MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Feature
  • Zebra Crossings : జీబ్రా క్రాసింగ్ నలుపు తెలుపులోనే ఎందుకు ఉంటుంది? ఎల్లో ఎందుకు వాడరు?

Zebra Crossings : జీబ్రా క్రాసింగ్ నలుపు తెలుపులోనే ఎందుకు ఉంటుంది? ఎల్లో ఎందుకు వాడరు?

Zebra Crossings : రోడ్లపై జీబ్రా క్రాసింగ్‌లు కేవలం నలుపు, తెలుపు రంగుల్లోనే ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన సైన్స్, అంతర్జాతీయ నిబంధనల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 11 2026, 11:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రోడ్డుపై తెల్లటి చారల వెనుక ఇంత కథ ఉందా? ఎల్లో రంగు ఎందుకు వాడరో తెలిస్తే షాక్ అవుతారు!
Image Credit : Gemini

రోడ్డుపై తెల్లటి చారల వెనుక ఇంత కథ ఉందా? ఎల్లో రంగు ఎందుకు వాడరో తెలిస్తే షాక్ అవుతారు!

మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సిగ్నల్స్ దగ్గర లేదా రద్దీగా ఉండే ప్రాంతాల్లో రోడ్డుపై తెల్లటి చారలు కనిపిస్తాయి. వీటినే మనం 'జీబ్రా క్రాసింగ్' అంటాం. అయితే, ఎప్పుడైనా ఆలోచించారా? ఈ చారలు కేవలం తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? ఎల్లో, బ్లూ లేదా మరేదైనా వైబ్రెంట్ కలర్ వాడొచ్చు కదా అని మీకు అనిపించవచ్చు. కానీ, ఈ వైట్ కలర్ వెనుక పక్కా సైన్స్, గ్లోబల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు డీటైల్డ్‌గా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విజిబిలిటీనే మెయిన్ రీజన్
Image Credit : Asianet News

విజిబిలిటీనే మెయిన్ రీజన్

జీబ్రా క్రాసింగ్ తెలుపు రంగులో ఉండటానికి అతి పెద్ద కారణం విజిబిలిటీ అంటే స్పష్టంగా కనిపించడం. నలుపు రంగు రోడ్డు మీద తెలుపు రంగు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పగటి పూట ఎండ ఉన్నా, సాయంత్రం వేళ వెలుతురు తగ్గినా, లేదా వర్షం పడుతున్నా.. తెల్లటి చారలు డ్రైవర్లకు చాలా దూరం నుంచే కనిపిస్తాయి. తెలుపు రంగు కాంతిని ఎక్కువగా రిఫ్లెక్ట్ చేస్తుంది. దీనివల్ల డ్రైవర్లు అప్రమత్తమై వేగాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది.

Related Articles

Related image1
Unique Water Cave Temple: గొంతు వరకు నీళ్లలో నడిస్తేనే నరసింహ స్వామి దర్శనం! ఈ టెంపుల్ చాలా స్పెషల్ !
Related image2
Tenant Rights India: మీ ఇంటి ఓనర్ డిపాజిట్ వెనక్కి ఇవ్వట్లేదా? లీగల్‌గా ఎలా ఫైట్ చేయాలో తెలుసా?
35
రాత్రి పూట ప్రకాశవంతంగా..
Image Credit : wikimedia

రాత్రి పూట ప్రకాశవంతంగా..

సాధారణంగా రాత్రి వేళల్లో రోడ్ల మీద రంగులను గుర్తించడం కొంచెం కష్టం. అయితే, వాహనాల హెడ్‌లైట్స్ ఈ తెల్లటి చారలపై పడగానే అవి బాగా మెరుస్తాయి. పసుపు రంగు కూడా బ్రైట్‌గానే ఉన్నప్పటికీ, నల్లటి రోడ్డుపై తెలుపు ఇచ్చినంత కాంట్రాస్ట్‌ను అది ఇవ్వలేదు. అందుకే రాత్రిపూట డ్రైవర్ల కంటికి జీబ్రా క్రాసింగ్ ఇబ్బంది లేకుండా కనిపించాలంటే వైట్ కలర్ ఒక్కటే బెస్ట్ ఆప్షన్.

45
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, యూనిఫార్మిటీ
Image Credit : our own

ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, యూనిఫార్మిటీ

ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ట్రాఫిక్ రూల్స్ దాదాపు ఒకేలా ఉండాలి. దీనినే స్టాండర్డైజేషన్ అంటారు. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లే పర్యాటకులకు లేదా డ్రైవర్లకు కన్ఫ్యూజన్ ఉండకూడదని అంతర్జాతీయంగా జీబ్రా క్రాసింగ్‌కు తెలుపు రంగునే ఫిక్స్ చేశారు. ఒకవేళ ఒక్కో ఊర్లో ఒక్కో రంగు వాడితే, హై స్పీడ్‌లో వెళ్లే డ్రైవర్లు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తెలుపు చారలు కనిపిస్తే అది పెడెస్ట్రియన్ క్రాసింగ్ అని అందరికీ ఇట్టే అర్థమైపోతుంది.

55
మన్నిక, సేఫ్టీ సైకాలజీ
Image Credit : Gemini

మన్నిక, సేఫ్టీ సైకాలజీ

రోడ్ల మీద వేసే పెయింట్ చాలా కాలం పాటు చెరిగిపోకుండా ఉండాలి. తెల్లటి రోడ్డు పెయింట్ వాతావరణ మార్పులను, వాహనాల టైర్ల రాపిడిని బాగా తట్టుకుంటుంది. ఇందులో చిన్న చిన్న గ్లాస్ బీడ్స్ కలుపుతారు, ఇవి రాత్రిపూట మరింత వెలుతురును ఇస్తాయి. అంతేకాదు, రోడ్డుపై నలుపు-తెలుపు కాంబినేషన్ చూడగానే మనిషి మెదడు వెంటనే రియాక్ట్ అవుతుంది. ఆ ప్యాటర్న్ చూడగానే డ్రైవర్లు ఆటోమేటిక్‌గా అలర్ట్ అవుతారని సైకలాజికల్ రీసెర్చ్‌లు కూడా చెబుతున్నాయి. అందుకే ఇది కేవలం డిజైన్ కాదు, ప్రాణాలను కాపాడే ఒక టెక్నిక్ అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
జీవనశైలి
వ్యాపారం
భారత దేశం
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
Onion Tears : ఉల్లిపాయ కోస్తే కన్నీళ్లు ఎందుకు వస్తాయి? దీని వెనక ఇంత కెమిస్ట్రీ దాగుందా?
Recommended image2
Beer Facts: బీర్‌లో నురగ ఎందుకు వస్తుంది? 6 వేల ఏళ్ల చరిత్ర వెనుక ఆసక్తికర విషయాలివే
Recommended image3
సచిన్, ధోని, రోహిత్, కోహ్లీ లకు ఆడపిల్లలే పుట్టడానికి కారణమేంటో తెలుసా?
Related Stories
Recommended image1
Unique Water Cave Temple: గొంతు వరకు నీళ్లలో నడిస్తేనే నరసింహ స్వామి దర్శనం! ఈ టెంపుల్ చాలా స్పెషల్ !
Recommended image2
Tenant Rights India: మీ ఇంటి ఓనర్ డిపాజిట్ వెనక్కి ఇవ్వట్లేదా? లీగల్‌గా ఎలా ఫైట్ చేయాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved