February Horoscope: ఫిబ్రవరిలో ఈ రాశులవారికి అద్భుతమైన ఫలితాలు.. నెలంతా హ్యాపీనే!
February Horoscope: ఈ మాస ఫలాలు ఫిబ్రవరి నెలకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల మాస ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మాస ఫలాలు
ఈ మాస ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ నెల ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
అనుకున్న పనులు అనుకున్న టైంకి పూర్తిచేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా ఉంటాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వైవాహిక జీవితం, ప్రేమ బంధంలో సంతోషం నెలకొంటుంది.
వృషభ రాశి ఫలాలు
ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోయి, ఇంటి వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయానికి లోటు ఉండదు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు చకచకా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. వ్యాపారాలు లాభదాయకం. జీవిత భాగస్వామి ద్వారా అదృష్టం కలిసివస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు అనుకూలం.
మిథున రాశి ఫలాలు
చేపట్టిన పనుల్లో విజయం దక్కుతుంది. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఇంట్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న టైంకి పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వకపోవడం మంచిది. కొత్త పరిచయాలు లాభాదాయకంగా ఉంటాయి. పిల్లల చదువు విషయంలో శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరిగినప్పటికీ, మంచి ఫలితం పొందుతారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి.
సింహ రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఏ పని చేపట్టినా విజయం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చిన్న ప్రయత్నంతో పెద్ద విజయాలు దక్కుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కాస్త శ్రమ పడాల్సి ఉంటుంది.
కన్య రాశి ఫలాలు
అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బంధువులతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. కుటుంబ విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకొని ముందుకు సాగడం మంచిది. ఇంటా బయటా మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అవకాశం దక్కుతుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి.
తుల రాశి ఫలాలు
వృత్తి, ఉద్యో గాల్లో పదోన్నతులు పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు లాభాలబాట పడతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు.
వృశ్చిక రాశి ఫలాలు
చిన్న ప్రయత్నంతో మంచి ఫలితాలు పొందుతారు. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పనులు చకచకా పూర్తి చేస్తారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఉద్యోగంలో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆదాయం బాగుంటుంది. కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. డబ్బు పరంగా ఇతరులకు మాట ఇవ్వకపోవడమే మంచిది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం దక్కుతుంది.
ధనుస్సు రాశి ఫలాలు
ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో నష్టాలు తగ్గుతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. దైవ కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగం మారాలి అనుకున్నవారికి ఇది మంచి సమయం. బంధు మిత్రులకు సహాయంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు.
మకర రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. కొన్ని సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఆరోగ్య పరంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు అంతంత మాత్రంగా సాగుతాయి. జీవిత భాగస్వామి సహాయంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు.
కుంభ రాశి ఫలాలు
చేపట్టిన పనుల్లో విజయం దక్కుతుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలు నిజమవుతాయి. అప్పుల సమస్య నుంచి ఊరట లభిస్తుంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం దక్కే అవకాశం ఉంది. విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది.
మీన రాశి ఫలాలు
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగులకు విదేశాలు వెళ్లే అవకాశం రావచ్చు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వివాహ ప్రయత్నాలు కలిసివస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసివస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు చేస్తారు.

