మొదలవగానే, తయారుచేసి పెట్టుకున్న రాగి పేస్ట్‌ను నెమ్మదిగా వేస్తూ ఉండలు కట్టకుండా లపాలి.

Image credits: Instagram
Telugu

పూర్తిగా చల్లారనివ్వాలి

చిన్న మంట మీద సుమారు 5 నిమిషాల పాటు ఉడికించాలి. మిశ్రమం చిక్కబడి, మెరుస్తూ కనిపించే వరకు ఉడికించి, ఆ తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి.

Image credits: Instagram
Telugu

మజ్జిగా చేర్చితే టేస్ట్ సూపర్

ఇప్పుడు ఈ మిశ్రమానికి మజ్జిగ, జీలకర్ర పొడి, ఉప్పు, పచ్చి మిరపకాయ వేసి బాగా కలపాలి. పైన కొద్దిగా తాజా కొత్తిమీర చల్లి, చల్లగా సర్వ్ చేయాలి.

Image credits: Instagram
Telugu

ఈ చిట్కా మీకోసమే

మంచి ఆరోగ్య ప్రయోజనాల కోసం, అలాగే మంచి రుచి కోసం దీన్ని ఉదయం లేదా మధ్యాహ్నం పూట తీసుకోవడం ఉత్తమం.

Image credits: Instagram

Chaat Masala: ఈ ఒక్క పొడితో స్నాక్స్ కు నోరూరించే టేస్ట్, పిల్లలు అస్సలు వదలరు

Kitchen Hacks: అయ్యో, ఉప్పు ఎక్కువైందా? క్షణాల్లో మ్యాజిక్ చేసే సూపర్ టిప్

Lemons: ఇలా చేస్తే నెల రోజులైనా నిమ్మకాయలు తాజాగా ఉంటాయి

Ginger Water: ప్రతిరోజూ అల్లం నీరు తాగితే శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే