MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • DMart Offers: డీమార్ట్‌కు ఎప్పుడు వెళ్తే ఎక్కువ ఆఫర్లు వస్తాయో తెలుసా?

DMart Offers: డీమార్ట్‌కు ఎప్పుడు వెళ్తే ఎక్కువ ఆఫర్లు వస్తాయో తెలుసా?

DMart Offers: డీమార్ట్‌లోనే ఎక్కువ మంది ఇంటికి కావాల్సిన వస్తువులు కొనేందుకు ఇష్టపడతారు. అయితే ఏ రోజు డిమార్ట్ కు వెళ్తే ఎక్కువ శాతం ఆఫర్లు వస్తాయో తెలుసా? పెద్ద క్యూ లైన్లలో నిలబడకుండా హ్యాపీగా షాపింగ్ ఏరోజు చేయొచ్చో తెలుసా?

1 Min read
Author : Haritha Chappa
Published : Aug 07 2026, 01:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
డీమార్ట్ లో షాపింగ్
Image Credit : Gemini AI

డీమార్ట్ లో షాపింగ్

డీమార్ట్ లో తక్కువ ధరలకే నిత్యావసరాలు దొరుకుతాయి. కాబట్టి ఈ షాపుకే ఎక్కువమంది షాపింగ్ కు వెళతారు.  కిరాణా, కూరగాయలు, మసాలాలు, బట్టలు, ఇంటి సామాన్లు, పర్సనల్ కేర్ ఉత్పత్తులు... ఇలా అన్నీ డిమార్ట్ లోనే దొరుకుతాయి. శనివారం, ఆదివారం ఈ రెండు రోజులు డిమార్ట్ కిక్కిరిసిపోయి ఉంటాయి. కనీసం ఊపిరి కూడా సరిగా ఆడనంతగా జనాలు నిండిపోతారు.

డీమార్ట్‌లో అన్ని వస్తువులపై రోజూ ఒకే డిస్కౌంట్ ఉండదు.  నిజానికి ఆఫర్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కొన్ని రోజుల్లో కొన్ని వస్తువులపై అదనపు డిస్కౌంట్లు వస్తాయి. అలాగే 'ఒకటి కొంటే ఒకటి ఉచితం'  లాంటి ఆఫర్లు ఉండొచ్చు. ఏ రోజుల్లో ఉంటాయో తెలుసుకుని వెళితే మంచిది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
డిమార్ట్ కు ఏరోజు వెళ్లాలి?
Image Credit : Gemini AI

డిమార్ట్ కు ఏరోజు వెళ్లాలి?

డిమార్ట్ లో ఏ రోజు ఏ ప్రొడక్ట్‌పై ఆఫర్ ఉంటుందనేది సూటిగా చెప్పడం కష్టం.   స్టోర్‌ను, రాష్ట్రాన్ని బట్టి ఆఫర్లు, డిస్కౌంట్లు మారుతూ ఉంటాయి. కాబట్టి అన్ని బ్రాంచ్‌లలో ఒకే ఆఫర్లు ఉంటాయని చెప్పలేం. రద్దీ లేకుండా ప్రశాంతంగా షాపింగ్ చేయాలనుకునేవాళ్లు సోమవారం నుంచి గురువారం మధ్య డిమార్ట్ కు వెళ్లాలి. ముఖ్యంగా ఉదయం స్టోర్ తెరిచిన వెంటనే వెళితే ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు.  లేదా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య స్టోర్లలో రద్దీ తక్కువగా ఉంటుంది. అలాగే నెలలో 10వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య కూడా జనం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

33
ఆఫర్లు ఎప్పుడు?
Image Credit : Asianet News

ఆఫర్లు ఎప్పుడు?

డిమార్ట్ లో  ఆదివారం సేల్స్ బాగా జరుగుతాయి. కాబట్టి కొన్ని డీమార్ట్ బ్రాంచ్‌లలో సోమవారం నాడు కొన్ని వస్తువులపై అదనపు ఆఫర్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా 'డీమార్ట్ రెడీ' యాప్ వాడేవాళ్లు ఆన్‌లైన్ ఆఫర్లు, కూపన్లు, స్పెషల్ డిస్కౌంట్లు పొందొచ్చు. కాబట్టి, షాపింగ్‌కు వెళ్లే ముందు దగ్గర్లోని బ్రాంచ్ ఆఫర్లను, యాప్‌లోని ఆఫర్లను చెక్ చేసుకోవడం మంచిది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: పండుగల వేళ పసిడి ధరల పెరుగుదల.. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే?
Recommended image2
బాగా ఉన్నోళ్లే కాదు మ‌నం కూడా డిష్ వాషర్ కొనుక్కోవచ్చు.. అమెజాన్ సేల్ అదిరిపోయే ఆఫ‌ర్
Recommended image3
Inspiring Story: అమ్మమ్మ జ్ఞాపకాలతో మొదలైన వ్యాపారం..ఇప్పుడు రూ.580 కోట్ల బ్రాండ్
Related Stories
Recommended image1
Dogs and Bikes: బైకులు, కార్ల వెనుక కుక్కలు ఎందుకు వెంటపడతాయి? అసలు కారణాలు ఇవే!
Recommended image2
Fish: ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలంటే తినాల్సింది చేపలు.. మాంసం కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved