MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Snakes : పాములు వెనమస్, ఈ విషపూరిత జీవులు మాత్రం పాయిజనస్.. రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా?

Snakes : పాములు వెనమస్, ఈ విషపూరిత జీవులు మాత్రం పాయిజనస్.. రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా?

పాముల విషాన్ని వెనమ్ అంటారు... అదే కొన్నిజీవుల్లోని విషాన్ని పాయిజన్ అంటారు. ఈ రెండుపదాల వినడానికి ఒకేలా ఉన్నా మీనింగ్ లో చాలా తేడా ఉంటుంది. మరి వెనమస్, పాయిజనస్ మధ్య తేడా ఏమిటో తెలుసుకుందాం.

3 Min read
Author : Arun Kumar P
Published : Sep 24 2026, 03:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వెనమస్ vs పాయిజనస్
Image Credit : Gemini AI

వెనమస్ vs పాయిజనస్

Poisonous vs Venomous : పాము కనిపిస్తే చాలు చాలామంది వణికిపోతారు... ఇది పడగవిప్పితే చాలు దూరంగా పరుగుతీస్తారు. అయితే పాము అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చే విషయం ‘విషం’… వీటిని వెనమస్ అంటారు. కానీ పాముల మాదిరిగానే మరికొన్ని విషపూరిత జీవులు ఉంటారు... వాటిని మాత్రం వెనమస్ అనకుండా పాయిజనస్ అంటారు. జీవశాస్త్రంలో విషపూరిత జీవులను వివరించేందుకు Poisonous, Venomous అనే రెండు వేర్వేరు పదాలను ఉపయోగిస్తారు... ఈ రెండు పదాలకు తెలుగులో అర్థం దాదాపు ఒకేలా అనిపిస్తుంది. కానీ విషపూరిత జీవులు మనిషి, ఇతర జీవుల శరీరంలోకి విషాన్ని పంపించే విధానాన్ని బట్టి అది వెనమసా, పాయిజనసా అనేది నిర్దారిస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పాయిజనస్ (Poisonous) అంటే ఏమిటి?
Image Credit : Gemini AI

పాయిజనస్ (Poisonous) అంటే ఏమిటి?

పాయిజనస్ అనే పదాన్ని సాధారణంగా విషాన్ని తాకడం లేదా తినడం ద్వారా ఇతర జీవులకు హాని కలిగించే జీవులు, మొక్కలు లేదా పదార్థాలకు ఉపయోగిస్తారు. అంటే ఇలాంటి జీవి పాముల మాదిరిగా మనల్ని కరిచి విషాన్ని శరీరంలోకి పంపాల్సిన అవసరం లేదు.. ఇతర పద్దతుల్లో పంపుతుంది.

ఉదాహరణకు కొన్ని విషపూరిత కప్పలు తమ చర్మంలో విషపదార్థాలను కలిగి ఉంటాయి. వాటిని తాకడం లేదా వాటి నుంచి వచ్చే విషపదార్థాలు శరీరంలోకి చేరడం వల్ల హాని కలగవచ్చు. అలాగే కొన్ని మొక్కలు, పుట్టగొడుగులు, జంతువుల్లో కూడా శరీరంలో విషపదార్థాలు ఉండొచ్చు. వీటిని Poisonousగా పరిగణిస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే.. ‘దాన్ని మీరు తింటే లేదా తాకితే మీకు విష ప్రభావం కలిగితే అది పాయిజనస్’ అని గుర్తుపెట్టుకోవచ్చు.

34
వెనమస్ (Venomous) అంటే ఏమిటి?
Image Credit : Gemini AI

వెనమస్ (Venomous) అంటే ఏమిటి?

వెనమస్ జీవులు విషాన్ని స్వయంగా ఉత్పత్తి చేసి, దాన్ని ప్రత్యేకమైన శరీర భాగాల ద్వారా మరో జీవి శరీరంలోకి ప్రవేశపెడతాయి. ఇందుకోసం కాటు వేయడం, కొరకడం లేదా ముళ్లు వంటి ప్రత్యేక వ్యవస్థలను ఉపయోగిస్తాయి.

పాములు దీనికి ప్రధాన ఉదాహరణ. విషపూరిత పాములు తమ విష గ్రంథుల్లో విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. కాటు వేసినప్పుడు కోరల ద్వారా ఆ విషాన్ని ప్రత్యర్థి శరీరంలోకి పంపుతాయి. అందుకే విషాన్ని కాటు ద్వారా ఇంజెక్ట్ చేసే పాములను వెనమస్ స్నేక్స్ అంటారు. అదే విధంగా కొన్ని సాలీడులు, తేళ్లు, కొన్ని కీటకాలు కూడా తమ విషాన్ని కాటు లేదా కుట్టడం ద్వారా శరీరంలోకి ప్రవేశపెడతాయి. ఇవి కూడా వెనమస్ జీవుల కిందకు వస్తాయి.

44
పాయిజనస్ vs వెనమస్ మధ్య ప్రధాన తేడా ఇదే...
Image Credit : AI Image

పాయిజనస్ vs వెనమస్ మధ్య ప్రధాన తేడా ఇదే...

పాయిజనస్, వెనమస్ పదాల మధ్య తేడాను గుర్తుపెట్టుకోవడానికి ఒక సులభమైన నియమం ఉంది. మీరు దేన్నైనా కరిస్తే లేదా తింటే మీకు ప్రాణాపాయం జరిగితే అది పాయిజనస్... ఏదైనా మిమ్మల్ని కరిస్తే లేదా కుడితే మీకు ప్రాణాపాయం జరిగితే అది వెనమస్. అంటే విషం ఎలా శరీరంలోకి చేరుతుందనేదే అసలు తేడా.

పాయిజనస్ జీవి తన విషాన్ని మనపైకి పంపేందుకు ప్రత్యేకమైన ఇంజెక్షన్ వ్యవస్థ అవసరం ఉండకపోవచ్చు. అదే వెనమస్ జీవికి మాత్రం విషాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రత్యేకమైన శరీర నిర్మాణం ఉంటుంది.

పాములన్నీ వెనమస్ కావు

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. పాము అంటే తప్పనిసరిగా వెనమస్ అని కాదు. ప్రపంచంలో అనేక రకాల పాములు ఉన్నాయి. వాటిలో విషాన్ని ఉత్పత్తి చేసి కాటు ద్వారా శరీరంలోకి పంపే పాములు ఒక వర్గం మాత్రమే. కొన్ని పాములు విషాన్ని కలిగి ఉండవు. మరికొన్ని పాముల్లో విషాన్ని ఉపయోగించే విధానం, కోరల నిర్మాణం వంటి అంశాలు కూడా భిన్నంగా ఉంటాయి. అందువల్ల పాము కనిపించగానే అది విషపూరితమా కాదా అని స్వయంగా నిర్ధారించడానికి ప్రయత్నించడం సురక్షితం కాదు.

విషం శరీరంలోకి ఎలా చేరుతుందనేదే ముఖ్యం

మన రోజువారీ భాషలో Poisonous, Venomous రెండింటినీ ‘విషపూరితమైన’ అనే అర్థంలో ఉపయోగిస్తుంటాం. కానీ శాస్త్రీయంగా చూస్తే వాటి మధ్య స్పష్టమైన తేడా ఉంది.

పాయిజనస్ = మనం తినడం లేదా తాకడం ద్వారా విష ప్రభావం కలిగించేది.

వెనమస్ = కాటు వేయడం, కుట్టు లేదా ప్రత్యేకమైన శరీర నిర్మాణం ద్వారా విషాన్ని మన శరీరంలోకి ప్రవేశపెట్టేది.

అందుకే ఇకపై విషపూరిత జీవుల గురించి చదివేటప్పుడు లేదా విన్నప్పుడు ఈ రెండు పదాలు కనిపిస్తే, విషం శరీరంలోకి చేరే విధానాన్ని బట్టి వాటి మధ్య తేడాను సులభంగా గుర్తించవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bharat Ratna vs Padma Vibhushan : ఇండియాలో అత్యున్నత పురస్కారం ఏది? ఏ అవార్డుకు ఎంత డబ్బు ఇస్తారో తెలుసా?
Recommended image2
YouTube Income : 500M సబ్‌స్క్రైబర్స్, ఏటా రూ.800 కోట్ల ఇన్కమ్.. ఈ టాప్ యూట్యూబర్ ఎవరో తెలుసా?
Recommended image3
Hyderabad : హైదరాబాద్ ను పట్నం, సికింద్రాబాద్ ను లష్కర్ అని ఎందుకంటారు? ఈ పేర్ల వెనక ఇంత హిస్టరీ ఉందా..!
Related Stories
Recommended image1
Snakes : రాగి పాత్రలు కనిపిస్తే చాలు పాములు పరిగెత్తుకొస్తాయా? ఎందుకో చెప్పిన సద్గురు
Recommended image2
Snakes : బాత్రూమ్, టాయిలెట్లలోకి పాములు ఎందుకు వస్తాయి? రాకుండా ఎలా ఆపాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved