MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Feature
  • Indian Army: ఇండియన్ ఆర్మీలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌నే ఎందుకు వాడతారు? కారణాలు ఇవే

Indian Army: ఇండియన్ ఆర్మీలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌నే ఎందుకు వాడతారు? కారణాలు ఇవే

Indian Army: ఇండియన్ ఆర్మీలో ఎక్కువ కనిపించే బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్. దీనిపై సైనికులు.. కొండల దారుల్లో కూడా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అసలు ఇండియన్ ఆర్మీలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకు ఎప్పుడు ఎంట్రీ ఇచ్చింది? దీని వెనుక చరిత్ర ఏమిటి?

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 07 2026, 02:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఇండియన్ ఆర్మీతో రాయల్ ఎన్‌ఫీల్డ్  బైక్
Image Credit : Gemini Ai

ఇండియన్ ఆర్మీతో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్

సైనికులు సరిహద్దుల్లో గస్తీ కాయడం అంత సులువైన విషయం కాదు. మంచు కొండలు, రాళ్ల దారులు, ఇసుక ఎడారులు.. ఇలా ఎలాంటి పరిస్థితుల్లోనైనా వారు గస్తీ కాయాలి. అందుకే వారికి ఎలాంటి రోడ్డులోనైనా నడిచే వాహనం కావాలి. అలాంటి అవసరాలకే రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్.. బైక్ ఇండియన్ ఆర్మీకి ఎంతో దగ్గరైంది. దాదాపు 70 ఏళ్లకు పైగా ఈ బైక్ ఆర్మీతో కలిసి ప్రయాణిస్తోంది. భారత ఆర్మీతో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అనుబంధం 1952లో మొదలైంది. అప్పట్లో జమ్మూ కశ్మీర్, రాజస్థాన్ సరిహద్దుల్లో గస్తీకి అవసరమైన మోటార్‌సైకిల్ కోసం భారత సైన్యం వెతికింది. ఎన్నో పరీక్షల తర్వాత రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 బుల్లెట్‌ను మొదటిసారి సెలెక్ట్ చేసింది. తొలి విడతలో 500 బైక్‌లను ఆర్డర్ చేసింది. కొండ ప్రాంతాలు, గుంతల రోడ్లు, ఎడారి మార్గాల్లో కూడా ఈ బైక్ బాగా పనిచేయడంతో ఆర్మీ మరిన్ని బైక్‌లను కొనుగోలు చేసింది. ఆ పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు 1955లో చెన్నై సమీపంలోని తిరువొట్టియూరులో ఎన్‌ఫీల్డ్ ఇండియా ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. మొదట ఇంగ్లండ్ నుంచి విడిభాగాలు తెచ్చి బైక్‌లను అమర్చేవారు. తర్వాత మొత్తం తయారీ భారత్‌లోనే ప్రారంభమైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఈ బైక్ స్పెషాలిటీ ఏంటి?
Image Credit : Gemini Ai

ఈ బైక్ స్పెషాలిటీ ఏంటి?

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు ఆర్మీలో ప్రత్యేక స్థానం రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇది బలంగా ఉంటుంది. కఠినమైన దారుల్లో కూడా నడిచే సామర్థ్యం ఉంది. దీనికి రిపేర్ చేయడం కూడా చాలా సులువు. అలాగే ఎక్కువ బరువును మోయగల శక్తి దీనికి ఉంది. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో కూడా ఇవి చక్కగా నడుస్తాయి. అందుకే లడఖ్ వంటి ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీ చాలాకాలం పాటు ఈ బైక్‌లనే వాడుతోంది. అలాగే ఆర్మీకి చెందిన డేర్‌డెవిల్స్ మోటార్‌సైకిల్ బృందం కూడా పరేడ్ లలో ఎన్నో సంవత్సరాలుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌లతోనే ప్రపంచ రికార్డులు సృష్టించింది. దీంతో ఈ బైక్‌కు ఇంకా గుర్తింపు వచ్చింది.

33
ఇప్పుడు వేరే బైకులు కూడా
Image Credit : Pixabay

ఇప్పుడు వేరే బైకులు కూడా

అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. కొత్త టెక్నాలజీతో వచ్చిన ఇతర మోటార్‌సైకిళ్లను కూడా ఇండియన్ ఆర్మీ అవసరాన్ని బట్టి ఉపయోగిస్తోంది. అయినప్పటికీ రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో ఉన్న బంధం మాత్రం అలాగే కొనసాగుతోంది. సైనికుల ధైర్యానికి, కష్టమైన మార్గాల్లో సాగే ప్రయాణాలకు ఈ బైక్ ఒక గుర్తు. అందుకే భారతీయ ఆర్మీలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కూడా ఒక భాగమే.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వ‌ర్షాకాలంలో ప‌ట్టాల‌పై రైలు జార‌కుండా ఎలా ఉంటుంది.? రైళ్ల‌లో ఉండే ఇసుక బాక్సుల ప‌ని ఏంటి.?
Recommended image2
Reliance Smart Bazaar : MRP కంటే తక్కువకే సరుకులు..! స్మార్ట్ బజార్ లో ఏ వస్తువు ఎలా కొంటే లాభమో తెలుసా?
Recommended image3
Tirumala Facts : వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు, గోర్లు పెరుగుతాయా? చెమట పడుతుందా?
Related Stories
Recommended image1
Dogs and Bikes: బైకులు, కార్ల వెనుక కుక్కలు ఎందుకు వెంటపడతాయి? అసలు కారణాలు ఇవే!
Recommended image2
DMart Offers: డీమార్ట్‌కు ఎప్పుడు వెళ్తే ఎక్కువ ఆఫర్లు వస్తాయో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved