MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • World Dead End Road: ప్రపంచంలోనే చిట్టచివరి రోడ్డు ఎక్కడుందో తెలుసా? భూమికి డెడ్ ఎండ్ ప్రదేశంలో ఏముంటుంది?

World Dead End Road: ప్రపంచంలోనే చిట్టచివరి రోడ్డు ఎక్కడుందో తెలుసా? భూమికి డెడ్ ఎండ్ ప్రదేశంలో ఏముంటుంది?

World Dead End Road: ఈ భూమి మొత్తం మీద చిట్ట చివరి రోడ్డు ఎక్కడ ఉంది? సాధారణంగా గల్లీల్లో డెడ్ ఎండ్ రోడ్స్ చూస్తుంటాం? మరి ఈ ప్రపంచానికే డెడ్ ఎండ్ రోడ్డు ఎక్కడ ఉంది? దాని విషేశాలేంటో తెలుసుకుందాం?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 06 2026, 02:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ప్రపంచంలోనే చిట్టచివరి రోడ్డు
Image Credit : Asianet News

ప్రపంచంలోనే చిట్టచివరి రోడ్డు

ప్రపంచం ఎంత విశాలమైనదో, అక్కడక్కడా వింతలు, విశేషాలకు కూడా అంతే కొదవలేదు. భూగోళంపై ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అందులోనూ ప్రకృతి రమణీయతతో పాటు సాహసోపేతమైన ప్రయాణాలను ఇష్టపడేవారిని నిత్యం ఆశ్చర్యపరిచే విషయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి నార్వే దేశం. ఇక్కడి ఒక ప్రత్యేకమైన హైవేను ప్రపంచంలోనే "చివరి రోడ్డు" లేదా "భూమి అంతమయ్యే అంచు"గా పిలుస్తుంటారు. అదే యూరోపియన్ రూట్ ఈ-69 (E-69 Highway). ఇక్కడికి వెళ్తే భూమి, ఆకాశం ఒకచోట కలుసుకున్నట్లు అనిపిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఈ-69 హైవే ప్రత్యేకతలు
Image Credit : pinterest

ఈ-69 హైవే ప్రత్యేకతలు

ఉత్తర ధ్రువానికి (North Pole) అత్యంత సమీపంలో ఉన్న ఈ రహదారి పొడవు దాదాపు 129 కిలోమీటర్లు. ఇది నార్వేలోని ఓల్డాఫెవోఓర్డ్‌ గ్రామాన్ని, నార్డ్‌కాప్ (North Cape) ప్రాంతంతో కలుపుతుంది. ఈ ప్రయాణ మార్గంలో దాదాపు ఐదు సొంగాలు (Tunnels) ఉన్నాయి. వీటిలో అత్యంత ముఖ్యమైనది నార్త్‌కేప్ సొరంగం. ఇది సముద్ర మట్టానికి సుమారు 212 మీటర్ల దిగువన, సముద్రం కింద దాదాపు 6.9 కిలోమీటర్ల పొడవున నిర్మించబడింది. ఈ ఇంజనీరింగ్ అద్భుతం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

కఠినమైన వాతావరణం - నిబంధనలు

ఈ రోడ్డుపై ప్రయాణించడం సామాన్యమైన విషయం కాదు. ఉత్తర ధ్రువ ప్రాంతానికి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ వాతావరణం అత్యంత కఠినంగా ఉంటుంది. శీతాకాలంలోనే కాకుండా వేసవి కాలంలో కూడా ఇక్కడ చలి తీవ్రత అధికంగా ఉంటుంది. బలమైన గాలులు వీయడంతో పాటు భారీగా మంచు కురుస్తుంది.

ఈ భీకరమైన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, ఇక్కడ ప్రయాణించే పర్యాటకులు కొన్ని కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ రహదారిపై ఎవరూ ఒంటరిగా ప్రయాణించడానికి అనుమతి లేదు. మంచు తుఫానుల్లో చిక్కుకోకుండా ఉండేందుకు వాహనాలను కాన్వాయ్‌లుగా నడుపుతారు.

33
పర్యాటకుల ప్రత్యేక అనుభూతి
Image Credit : pinterest

పర్యాటకుల ప్రత్యేక అనుభూతి

భూమి ఉత్తర ధ్రువంపై నేరుగా కాలు పెట్టడం అందరికీ సాధ్యం కాదు. అందుకే సాహస ప్రియులు ఈ-69 చివరి అంచు వరకు వెళ్లి, ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్న అనుభూతిని పొందాలని తపన పడుతుంటారు. ముఖ్యంగా శీతాకాలంలో ఇక్కడ రాత్రి సమయంలో ఆకాశంలో కనిపించే 'అరోరా బోరియాలిస్' (Northern Lights) అద్భుత దృశ్యాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఆకాశంలో ఆకుపచ్చ, గులాబీ రంగుల కాంతులు నృత్యం చేస్తున్నట్లుండే ఈ విన్యాసం జీవితంలో మరువలేని అనుభూతిని పంచుతుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వైరల్ న్యూస్
ప్రపంచం
ఏషియానెట్ న్యూస్
 
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Muslim Traditions: "అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు".. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా?
Recommended image2
పువ్వు నేలపైన, కాయ నేల లోపల.. ఇది దుంప కాదు పండు, ఏదో తెలుసా?
Recommended image3
Jobs: విదేశాల్లో చదువుతో పాటు పార్ట్ టైమ్ జాబ్స్.. టాప్ 10 బెస్ట్ దేశాలివే
Related Stories
Recommended image1
Midnight Sun: ప్రపంచంలో సూర్యుడే అస్తమించని 5 దేశాలు.. అద్భుతమైన ప్రదేశాలు..
Recommended image2
ANR: ఏఎన్నార్ వానపాటకు.. కేసిఆర్ రొమాంటిక్ రివ్యూ.. ఆ పాట అంటే ఎందుకంత ఇష్టం..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved