MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • River : వేల కిలోమీటర్లు ప్రయాణించి... సముద్రంలో కలవక ముందే కనుమరుగయ్యే నది ఏది?

River : వేల కిలోమీటర్లు ప్రయాణించి... సముద్రంలో కలవక ముందే కనుమరుగయ్యే నది ఏది?

ఏ నది అయినా భూమిపై పుట్టి సముద్రంలో కలుస్తుంది. కానీ ఓ నది ప్రయాణం మాత్రం భూమిపైనే పుట్టి, భూమిపైనే అంతం ముగుస్తుంది. ఇంతకూ ఆ నది ఏది? సముద్రంలో కలవకుండా నదీ జలాలు ఎలా మాయం అవుతాయి?

4 Min read
Author : Arun Kumar P
Published : Sep 15 2026, 03:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఈ నది చాలా స్పెషల్ గురూ..
Image Credit : Gemini AI

ఈ నది చాలా స్పెషల్ గురూ..

Okavango River : ప్రపంచంలోని చాలా నదులు కొండలు, పర్వత ప్రాంతాల్లో పుట్టి.. అనేక వందల, వేల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత చివరకు సముద్రం లేదా మహాసముద్రంలో కలుస్తాయి. కానీ ప్రకృతిలో కొన్ని నదులు మాత్రం ఈ సాధారణ నియమానికి భిన్నంగా ఉంటాయి… అలాంటి అద్భుతమైన నదుల్లో ఒకవాంగో (Okavango) నది ఒకటి. మూడు దేశాలమీదుగా, దాదాపు 1,500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే ఈ నది సముద్రాన్ని చేరకుండానే కనుమరుగవుతుంది. ఆఫ్రికాలోని కలహారి ఎడారి ప్రాంతంలో విస్తరించి, అక్కడి ఇసుక నేలల్లో తన నీటిని కోల్పోతుంది. ఇలా ప్రపంచంలో చాలా అరుదైన నదుల్లో ఒకవాంగో ఒకటి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సముద్రాన్ని చేరని నది ఇదే..
Image Credit : Getty

సముద్రాన్ని చేరని నది ఇదే..

ఒకవాంగో నది ప్రయాణం మూడు దేశాలతో ముడిపడి ఉంటుంది. దీని నీటి వ్యవస్థకు ప్రధాన మూలాలు అంగోలా ఎత్తైన ప్రాంతాల్లోని క్యూబాంగో (Cubango), క్యూటో (Cuito) నదులు. ఈ నదులు దక్షిణ దిశగా ప్రవహించి ఒకవాంగో నదీ వ్యవస్థకు నీటిని అందిస్తాయి. అనంతరం నీరు నమీబియా ప్రాంతం మీదుగా ప్రయాణించి బోట్స్వానాలోకి ప్రవేశిస్తుంది. అక్కడ నది విస్తరించి ప్రపంచ ప్రఖ్యాత ఒకవాంగో డెల్టాగా మారుతుంది.

అంటే ఒక దేశంలో పుట్టి మరో దేశం మీదుగా ప్రవహించి, మూడో దేశంలో తన ప్రయాణాన్ని పూర్తిచేసుకునే నది ఇది. అయితే ఇక్కడ “ప్రయాణం ముగిసింది” అంటే సముద్రంలో కలిసిందని కాదు. దానికి బదులుగా నీరు భారీ చిత్తడి నేలలు, కాలువలు, సరస్సులు, వరద మైదానాలుగా విస్తరించి క్రమంగా ఎడారి ఇసుకలో కలిసిపోతుంది.

ఎండోర్‌హీక్ డెల్టా అంటే ఏమిటి?

సాధారణంగా నదులు ఎత్తైన ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తున్న ప్రాంతాల వైపు ప్రవహిస్తాయి. చివరకు సముద్రం వైపు దారి తీస్తాయి. కానీ ఒకవాంగో విషయంలో భౌగోళిక పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. బోట్స్వానాలోకి ప్రవేశించిన తర్వాత నది నీరు ఒకే ప్రవాహంగా ముందుకు వెళ్లకుండా అనేక చిన్న చిన్న కాలువలు, నీటి మార్గాలుగా విడిపోతుంది. ఈ ప్రవాహాలు విస్తారమైన ఒకవాంగో డెల్టాను ఏర్పరుస్తాయి. ఇది సముద్రానికి అనుసంధానం లేని అరుదైన పెద్ద అంతర్గత డెల్టాల్లో ఒకటి… భౌగోళికంగా ఇలాంటి వ్యవస్థను ఎండోర్‌హీక్ డెల్టా (Endorheic Delta) అని పిలుస్తారు.

ఒకవాంగో డెల్టా కలహారి బేసిన్‌లోని ఇసుక నేలల్లో విస్తరించి ఉంటుంది. నది నీరు డెల్టాలోకి చేరిన తర్వాత దాని కొంత భాగం భూమిలోకి ఇంకిపోతుంది. మరికొంత భాగం ఎండ, పొడి వాతావరణం కారణంగా ఆవిరైపోతుంది. ఫలితంగా నది ప్రవాహం సముద్రం వైపు కొనసాగదు.

ఇదే ఒకవాంగో నదిని ప్రపంచంలోని ఇతర ప్రధాన నదుల నుంచి ప్రత్యేకంగా నిలబెడుతుంది. వేల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత కూడా సముద్రపు నీటిలో కలవకుండా, ఒక ఎడారి మధ్యలోనే విస్తరించి క్రమంగా కనుమరుగవుతుంది. UNESCO కూడా దీనిని సముద్రానికి ఎలాంటి అవుట్‌లెట్ లేని ప్రపంచంలోని అరుదైన పెద్ద అంతర్గత డెల్టా వ్యవస్థల్లో ఒకటిగా పేర్కొంటోంది.

34
వర్షాలు లేని సమయంలో ఒకవాంగోకు వరదలు..
Image Credit : AI image - Gemini

వర్షాలు లేని సమయంలో ఒకవాంగోకు వరదలు..

ఒకవాంగో డెల్టా ప్రత్యేకతల్లో ఇది కూడా ఒకటి. బోట్స్వానాలో సాధారణంగా పొడి కాలం (ముఖ్యంగా జూన్–జూలై) అంటే వర్షాలు లేని సమయంలోనే ఈ నది ఉప్పొంగుతుంది. బోట్స్వానాలో వర్షాలు తక్కువగా ఉండే సమయంలోనే దూరంగా అంగోలా ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో నదీ ప్రవాహం పెరుగుతుంది. ఈ నీరు డెల్టాను చేరుతుంది. అందుకే ఈ ప్రాంతంలోని వన్యప్రాణులు కూడా ఈ సహజ నీటి చక్రానికి అనుగుణంగా జీవన విధానాన్ని మార్చుకున్నాయి. నీరు చేరినప్పుడు గడ్డి మైదానాలు పచ్చగా మారతాయి. నీటి లభ్యత పెరగడంతో పెద్ద సంఖ్యలో జంతువులు ఈ ప్రాంతం వైపు కదులుతాయి.

ఒకవాంగో నది నీరు సముద్రానికి చేరకపోయినా… దాని ప్రయోజనం మాత్రం అపారంగా ఉంటుంది. ఒకవాంగో డెల్టా ఆఫ్రికాలోని అత్యంత విలువైన వన్యప్రాణి ఆవాసాల్లో ఒకటి. ఇక్కడ ఏనుగులు, అడవి గేదెలు, జీబ్రాలు, జింకల వంటి పెద్ద శాకాహార జంతువులతో పాటు సింహాలు, చిరుతలు, ఆఫ్రికన్ వైల్డ్ డాగ్స్ వంటి మాంసాహార జంతువులు కూడా కనిపిస్తాయి. అంతేకాదు నల్ల ఖడ్గమృగం, తెల్ల ఖడ్గమృగం, చీతా, ఆఫ్రికన్ వైల్డ్ డాగ్ వంటి అంతరించిపోయే దశలో ఉన్న అరుదైన జాతులకు కూడా ఈ ప్రాంతం కీలకమైన ఆవాసంగా ఉంది. ఈ కారణంగానే ఒకవాంగో డెల్టాను కేవలం నది చివరి భాగంగా కాకుండా అత్యంత విలువైన పర్యావరణ వ్యవస్థగా పరిగణిస్తారు.

నడి ఎడారిలో భారీ నీటి ప్రపంచం

ఒకవాంగో డెల్టాను చూస్తే కలహారి ఎడారిలో ఇంత పెద్ద తేమ ప్రాంతం ఎలా ఏర్పడిందనే ఆశ్చర్యం కలుగుతుంది. ఎడారి ప్రాంతంలో ఉన్నప్పటికీ ఇక్కడ శాశ్వత చిత్తడి నేలలు, కాలానుగుణంగా నీటితో నిండే గడ్డి మైదానాలు, చిన్న సరస్సులు, నీటి కాలువలు, అనేక ద్వీపాలు కనిపిస్తాయి.

UNESCO ప్రకారం... డెల్టాలో సుమారు 6 లక్షల హెక్టార్ల శాశ్వత చిత్తడి ప్రాంతాలు ఉండగా, కాలానుగుణంగా వరదలకు గురయ్యే గడ్డి భూములు మరో భారీ ప్రాంతాన్ని ఆక్రమిస్తాయి. మొత్తం ప్రపంచ వారసత్వ ప్రదేశం 20 లక్షల హెక్టార్లకు పైగా విస్తరించి ఉంది.

44
ఒకవాంగోకు UNESCO ప్రపంచ వారసత్వ గుర్తింపు
Image Credit : Instagram

ఒకవాంగోకు UNESCO ప్రపంచ వారసత్వ గుర్తింపు

ఒకవాంగో డెల్టా ప్రాముఖ్యతను గుర్తించిన UNESCO 2014లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఇక్కడి ప్రత్యేక జలవ్యవస్థ, భౌగోళిక నిర్మాణం, జీవవైవిధ్యం, ఎడారి మధ్య ఏర్పడిన అసాధారణ పర్యావరణ వ్యవస్థ దీనికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చాయి.

అంతేకాదు ఒకవాంగో నదీ వ్యవస్థ మూడు దేశాలకు సంబంధించినది కావడంతో దీని సంరక్షణ కూడా అంతర్జాతీయ సహకారంతోనే సాధ్యమవుతుంది. అంగోలా, నమీబియా, బోట్స్వానా దేశాలు ఈ నదీ పరీవాహక ప్రాంతం సంరక్షణపై కలిసి పనిచేస్తున్నాయి.

నది సముద్రంలో కలవకపోయినా.. జీవనదిగా మారింది

ఒకవాంగో నది కథ ప్రకృతిలో “నది అంటే తప్పనిసరిగా సముద్రంలో కలవాలి” అనే భావనకు భిన్నమైన ఉదాహరణ. అంగోలా ఎత్తైన ప్రాంతాల నుంచి బయలుదేరిన నీరు నమీబియా మీదుగా బోట్స్వానాకు చేరి, అక్కడ ఒక భారీ అంతర్గత డెల్టాగా విస్తరిస్తుంది. చివరకు కలహారి ఇసుకల్లోకి ఇంకిపోతుంది లేదా ఆవిరైపోతుంది.

అంటే సముద్రాన్ని చేరకుండానే ఒక నది తన ప్రయాణాన్ని ముగించగలదు. అయితే ఒకవాంగో విషయంలో అది నిజంగా “కనుమరుగవడం” మాత్రమే కాదు. ఎడారి మధ్యలో కోట్లాది మొక్కలు, జంతువులు, పక్షులకు జీవం పోసే ఒక అద్భుతమైన నీటి ప్రపంచాన్ని సృష్టించి తన ఉనికిని చాటుకుంటుంది. అందుకే ఒకవాంగో నదిని ప్రపంచంలోని అత్యంత విశిష్టమైన నదీ వ్యవస్థల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
River : ఇంద్రధనస్సులా రంగురంగుల నీటితో ప్రవహించే నది ఏది?
Recommended image2
Petrol Price : ఇండియాలో కేవలం రూ.88 కే లీటర్ పెట్రోల్ దొరికే ప్రాంతమేది? ఎందుకింత తక్కువ ధర?
Recommended image3
Insect: ప్రపంచంలోనే అందమైన పురుగు... ఇది కనిపిస్తే ఎక్కువ సంతోషించేది ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
River : 6,400 కి.మీ దూరం ప్రవాహించే నదిపై ఒక్క బ్రిడ్జ్ కూడా లేదా..! అదేదో తెలుసా?
Recommended image2
Ganga River : కల్కి మూవీలో చూపించినట్లే... ఇండియాలో గంగా నదే లేకపోతే పరిస్థితేంటి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved