MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • చరిత్రలో ఫిబ్రవరికి అన్యాయం జరిగిందా..? 28 రోజుల వెనకున్న స్టోరీ ఇదే

చరిత్రలో ఫిబ్రవరికి అన్యాయం జరిగిందా..? 28 రోజుల వెనకున్న స్టోరీ ఇదే

చరిత్రలో ఫిబ్రవరి నెలకు అన్యాయం జరిగిందా..? జూలై, ఆగస్ట్ నెలల కోసమే ఈ నెలను తక్కువ చేశారా..?  ఫిబ్రవరిలో 28 రోజులు, లీప్ ఇయర్ లో 29 రోజుల వెనక చరిత్ర, సైన్స్ ఫ్యాక్ట్స్ ఇవే..

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 05 2026, 07:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఫిబ్రవరికి చరిత్ర అన్యాయం చేసిందా..?
Image Credit : Calendar Screenshot

ఫిబ్రవరికి చరిత్ర అన్యాయం చేసిందా..?

సంవత్సరంలోని ప్రతి నెలలో 30 లేదా 31 రోజులు ఉంటాయి... కేవలం ఫిబ్రవరిలో మాత్రమే 28 రోజులు ఉంటాయి. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఫిబ్రవరిలోనే ఓ రోజు పెరుగుతుంది... లీప్ ఇయర్ లో 29 రోజులు ఉంటాయి. ఇలా తక్కువరోజులు ఉండటమే ఫిబ్రవరిని ప్రత్యేకంగా మార్చింది. అసలు ఫిబ్రవరిలోనే అతి తక్కువ రోజులు ఉండటంవెనక పలు కారణాలున్నాయి. చరిత్ర, సైన్స్ తో ముడిపడిన ఈ ఆసక్తికర విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

26
ఫిబ్రవరిలో 28 రోజులే ఎందుకంటే...
Image Credit : Getty

ఫిబ్రవరిలో 28 రోజులే ఎందుకంటే...

ప్రపంచ దేశాలన్ని ప్రస్తుతం ఒకే క్యాలెండర్ ను ఉపయోగిస్తుంటాయి. ఇందుకు మూలం రోమన్ క్యాలెండర్. అయితే ప్రస్తుతం ఏడాదిలో 12 నెలలు ఉన్నాయి... కానీ గతంలో కేవలం 10 నెలలే ఉండేవి. ఏడాది మార్చితో ప్రారంభమై డిసెంబరుతో ముగిసేది... జనవరి, ఫిబ్రవరి ఉండేవికావు.

కాలక్రమేణా సైన్స్ పై అవగాహన పెరిగి ఏడాదిలో 365 రోజులు ఉంటాయని గుర్తించారు.. అందుకు తగ్గట్లుగా మరో రెండు నెలలను యాడ్ చేశారు. అవే జనవరి, ఫిబ్రవరి... వీటిని ఏడాది చివర్లో ఉంచారు. అయితే అప్పుడు కూడా సంవత్సరంలోని 365 రోజులు ఈ నెలల్లో సరిగ్గా సరిపోలేదు. ఓ నెలలో ఎక్కువ ఉంటే ఓ నెలలో తక్కువగా ఉంటున్నారు... ఇది చాలా అశాస్త్రీయంగా ఉండటంతో అన్ని నెలల్లో రోజులను ఫిక్స్ చేసి చివరగా ఫిబ్రవరికి కేటాయించారు. అందుకే ఏడాదిలో మిగిలిన 28 రోజులు ఫిబ్రవరిలోకి వచ్చాయి.

Related Articles

Related image1
February Horoscope: ఫిబ్రవరిలో ఈ రాశులవారికి అద్భుతమైన ఫలితాలు.. నెలంతా హ్యాపీనే!
Related image2
February Horoscope: ఫిబ్రవరిలో ధనవంతులయ్యే 3 రాశులు ఇవే..!
36
ఫిబ్రవరిలో 28 రోజులు ఉండటానికి చారిత్రక కారణం...
Image Credit : Getty

ఫిబ్రవరిలో 28 రోజులు ఉండటానికి చారిత్రక కారణం...

రోమన్ కాలంలో ఫిబ్రవరిని అపశకునాల నెలగా భావించేవారు... శుద్ధి, పాప విమోచనాల కోసం చేసే ఆచారాలు చేసేవారు. అందుకే సంవత్సరంలో అతి తక్కువ రోజులు ఉండేలా ఈ నెలకు 28 రోజులు కేటాయించారు.

క్రీ.పూ. 45వ సంవత్సరంలో జూలియస్ సీజర్ క్యాలెండర్‌ను పూర్తిగా సరిచేశాడు. దీని ప్రకారం సంవత్సరంలో 365 రోజులను ప్రతి నెలకు 30, 31 రోజుల చొప్పున పంచారు. మిగిలిపోయిన రోజులను ఫిబ్రవరిలో చేర్చారు. ప్రతి నాలుగేళ్లకోసారి ఒక అదనపు రోజు (లీప్ ఇయర్) చేర్చారు... ఆ ఏడాది మాత్రం ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి.

46
జూలై, ఆగస్ట్ నెలల్లో 31 రోజులు ఎందుకుంటాయి..?
Image Credit : Getty

జూలై, ఆగస్ట్ నెలల్లో 31 రోజులు ఎందుకుంటాయి..?

క్యాలెండర్ ను పరిశీలిస్తే జనవరితో ప్రారంభమై డిసెంబర్ తో ముగుస్తుంది... ఓ నెలలో 31 రోజులుంటే ఆ తర్వాతి నెలలో 30 రోజులు ఉంటాయి. అయితే జూలై, ఆగస్ట్ నెలల్లో మాత్రమే వరుసగా 31 రోజులు ఉంటాయి. ఇందుకు కూడా చారిత్రక కారణం ఉంది.

రోమన్ చక్రవర్తులు తమ పేర్లు చరిత్రలో నిలిచిపోవాలని కొన్ని నెలలకు పెట్టారు. ఇలా జూలై అనేది జూలియస్ సీజర్, ఆగస్ట్ ను ఆగస్టస్ సీజర్ పేరుతో వచ్చాయి. తమ పేర్లతో ఉండే నెలలు పెద్దవిగా ఉండాలి అనే భావనతో ఇందులో వరుసగా 31 రోజులు పెట్టారని చెబుతారు. ఇందుకోసమే ఫిబ్రవరి నుంచి రోజులు తీసేశారని చరిత్ర చెబుతోంది. దీంతో ఫిబ్రవరి ఎప్పటికీ చిన్న నెలగానే మిగిలిపోయింది.

56
లీప్ ఇయర్ ఎందుకు వస్తుంది..?
Image Credit : our own

లీప్ ఇయర్ ఎందుకు వస్తుంది..?

మన భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే సమయం 365 రోజుల 6 గంటలు. ప్రతి సంవత్సరం ఈ 6 గంటలు లెక్కలోకి తీసుకోకపోతే కాలక్రమంలో కాలాలు పూర్తిగా మారిపోతాయి. అందుకే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఆ అదనపు 6 గంటలన్నీ కలిపి ఒక రోజు (24 గంటలు) గా మార్చారు. దీన్ని ఫిబ్రవరి నెలకు జోడిస్తారు... ఇదే లీప్ ఇయర్ రహస్యం.

66
ఫిబ్రవరి చాలా స్పెషల్...
Image Credit : Getty

ఫిబ్రవరి చాలా స్పెషల్...

ఏడాదిలో చిన్న నెల అయినా ఫిబ్రవరి చాలా ప్రత్యేకమైనది. లీప్ ఇయర్, వాలెంటైన్స్ డే, సీజన్ మార్పులు… అన్నీ ఈ నెలలోనే కనిపిస్తాయి. కాబట్టి ఫిబ్రవరి చిన్న నెలకాదు... చరిత్ర, సైన్స్ కలిపి సృష్టించిన ప్రత్యేకమైన నెల.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
యుటిలిటీ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Viral Video: శ్మశానం నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టిన మహిళ, వణికిపోయిన డెలివరీ బాయ్
Recommended image2
Interesting facts: బార్డ‌ర్‌లో ఫెన్షింగ్‌కు ఇలా ఖాళీ సీసాలు ఎందుకు వేలాడ‌దీస్తారో తెలుసా.?
Recommended image3
ప్రపంచంలోనే అత్యంత ధనిక అమ్మాయిల బ్రోకర్ వీడే... సొంత దీవి, బోయింగ్ విమానం..!
Related Stories
Recommended image1
February Horoscope: ఫిబ్రవరిలో ఈ రాశులవారికి అద్భుతమైన ఫలితాలు.. నెలంతా హ్యాపీనే!
Recommended image2
February Horoscope: ఫిబ్రవరిలో ధనవంతులయ్యే 3 రాశులు ఇవే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved