MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • River : వందల కిలోమీటర్లు ప్రవహించినా సముద్రంలో కలవదు.. భూమిపైనే కనుమరుగయ్యే ఏకైక భారతీయ నది ఏదో తెలుసా?

River : వందల కిలోమీటర్లు ప్రవహించినా సముద్రంలో కలవదు.. భూమిపైనే కనుమరుగయ్యే ఏకైక భారతీయ నది ఏదో తెలుసా?

సాధారణంగా నది అంటే మంచినీటి ప్రవాహంతో సుదీర్ఘంగా ప్రయాణించి సముద్రంలో కలిసేది. కానీ ఈ రెండు రూల్స్ ని ఫాలో అవ్వని నది ఇండియాలో ఒకటుంది… ఇది ఉప్పునీటితో ప్రవహిస్తుంది, సముద్రంలో కలవదు. ఇంతకీ ఈ వింత నది ఏదో తెలుసా?

3 Min read
Author : Arun Kumar P
| Updated : Sep 25 2026, 11:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఈ నది చాలా స్పెషల్ గురూ..
Image Credit : Gemini AI

ఈ నది చాలా స్పెషల్ గురూ..

Indian River : సాధారణంగా నది అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఉద్రుతంగా ప్రవహించే మంచినీరు. కొండకోనల్లో పుట్టే నదులు వేల క్యూసెక్కుల నీటిని మోసుకుంటూ, వందల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి... ఇలాంటి ప్రతి నది సముద్రంలో కలవాల్సిందే. ఇక నదుల్లో ప్రవహించేది మంచినీరే… ఇది తాగేందుకు వీలుగా తియ్యగా ఉంటుంది.

అయితే మన దేశంలో ఈ రెండు విషయాలకు భిన్నంగా ఉండే ఓ నది ఉంది. ఇది వందల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత సముద్రంలో కలవకుండా ఓ విశాలమైన చిత్తడి ప్రాంతంలో తన ప్రయాణాన్ని ముగిస్తుంది. అలాగే కొంత దూరం వరకు మంచినీటిని మోసుకొచ్చే ఈ నది ఆ తర్వాత ఉప్పునీరుగా మారుతుంది. ఇంత ప్రత్యేకత ఉన్న ఆ నది ఏదో తెలుసా? అదే రాజస్థాన్‌లో ప్రవహించే లూనీ నది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
లూనీ నది జన్మస్థలం ఏది?
Image Credit : Getty

లూనీ నది జన్మస్థలం ఏది?

లూనీ నది రాజస్థాన్‌లోని ఆరావళి పర్వతశ్రేణుల్లో సుమారు 550 మీటర్ల ఎత్తులో అజ్మీర్ జిల్లాలో పుడుతుంది. పుష్కర్ లోయ ప్రాంతాన్ని కూడా లూనీ నది జన్మస్థలంగా పేర్కొంటారు. ప్రారంభ దశలో చిన్న ప్రవాహంగా ఉండే ఈ నది క్రమంగా బలమైన నదిగా మారుతుంది. కొన్ని ప్రాంతాల్లో దీనిని ప్రారంభ దశలో వేరే పేర్లతో కూడా పిలుస్తారు.

ఆరావళి పర్వతాల నుంచి నైరుతి దిశగా ప్రవహిస్తూ లూనీ రాజస్థాన్‌లోని పాలి, జోధ్‌పూర్, బార్మర్, జాలోర్ తదితర ప్రాంతాల మీదుగా సాగుతుంది. పశ్చిమ రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతాలకు నీటిని అందించే ప్రధాన నదీ వ్యవస్థల్లో ఇది ఒకటి. థార్ ఎడారి ప్రాంతంలో లూనీకి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది.

ఈ లూనీ నది ప్రయాణంలోకి అనేక ఉపనదులు వచ్చి చేరుతాయి. సుక్రి, మిథ్రి, బండి, ఖారీ, జవాయి, గుహియా, సాగి వంటి ఉపనదులు లూనీ నదీ వ్యవస్థలో ముఖ్యమైనవి. కుడి వైపు నుంచి జోజరి నది కూడా లూనీలో కలుస్తుంది. ఈ ఉపనదుల కారణంగా వర్షాకాలంలో లూనీ ప్రవాహం ఒక్కసారిగా పెరిగి వరదలకు కారణం అవుతుంది.

అయితే రాజస్థాన్‌లో వర్షపాతం ప్రాంతాన్ని బట్టి చాలా మారుతూ ఉంటుంది. ఆరావళి ప్రాంతాల్లో కొంత ఎక్కువ వర్షపాతం ఉండగా, బార్మర్ వైపు వెళ్లే కొద్దీ వాతావరణం మరింత పొడిగా, ఎడారి స్వభావంతో ఉంటుంది. దీంతో లూనీ ప్రవాహం కూడా కాలానుగుణంగా మారుతూ ఉంటుంది.

34
మొదట మంచినీరు.. ఆ తర్వాత ఉప్పునీరు
Image Credit : Pixabay

మొదట మంచినీరు.. ఆ తర్వాత ఉప్పునీరు

లూనీ నదికి మరో ఆసక్తికరమైన ప్రత్యేకత ఇదే. నది పుట్టిన ప్రాంతం నుంచి బలోత్రా వరకు దాదాపు 100 కిలోమీటర్ల మేర నీరు సాధారణంగా తియ్యగా ఉంటుంది. కానీ బలోత్రా దాటిన తర్వాత నదిలో లవణీయత క్రమంగా పెరుగుతుంది. ఫలితంగా ఈ నదిలోని నీరు ఉప్పగా మారుతుంది. దీనికి ప్రధాన కారణాల్లో నదీ పరివాహక ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు, నేలలోని లవణాలు, అధిక ఆవిరీభవనం వంటి అంశాలు ఉన్నాయి. ఎడారి ప్రాంతంలో నీరు వేగంగా ఆవిరైపోవడం వల్ల మిగిలే నీటిలో ఉప్పు శాతం కూడా పెరుగుతుంది.

లూనీ నదిని సంస్కృతంలో ‘లవణావతి’ అనే పేరుతో కూడా పేర్కొంటారు. దీని అర్థం ఉప్పునీటి నది లేదా ఉప్పుతో కూడిన నీరు అని చెప్పవచ్చు. నది దిగువ ప్రాంతాల్లో పెరిగే లవణీయత కారణంగానే ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఇలా నది పుట్టిన దగ్గర నుంచి చూస్తే మంచినీటి ప్రవాహం.. ముందుకు వెళ్లేకొద్దీ మాత్రం ఉప్పునీటి ప్రవాహంగా మారడం లూనీ ప్రత్యేకత. ఇండియాలోని ఏకైక ఉప్పునీటి నది ఇదే.

44
495 కిలోమీటర్లు ప్రయాణించి హటాత్తుగా మాయం..
Image Credit : Gemini AI

495 కిలోమీటర్లు ప్రయాణించి హటాత్తుగా మాయం..

లూనీ నది రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో దాదాపు 495 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సాధారణంగా ఇంత దూరం ప్రయాణించిన నది ఏదో ఒక సముద్రం లేదా పెద్ద నదిలో కలుస్తుందని అనుకుంటాం. కానీ లూనీ విషయంలో అలా జరగదు. రాజస్థాన్‌లో తన సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగించిన తర్వాత థార్ ఎడారి గుండా గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్ ప్రాంతానికి చేరుతుంది. అక్కడి చిత్తడి, తక్కువ ఎత్తైన భూభాగంలో నది ప్రవాహం క్రమంగా బలహీనపడి చివరకు ఆ ప్రాంతంలోనే కలిసిపోతుంది... హటాత్తుగా మాయం అవుతుంది. ఇలా అరేబియా సముద్రంలో కలవకుండానే ఈ లూనీ నది ప్రయాణం ముగుస్తుంది.

థార్ ఎడారిని తడిపే నది

లూనీ నది ఏడాది పొడవునా ఒకే విధంగా ప్రవహించే శాశ్వత నది కాదు. ముఖ్యంగా వర్షాకాలంలో దీని ప్రవాహం పెరుగుతుంది. పశ్చిమ రాజస్థాన్‌లోని పొడి ప్రాంతాలకు ఇది కీలకమైన నదీ వ్యవస్థ. లూనీ పరివాహక ప్రాంతం సుమారు 37,796 చదరపు కిలోమీటర్లకు విస్తరించి ఉంది. ఈ బేసిన్‌లో రాజస్థాన్‌లోని అనేక జిల్లాలు భాగంగా ఉన్నాయి.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పశ్చిమ ఆరావళి ప్రాంతం నుంచి పశ్చిమ దిశగా ప్రవహించే ప్రధాన నదీ వ్యవస్థగా లూనీకి ప్రత్యేక స్థానం ఉంది. రాజస్థాన్‌లోని పశ్చిమ ప్రాంతాల్లో చాలా చిన్న ప్రవాహాలు కొంత దూరం వెళ్లిన తర్వాత ఎడారి ఇసుకలోనే కనుమరుగవుతాయి. అలాంటి అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ ఉన్న ప్రాంతంలో లూనీ మాత్రం సుదీర్ఘ దూరం ప్రయాణించడం విశేషం.

లూనీ నది ప్రత్యేకతలు ఇవే..

ఒక నది పర్వతాల్లో పుట్టి.. వందల కిలోమీటర్లు ప్రయాణించి.. చివరకు సముద్రంలో కలుస్తుందనే సాధారణ భావనకు లూనీ నది ఓ ఆసక్తికరమైన మినహాయింపు. ఆరావళి పర్వతాల్లో పుట్టి, థార్ ఎడారి ప్రాంతాలను దాటి, సుమారు 495 కిలోమీటర్లు ప్రయాణించి రాన్ ఆఫ్ కచ్‌లో తన ప్రవాహాన్ని ముగిస్తుంది.

పుట్టిన ప్రాంతంలో మంచినీరు.. కొంత దూరం తర్వాత ఉప్పునీరు.. చివరికి సముద్రంలో కలవకుండా చిత్తడి భూమిలో కలిసిపోయే ప్రవాహం.. ఈ మూడు ప్రత్యేకతలే లూనీ నదిని భారతదేశంలోని ఇతర నదుల నుంచి ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Idli Capital: మనదేశంలో ఏ నగరాన్ని ఇడ్లీ రాజధానిగా పిలుచుకుంటారు?
Recommended image2
Rent House: అద్దె ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉంటే కిరాయిదారుడికి ఆ ఇల్లు సొంతమవుతుంది?
Recommended image3
Snakes : పాములు వెనమస్, ఈ విషపూరిత జీవులు మాత్రం పాయిజనస్.. రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
River : 6,400 కి.మీ దూరం ప్రవాహించే నదిపై ఒక్క బ్రిడ్జ్ కూడా లేదా..! అదేదో తెలుసా?
Recommended image2
River : వేల కిలోమీటర్లు ప్రయాణించి... సముద్రంలో కలవక ముందే కనుమరుగయ్యే నది ఏది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved