MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Feature
  • Countries With No Snakes: పాముల భయం లేని దేశాలు ఇవి.. అక్కడ ఒక్క పాము కూడా ఎందుకు ఉండదో తెలుసా?

Countries With No Snakes: పాముల భయం లేని దేశాలు ఇవి.. అక్కడ ఒక్క పాము కూడా ఎందుకు ఉండదో తెలుసా?

Countries With No Snakes: ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఒక్క పాము కూడా ఉండదు. ఐర్లాండ్, న్యూజిలాండ్ వంటి దేశాల్లో పాములు లేకపోవడానికి గల అసలు కారణాలేంటో మీకు తెలుసా?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 12 2026, 08:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాములు అస్సలు లేని దేశాలు ఇవే
Image Credit : Gemini

పాములు అస్సలు లేని దేశాలు ఇవే

పాము అంటే చాలు.. ఒంట్లో వణుకు పుడుతుంది చాలా మందికి. మన దేశంలో అడుగుకో పాము కనిపిస్తూనే ఉంటుంది. కానీ, ఈ ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి, అక్కడ మీరు అడవుల్లో తిరిగినా, పొలాల్లో పడుకున్నా ఒక్క పాము కూడా మీకు ఎదురుపడదు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం! పాములంటే ఫోబియా ఉన్నవారికి ఈ దేశాలు నిజంగానే ఒక స్వర్గధామం అని చెప్పాలి. మరి ఆ దేశాలేవి? అక్కడ పాములు ఎందుకు పుట్టలేదు? ఒకవేళ ఎవరైనా పామును తీసుకెళ్తే ఏమవుతుంది? అన్న ఆసక్తికర విషయాలు మీకోసం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కోల్డ్ బ్లడెడ్ ప్రాణాలు: ఈ రక్తమే శాపమా?
Image Credit : Gemini

కోల్డ్ బ్లడెడ్ ప్రాణాలు: ఈ రక్తమే శాపమా?

పాములు 'కోల్డ్ బ్లడెడ్' ప్రాణులు. అంటే మనలాగా అవి సొంతంగా శరీర ఉష్ణోగ్రతను మేనేజ్ చేసుకోలేవు. బయట ఎండ ఉంటేనే వాటి ఒళ్లు వేడెక్కుతుంది, అప్పుడే అవి యాక్టివ్‌గా కదలగలవు. అంటార్కిటికా, గ్రీన్‌ల్యాండ్, ఐస్‌లాండ్ వంటి ప్రాంతాల్లో ఎప్పుడూ గడ్డకట్టే చలి ఉంటుంది. అంతటి మంచులో పాములు వేటాడటం పక్కన పెడితే, కనీసం ఊపిరి కూడా తీసుకోలేవు. అందుకే ఈ అతి శీతల ప్రాంతాల్లో పాముల జాడ అస్సలు ఉండదు.

Related Articles

Related image1
Zebra Crossings : జీబ్రా క్రాసింగ్ నలుపు తెలుపులోనే ఎందుకు ఉంటుంది? ఎల్లో ఎందుకు వాడరు?
Related image2
Tenant Rights India: మీ ఇంటి ఓనర్ డిపాజిట్ వెనక్కి ఇవ్వట్లేదా? లీగల్‌గా ఎలా ఫైట్ చేయాలో తెలుసా?
35
ద్వీప దేశాల జాగ్రత్త.. జీవ వైవిధ్యం ఉంటుంది
Image Credit : Gemini

ద్వీప దేశాల జాగ్రత్త.. జీవ వైవిధ్యం ఉంటుంది

న్యూజిలాండ్, ఐర్లాండ్ వంటి దేశాలు చుట్టూ సముద్రంతో ఉంటాయి. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం భూభాగాలు విడిపోయినప్పుడు, పాములు ఆయా ప్రాంతాలకు చేరుకోలేకపోయాయి. న్యూజిలాండ్ దాదాపు 8.5 కోట్ల ఏళ్ల క్రితమే ప్రధాన భూభాగం నుండి విడిపోయింది. అప్పటికి ఇంకా ఆధునిక పాముల పరిణామం జరగలేదు. ఇక ఐర్లాండ్ విషయానికి వస్తే.. మంచు యుగం తర్వాత సముద్ర మట్టాలు పెరగడంతో మెయిన్ ల్యాండ్ నుండి ఐర్లాండ్ కట్ అయిపోయింది. దీంతో పాములు అక్కడికి పాకలేకపోయాయి.

45
చట్టాలు చాలా స్ట్రిక్ట్ గురూ
Image Credit : Gemini

చట్టాలు చాలా స్ట్రిక్ట్ గురూ

కేవలం ప్రకృతి మాత్రమే కాదు, ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా పాములను రానివ్వవు. ముఖ్యంగా న్యూజిలాండ్‌లో బయో-సెక్యూరిటీ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అక్కడ పాములను పెంచుకోవడం గానీ, జూల కోసం దిగుమతి చేసుకోవడం గానీ నేరం. పొరపాటున ఏదైనా పాము కనిపిస్తే వెంటనే దాన్ని పట్టుకుని నాశనం చేస్తారు. ఎందుకంటే అక్కడ పాములు ప్రవేశిస్తే, స్థానికంగా ఉండే అరుదైన పక్షులను, జీవులను అవి తినేస్తాయి. తద్వారా అక్కడి ఎకో-సిస్టమ్ దెబ్బతింటుంది. అందుకే స్నేక్ ఫ్రీ స్టేటస్‌ను వారు చాలా సీరియస్‌గా మెయింటైన్ చేస్తారు.

55
మరి సముద్రంలో సంగతేంటి?
Image Credit : Gemini

మరి సముద్రంలో సంగతేంటి?

భూమి మీద పాములు లేవు కదా అని రిలాక్స్ అయిపోతే పొరపాటే! న్యూజిలాండ్ వంటి దేశాల్లో భూమి మీద తిరిగే పాములు లేవు కానీ, సముద్రపు పాములు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. సముద్ర అలల ఉధృతికి కొట్టుకువచ్చే ఈ పాములు విషపూరితమైనవే. అయితే అవి అరుదుగా తీరానికి వస్తాయి. అమెరికాలోని హవాయి, అలాస్కా రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. హవాయిలో పాములు కనిపిస్తే వెంటనే అధికారులకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
ప్రపంచం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Beer Facts: బీర్‌లో నురగ ఎందుకు వస్తుంది? 6 వేల ఏళ్ల చరిత్ర వెనుక ఆసక్తికర విషయాలివే
Recommended image2
సచిన్, ధోని, రోహిత్, కోహ్లీ లకు ఆడపిల్లలే పుట్టడానికి కారణమేంటో తెలుసా?
Recommended image3
Nepal Tourism : నేపాల్ లో ఇండియన్స్ అత్యధికంగా సందర్శించే టూరిస్ట్ స్పాట్స్ ఇవే..
Related Stories
Recommended image1
Zebra Crossings : జీబ్రా క్రాసింగ్ నలుపు తెలుపులోనే ఎందుకు ఉంటుంది? ఎల్లో ఎందుకు వాడరు?
Recommended image2
Tenant Rights India: మీ ఇంటి ఓనర్ డిపాజిట్ వెనక్కి ఇవ్వట్లేదా? లీగల్‌గా ఎలా ఫైట్ చేయాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved