MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Silk Saree: ఒక ఖరీదైన పట్టు చీర నుంచి ఎంత బంగారం తీయవచ్చు?

Silk Saree: ఒక ఖరీదైన పట్టు చీర నుంచి ఎంత బంగారం తీయవచ్చు?

Silk Saree: ఖరీదైన, నాణ్యమైన పట్టు చీరలో వెండి, బంగారాన్ని వినియోగిస్తారని అంటారు. అది నిజమే అయితే.. ఎంత మోతాదులో వాడతారు? ఒక నాణ్యమైన పట్టు చీర నుంచి ఎంత బంగారాన్ని తీయవచ్చో తెలుసా? ఒక అధ్యయనం ఆ వివరాలను అందిస్తోంది.

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 30 2026, 11:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పట్టు చీరలో ఉండే బంగారం
Image Credit : Asianet News

పట్టు చీరలో ఉండే బంగారం

పట్టు చీరల ధరలు లక్షల్లో ఉంటాయి. నాణ్యమైన పట్టు చీర నుంచి బంగారం, వెండిని కూడా తీయవచ్చని అంటారు. అయితే ఒక పట్టు చీర నుంచి ఎంత పరిమాణంలో బంగారం వస్తుందో తెలుసా? ఒక అధ్యయనం ప్రకారం పట్టు చీరలో బంగార రంగులో మెరిసే జరీలోనే బంగారం, రాగి, వెండి వంటి లోహాలను కలుపుతారు. ఒక పట్టు చీర నుంచి ముందుగా ఆ మెరిసే జరీ దారాలను వేరు చేయాలి. అలాంటి 240 గ్రాముల జరీ ఉన్న పట్టు చీరలో సగటున 0.22 శాతం బంగారం ఉండే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
240 గ్రాముల జరీలో ఎంత బంగారం?
Image Credit : Asianet News

240 గ్రాముల జరీలో ఎంత బంగారం?

ఒక పట్టు చీరలో 240 గ్రాముల జరీ ఉంటే అందులో 0.22% బంగారం ఉంటుందని చెప్పుకున్నాం. 240 × 0.22 ÷ 100 = 0.528 గ్రాముల బంగారం వస్తుంది. అంటే దాదాపు అర గ్రాము కంటే కొంచెం ఎక్కువ బంగారం వస్తుందన్నమాట. అయితే జరీలో బంగారపు శాతం 0.58% ఉంటే మాత్రం ఏకంగా 1.39 గ్రాముల వరకు బంగారం లభించే అవకాశం ఉంటుంది.

అన్ని పట్టు చీరల జరీలోనూ బంగారం ఉండాలని లేదు. అసలైన జరీ దారాల తయారీలో వెండి తీగపై బంగారపు పూత పూస్తారు. కొన్ని రకాల్లో రాగి వంటి ఇతర లోహాలను కూడా ఉపయోగిస్తారు. నకిలీ జరీలో ప్లాస్టిక్ ఫాయిల్ లేదా రసాయనాలు ఉంటాయి. కాబట్టి జరీ మెరుస్తున్నంత మాత్రాన అందులో బంగారం ఉందనుకోకూడదు.

33
జరీ నుంచి బంగారాన్ని వేరు చేసి...
Image Credit : Asianet News

జరీ నుంచి బంగారాన్ని వేరు చేసి...

1960 నుండి 1980 మధ్య కాలంలో నేసిన కాంచీపురం, బెనారస్ పట్టు చీరలలో మేలిమి వెండి, బంగారపు పూతను ఎక్కువగా వాడేవారని అంటారు. అయితే పాత చీర అయినంత మాత్రాన ఎక్కువ బంగారం ఉంటుందని చెప్పలేం. నేత రకం, వాడిన జరీ నాణ్యతపైనే అది ఆధారపడి ఉంటుంది.

జరీ నుంచి బంగారాన్ని వేరు చేసే సాంకేతిక ప్రక్రియ అందుబాటులో ఉంది. కానీ కొంత మేర బంగారం వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రొసెసింగ్ ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి 240 గ్రాముల జరీ నుంచి ఖచ్చితంగా 0.53 గ్రాముల బంగారం రికవరీ అవుతుందని అనుకోలేం. పాత పట్టు చీరలను కొనే వాళ్లు అందులో ఉండే బంగారం, వెండి కోసమే ఆ వ్యాపారం చేస్తారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
 
3rd TEST • SA vs AUS
Live
SASA
(87.4 ov) 329 & 252/5
AUSAUS
429
Day 4 - Session 2
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Human Hair: మ‌నిషి వెంట్రుక‌ల‌తో పెట్రోల్ త‌యారీ.. స్టార్ట‌ప్ సంచ‌ల‌న ప్ర‌యోగం
Recommended image2
Phone Addiction : రాత్రుళ్లు ఫోన్ చూస్తుంటే నిద్రపట్టదు కానీ ఆకలేస్తుంది.. రీజన్ ఏంటో తెలుసా?
Recommended image3
ఒకే సారి రెండు దేశాల్లో నిద్రపోవచ్చు...ప్రపంచంలోనే విచిత్రమైన ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసా?
Related Stories
Recommended image1
America: కారులో ఢిల్లీ నుంచి అమెరికాకు వెళ్లిపోవచ్చు తెలుసా? ఆ రోడ్డు మార్గం ఇదిగో
Recommended image2
మనదేశంలో సరస్సులో తేలియాడే ఐదంతస్తుల రాజభవనం.. అందులో నాలుగు అంతస్తులు నీటిలోనే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved