MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Feature
  • Train Speed: పగటిపూటతో పోలిస్తే రాత్రిపూట రైళ్లు ఎందుకు స్పీడ్‌గా వెళ్తాయి? దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే

Train Speed: పగటిపూటతో పోలిస్తే రాత్రిపూట రైళ్లు ఎందుకు స్పీడ్‌గా వెళ్తాయి? దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే

Train Speed: రైలులో ప్రయాణిస్తున్నప్పుడు గమనించే ఉంటారు… పగటిపూట కన్నా రాత్రిపూట ట్రైన్ చాలా వేగంగా వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది. నిజంగానే స్పీడ్ పెరుగుతుందా? లేక మన భ్రమా? ఈ విషయం తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 20 2026, 10:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రైలు ప్రయాణంలో ఇది గమనించారా?
Image Credit : Gemini AI

రైలు ప్రయాణంలో ఇది గమనించారా?

రైలు ప్రయాణం ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది.  పగటిపూట కన్నా రాత్రిపూట రైలు ప్రయాణం చాలా బాగుంటుంది. కిటికీల నుంచి వచ్చే గాలి శబ్దం, పట్టాల చప్పుడు... చాలా వేగంగా సాగుతున్న ఫీలింగ్ వస్తుంది. అయితే  రాత్రిపూట రైలు వేగం పెరుగుతుందా? లేక మనకు అలా అనిపిస్తుందా? పగటి పూట కన్నా రాత్రి పూట రైలు నిజంగానే వేగంగా వెళుతుందా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
విజువల్ ఇల్యూషన్
Image Credit : Getty

విజువల్ ఇల్యూషన్

రాత్రిపూట రైలు వేగంగా వెళ్తున్నట్లు అనిపిస్తుంది. పగటి పూట కూడా ఇదే వేగంతో వెళుతుంది. అయితే రాత్రిపూట వేగంగా అనిపించడానికి కారణం 'విజువల్ ఇల్యూషన్'. పగలు మనం దూరంగా ఉన్న కొండలు, చెట్లను చూస్తాం. అవి నెమ్మదిగా కదులుతున్నట్లు కనిపిస్తాయి. కానీ రాత్రికి దగ్గరగా ఉన్న కరెంట్ స్తంభాలు, లైట్లు మాత్రమే కనిపిస్తాయి. అవి వేగంగా వెనక్కి వెళ్తుండటంతో, రైలు రాకెట్ స్పీడ్‌తో వెళ్తోందని మన మెదడుకు అనిపిస్తుంది.

34
ఉదయం పూట సిగ్నల్స్
Image Credit : Gemini AI

ఉదయం పూట సిగ్నల్స్

పగటిపూట ఎండ వల్ల, చెట్ల వల్ల లోకో పైలట్‌కు సిగ్నల్స్ స్పష్టంగా కనిపించవు. దీంతో సిగ్నల్ ఎరుపు రంగులో ఉందో, పసుపు రంగులో ఉందో నిర్ధారించుకునే వరకు వేగాన్ని తగ్గిస్తారు. కానీ రాత్రిపూట సిగ్నల్ లైట్లు సుమారు 2 కిలోమీటర్ల దూరం నుంచే ప్రకాశవంతంగా కనిపిస్తాయి. గ్రీన్ సిగ్నల్ దూరం నుంచే కనిపించడంతో, లోకో పైలట్ బ్రేక్ వేయకుండా గరిష్ఠ వేగంతో రైలును నడుపుతారు.
44
పగటి పూట ఒక్కోసారి వేగం తగ్గుతుంది
Image Credit : Asianet News

పగటి పూట ఒక్కోసారి వేగం తగ్గుతుంది

పగటిపూట రైల్వే ట్రాక్‌పై మరమ్మతులు, వెల్డింగ్ పనులు జరుగుతాయి. అప్పుడు 'కాషన్ ఆర్డర్స్' (Caution Orders) కారణంగా రైలును నెమ్మదిగా నడపాల్సి ఉంటుంది. మనుషులు, జంతువులు కూడా పట్టాలు దాటుతుంటారు. కానీ రాత్రి 10 గంటల తర్వాత ఈ పనులన్నీ ఆగిపోతాయి. ట్రాక్ ఖాళీగా ఉండటంతో, రైలు గంటకు 110 నుంచి 130 కి.మీ గరిష్ఠ వేగంతో దూసుకుపోతుంది.

మన మెదడు సృష్టించే దృశ్య భ్రాంతి, స్పష్టమైన సిగ్నల్స్, అడ్డంకులు లేని ఖాళీ ట్రాక్... ఈ మూడు కారణాల వల్లే రాత్రిపూట రైలు ప్రయాణం మనకు చాలా వేగంగా, థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. కాబట్టి, మరోసారి మీరు రాత్రి రైల్లో వెళ్తున్నప్పుడు, ఆ వేగానికి భయపడకుండా ఈ సైన్స్‌ను గుర్తుచేసుకోండి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Snake Venom Medicines: ప్రాణాలు తీసే పాముల విషమే ఇప్పుడు సంజీవని !
Recommended image2
Rainbow : ఇంద్రధనుస్సు ఎప్పుడూ వంగే ఎందుకు కనిపిస్తుంది? దీని వెనక ఇంత సైన్స్ దాగుందా..!
Recommended image3
Psychology: ఒక వ్యక్తిని మర్చిపోవడం ఎందుకు అంత కష్టం? సైకాలజీ ఏం చెబుతోంది?
Related Stories
Recommended image1
Lucky dates: ఈ తేదీల్లో పుట్టిన వారు ఏదో ఒక వయసులో ధనవంతులై తీరుతారు
Recommended image2
Venus Blessings: శుక్రుడి దయతో ఈ 4 రాశులవారికి ధన యోగం మొదలు, ఆరోజు వరకు వీరికి తిరుగే ఉండదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved