MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Vodka: వోడ్కాకు రంగు, ఘాటైన వాసన ఎందుకు ఉండవు? వోడ్కా, విస్కీల మధ్య తేడా ఏంటి?

Vodka: వోడ్కాకు రంగు, ఘాటైన వాసన ఎందుకు ఉండవు? వోడ్కా, విస్కీల మధ్య తేడా ఏంటి?

Vodka: సాధారణంగా విస్కీ, రమ్ ఇతర ఆల్కహాలిక్ డ్రింక్స్ కి ప్రత్యేకమైన రంగు, ఘాటైన వాసన ఉంటాయి. కానీ వోడ్కా మాత్రం స్వచ్ఛమైన నీళ్లలా కనిపిస్తుంది. అసలు వోడ్కాకి రంగు, ఘాటైన వాసన ఎందుకు ఉండవు? దీని వెనుక ఉన్న కథేంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Oct 30 2026, 02:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వోడ్కాకి రంగు, వాసన ఎందుకు ఉండవు?
Image Credit : AI

వోడ్కాకి రంగు, వాసన ఎందుకు ఉండవు?

ఆల్కహాల్ అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేవి విస్కీ, రమ్, బ్రాందీ, బీర్ వంటి డ్రింక్స్. వీటిలో ఒక్కో దానికి ఒక్కో రంగు, ప్రత్యేకమైన వాసన, రుచి ఉంటాయి. కానీ వోడ్కా విషయానికి వస్తే మాత్రం ఇందుకు భిన్నం. చూడటానికి అచ్చం నీళ్లలా ట్రాన్సఫరెంట్ గా ఉంటుంది. అంతేకాదు, ఇతర డ్రింక్స్ తో పోలిస్తే దీనికి ఘాటైన వాసన కూడా ఉండదు. మరి వోడ్కాకు రంగు ఎందుకు ఉండదు? వాసన ఎందుకు ఉండదో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వోడ్కా అంటే?
Image Credit : geminiai

వోడ్కా అంటే?

వోడ్కా అనేది ఒక రకమైన డిస్టిల్డ్ ఆల్కహాలిక్ డ్రింక్. సాధారణంగా దీన్ని గోధుమలు, మొక్కజొన్న వంటి ధాన్యాలు, బంగాళాదుంపలు వంటి పిండి పదార్థాలతో తయారు చేస్తారు. ఫస్ట్ వీటిలోని పిండి పదార్థాలను చక్కెరలుగా మార్చి, ఈస్ట్ సహాయంతో ఫర్మెంటేషన్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఆ తర్వాత తగిన విధంగా శుద్ధి చేసిన ద్రవానికి అత్యంత శుద్ధి చేసిన నీటిని కలిపి నార్మల్ ఆల్కహాల్ శాతానికి తీసుకొస్తారు.

35
వోడ్కాకు రంగు ఎందుకు ఉండదు?
Image Credit : AI

వోడ్కాకు రంగు ఎందుకు ఉండదు?

వోడ్కాకు రంగు లేకపోవడానికి ప్రధాన కారణం దాని తయారీలో జరిగే డిస్టిలేషన్ ప్రక్రియ. సాధారణంగా విస్కీ, బ్రాందీ వంటి కొన్ని డ్రింక్స్ ని చెక్క పీపాల్లో ఎక్కువకాలం నిల్వ చేస్తారు. దానివల్ల వాటికి గోధుమ, బంగారు రంగులు వస్తాయి. వాటి రుచి, వాసన కూడా మారుతాయి. కానీ వోడ్కాను సాధారణంగా చెక్క పీపాల్లో ఎక్కువకాలం నిల్వ చేయరు. డిస్టిలేషన్ ద్వారా ఆల్కహాల్‌ను శుద్ధి చేసి, దానిలోని రంగును కలిగించే పదార్థాలు, ఇతర మలినాలను తొలగిస్తారు. అందువల్ల వోడ్కా రంగు లేకుండా కనిపిస్తుంది.

45
వోడ్కాకు ఘాటైన వాసన ఎందుకు ఉండదు?
Image Credit : Asianet News

వోడ్కాకు ఘాటైన వాసన ఎందుకు ఉండదు?

వోడ్కాకు ఘాటైన వాసన లేకపోవడానికి కూడా డిస్టిలేషన్ ప్రక్రియే ముఖ్యమైన కారణం. ఫర్మెంటేషన్ టైంలో ఆల్కహాల్‌తో పాటు అనేక రకాల రసాయన సమ్మేళనాలు ఏర్పడతాయి. వీటిలో కొన్ని ప్రత్యేకమైన వాసన, రుచిని అందిస్తాయి. ముఖ్యంగా విస్కీ, రమ్ వంటి డ్రింక్స్ లో ముడి పదార్థాలు, తయారీ విధానం, నిల్వ ప్రక్రియల ఆధారంగా భిన్నమైన సువాసనలు ఏర్పడతాయి. అయితే వోడ్కా తయారీలో డిస్టిలేషన్ ద్వారా ఇలాంటి అనేక సమ్మేళనాలను తగ్గిస్తారు. కొన్ని తయారీ సంస్థలు అదనంగా ఫిల్టరేషన్ ప్రక్రియ కూడా చేస్తాయి. దానివల్ల వోడ్కాకు బలమైన వాసన ఉండదు.

55
వోడ్కా, విస్కీ మధ్య తేడా ఏంటి?
Image Credit : AI

వోడ్కా, విస్కీ మధ్య తేడా ఏంటి?

వోడ్కా, విస్కీ రెండూ డిస్టిల్డ్ ఆల్కహాలిక్ డ్రింక్సే అయినప్పటికీ వీటి తయారీ విధానాల్లో కొన్ని తేడాలు ఉన్నాయి. వోడ్కాను సాధారణంగా న్యూట్రల్ టేస్ట్ డ్రింక్ గా తయారు చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకే డిస్టిలేషన్, ఫిల్టరేషన్ ప్రక్రియలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. విస్కీ తయారీలో ధాన్యాలను ఉపయోగిస్తారు. డిస్టిలేషన్ తర్వాత ఓక్ చెక్క పీపాల్లో నిల్వ చేయడం వల్ల దానికి ప్రత్యేకమైన రంగు, రుచి, వాసన వస్తాయి. అందుకే విస్కీకి వోడ్కాతో పోలిస్తే ప్రత్యేకమైన వాసన, రుచి ఎక్కువగా కనిపిస్తాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 
4th T20 • NZ vs IND 2026
Live
NZNZ
(20.0 ov)259/7
INDIND
(1.3 ov)12/2
IND need 248 runs in 111 balls
Schedule ›
3rd TEST • SA vs AUS
Live
SASA
(58.5 ov) 329 & 161/4
AUSAUS
429
Day 4 - Session 1
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Church : ఆసియాలోనే అతిపెద్ద చర్చ్ తెలంగాణదే.. ఒకేసారి 40,000 మంది ప్రార్థన చేయవచ్చా..!
Recommended image2
Kurma Village: కరెంట్ లేదు, ఫోన్ వాడరు, గ్యాస్ ఉండదు.. ఆంధ్రప్రదేశ్ లోని వింత గ్రామం ప్రత్యేకత ఏంటో తెలుసా?
Recommended image3
Silk Saree: ఒక ఖరీదైన పట్టు చీర నుంచి ఎంత బంగారం తీయవచ్చు?
Related Stories
Recommended image1
Gold in Silk Saree: పట్టుచీర జరీలో బంగారం ఉంటుందా? ఒక్క చీర నుంచి ఎంత బంగారం తీయొచ్చు?
Recommended image2
Hair Growth: మన జుట్టు నెలకు ఎన్ని సెంటీమీటర్ల పొడవు పెరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved