MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Tenant Rights India: మీ ఇంటి ఓనర్ డిపాజిట్ వెనక్కి ఇవ్వట్లేదా? లీగల్‌గా ఎలా ఫైట్ చేయాలో తెలుసా?

Tenant Rights India: మీ ఇంటి ఓనర్ డిపాజిట్ వెనక్కి ఇవ్వట్లేదా? లీగల్‌గా ఎలా ఫైట్ చేయాలో తెలుసా?

Tenant Rights India : సాధారణంగా మనం ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు ఓనర్ సేఫ్టీ కోసం కొంత మొత్తాన్ని డిపాజిట్‌గా ఇస్తాం. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఓనర్ డిపాజిట్ ఇవ్వట్లేదా? చట్టబద్ధంగా ఎంత కట్ చేయాలి, మీ హక్కులేంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 11 2026, 10:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇల్లు ఖాళీ చేస్తున్నారా? సెక్యూరిటీ డిపాజిట్ కోసం ఓనర్‌తో గొడవ అవుతోందా? ఇవి తెలుసుకోండి!
Image Credit : Asianet News

ఇల్లు ఖాళీ చేస్తున్నారా? సెక్యూరిటీ డిపాజిట్ కోసం ఓనర్‌తో గొడవ అవుతోందా? ఇవి తెలుసుకోండి!

అద్దె ఇంట్లో ఉండేవారికి ఇల్లు మారడం ఒక పెద్ద టాస్క్ అయితే, ఆ ఓనర్ దగ్గర ఉన్న సెక్యూరిటీ డిపాజిట్ వెనక్కి తీసుకోవడం మరో పెద్ద యుద్ధం. చాలా సందర్భాల్లో ఇల్లు ఖాళీ చేసేటప్పుడు యజమానులు ఏదో ఒక సాకు చెప్పి డిపాజిట్ డబ్బులు కట్ చేసుకుంటూ ఉంటారు. పెయింటింగ్ అని, క్లీనింగ్ అని, రిపేర్లు అని చెప్పి చేతికి వచ్చే సరికి సగం డబ్బులు ఎగ్గొట్టేస్తుంటారు. అసలు చట్టం ఏం చెబుతోంది? ఓనర్ ఎంత కట్ చేసుకోవచ్చు? మీరు ఎలా ఫైట్ చేయాలి? అనే విషయాలను ఇప్పుడు వివరంగా చూద్దాం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
డిపాజిట్ గొడవలు ఎందుకు వస్తాయి?
Image Credit : our own

డిపాజిట్ గొడవలు ఎందుకు వస్తాయి?

సాధారణంగా మనం ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు ఓనర్ సేఫ్టీ కోసం కొంత మొత్తాన్ని డిపాజిట్‌గా ఇస్తాం. ఒకవేళ మనం రెంట్ కట్టకపోయినా లేదా ఇంటిని పాడు చేసినా ఆ డబ్బుల నుంచి మినహాయించుకోవచ్చని అనుకుంటారు. అయితే, ఇల్లు ఖాళీ చేసే సమయంలోనే అసలు సమస్య మొదలవుతుంది. ఓనర్లు రీఫండ్ చేయడంలో ఆలస్యం చేయడం, అనవసరమైన కారణాలు చెప్పి డబ్బులు కట్ చేయడం వంటివి చేస్తుంటారు. అయితే, ఇలా చేసే ప్రతీ కటింగ్‌కు సరైన కారణం ఉండాలి. అద్దె ఒప్పందం ప్రకారం మాత్రమే ఏదైనా జరగాలి.

Related Articles

Related image1
Unique Water Cave Temple: గొంతు వరకు నీళ్లలో నడిస్తేనే నరసింహ స్వామి దర్శనం! ఈ టెంపుల్ చాలా స్పెషల్ !
Related image2
World Coldest Places: ప్రపంచంలోనే అత్యంత చల్లని ప్లేసెస్ ఇవే! ఇక్కడ ఎలా బతుకుతున్నారో తెలిస్తే షాక్ అవుతారు !
36
సెక్యూరిటీ డిపాజిట్ ఎంత ఉండాలి?
Image Credit : our own

సెక్యూరిటీ డిపాజిట్ ఎంత ఉండాలి?

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోడల్ టెనెన్సీ యాక్ట్ 2021 ప్రకారం కొన్ని పరిమితులు ఉన్నాయి:

• నివాస గృహాలకు: గరిష్ఠంగాాా 2 నెలల అద్దె మాత్రమే డిపాజిట్‌గా తీసుకోవాలి.

• కమర్షియల్ ప్రాపర్టీలకు: గరిష్ఠంగా 6 నెలల అద్దె తీసుకోవచ్చు.

ఈ చట్టం అనేది ఒక మోడల్. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఆమోదిస్తేనే ఆ రాష్ట్రంలో అమలవుతుంది. ఉదాహరణకు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ సొంత అద్దె చట్టాలు ఉన్నాయి. అక్కడ మార్కెట్ డిమాండ్ బట్టి, ఓనర్-టెనెంట్ ఒప్పందం బట్టి డిపాజిట్ ఎంతైనా ఉండొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది వేరువేరుగా వుంటుంది. అందుకే మీరు అగ్రిమెంట్ మీద సంతకం చేసే ముందే డిపాజిట్ అమౌంట్ గురించి క్లారిటీ తెచ్చుకోవాలి.

46
చట్టబద్ధంగా ఓనర్ ఏమేమి కట్ చేయవచ్చు?
Image Credit : Getty

చట్టబద్ధంగా ఓనర్ ఏమేమి కట్ చేయవచ్చు?

మీ డిపాజిట్ నుంచి ఓనర్ ఇష్టమొచ్చినట్టు డబ్బులు తీసేయడానికి వీల్లేదు. కేవలం కింద పేర్కొన్న వాటికి మాత్రమే మినహాయింపు ఉంటుంది:

• చెల్లించాల్సిన అద్దె బకాయిలు.

• పెండింగ్‌లో ఉన్న కరెంటు బిల్లులు, నీటి బిల్లులు.

• ఇంటికి ఏదైనా పెద్ద నష్టం కలిగిస్తే.

• బాత్రూమ్ ఫిట్టింగ్స్ విరగ్గొట్టినా లేదా టైల్స్ పాడుచేసినా.

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. 'నార్మల్ వేర్ అండ్ టియర్' అంటే ఇల్లు వాడుతున్నప్పుడు సహజంగా జరిగే మార్పులు. గోడల రంగు కొంచెం తగ్గడం, చిన్న చిన్న గీతలు పడటం వంటి వాటికి డబ్బులు కట్ చేయడం చట్టవిరుద్ధం.

56
పెయింటింగ్, క్లీనింగ్ ఛార్జీలు కట్టాలా?
Image Credit : AI

పెయింటింగ్, క్లీనింగ్ ఛార్జీలు కట్టాలా?

చాలా మంది ఓనర్లు చేసే పని ఇదే. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు పెయింటింగ్ కోసం అని భారీగా డబ్బులు కట్ చేస్తారు. కానీ ఇది ఎప్పుడూ లీగల్ కాదు. కేవలం రెండు సందర్భాల్లోనే ఇది చెల్లుతుంది:

1. మీ రెంటల్ అగ్రిమెంట్‌లో "ఇల్లు ఖాళీ చేసేటప్పుడు పెయింటింగ్ ఛార్జీలు టెనెంట్ భరించాలి" అని స్పష్టంగా రాసి ఉంటే.

2. మీరు ఇంటిని చాలా ఘోరంగా పాడు చేసి, గీతలు గీసి భయంకరంగా ఉంచినప్పుడు.

కేవలం రొటీన్ పెయింటింగ్ కోసం ఓనర్ మీ డిపాజిట్ వాడకూడదు. అందుకే అగ్రిమెంట్ రాసుకునేటప్పుడే ఈ పాయింట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి.

66
డబ్బులు ఇవ్వకపోతే ఏం చేయాలి?
Image Credit : Gemini

డబ్బులు ఇవ్వకపోతే ఏం చేయాలి?

మోడల్ టెనెన్సీ యాక్ట్ ప్రకారం, టెనెంట్ ఇల్లు ఖాళీ చేసిన ఒక నెల లోపు డిపాజిట్ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలి. ఒకవేళ ఓనర్ మొండికేస్తే మీరు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి:

• లీగల్ నోటీసు: లాయర్ ద్వారా ఓనర్‌కు నోటీసు పంపండి.

• సివిల్ కోర్టు: రికవరీ కేసు ఫైల్ చేయవచ్చు.

• రెంట్ అథారిటీ: అద్దె వివాదాల కోసం ఉండే ప్రత్యేక అధికారులను కలవండి.

ముందస్తు జాగ్రత్తలు

• ఇంట్లోకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు ఫోటోలు తీసి పెట్టుకోండి.

• ప్రతీ పేమెంట్ రసీదు దగ్గర ఉంచుకోండి.

• ఇల్లు ఖాళీ చేసేముందు ఓనర్‌ను పిలిచి ఇల్లంతా చూపించి 'ఫైనల్ ఇన్‌స్పెక్షన్' చేయించండి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఏషియానెట్ న్యూస్
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
న్యాయ స‌ల‌హాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Unique Water Cave Temple: గొంతు వరకు నీళ్లలో నడిస్తేనే నరసింహ స్వామి దర్శనం! ఈ టెంపుల్ చాలా స్పెషల్ !
Recommended image2
Poison vs Venom : పాము విషాన్ని వెనమ్ అని ఎందుకంటారు..? పాయిజన్ ఎందుకు అనరు..?
Recommended image3
World Coldest Places: ప్రపంచంలోనే అత్యంత చల్లని ప్లేసెస్ ఇవే! ఇక్కడ ఎలా బతుకుతున్నారో తెలిస్తే షాక్ అవుతారు !
Related Stories
Recommended image1
Unique Water Cave Temple: గొంతు వరకు నీళ్లలో నడిస్తేనే నరసింహ స్వామి దర్శనం! ఈ టెంపుల్ చాలా స్పెషల్ !
Recommended image2
World Coldest Places: ప్రపంచంలోనే అత్యంత చల్లని ప్లేసెస్ ఇవే! ఇక్కడ ఎలా బతుకుతున్నారో తెలిస్తే షాక్ అవుతారు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved