Telugu

బ్యాచిలర్స్ Vs పెళ్లైన మగాళ్లు.. వీరిలో ఎక్కువకాలం బ్రతికేది ఎవరు?

Telugu

యువతకు ఇలా బ్రతకడమే ఇష్టం

ప్రతి ఒక్కరికీ పెళ్లిపై తమదైన ఆలోచన ఉంటుంది. మారుతున్న కాలంలో ఒంటరిగా ఉండటానికి నేటి యువతరం ఇష్టపడుతోంది. ఎలాంటి బాధ్యత లేకుండా స్వేచ్ఛగా బతకాలని కోరుకుంటున్నారు.

Image credits: freepik
Telugu

42% మందికి పెళ్లి వద్దట..

ఓ సర్వే ప్రకారం ఇండియాలో 42 శాతం మంది యువతకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదట. వాళ్లు ఎవరిపైనా ఆధారపడకుండా తమ జీవితాన్ని గడపడాలని అనుకుంటున్నారట.

Image credits: freepik
Telugu

ఎవరి ఆయుష్షు ఎక్కువ..?

పెళ్లైన మగాళ్లు, బ్యాచిలర్స్‌లో ఎవరి ఆయుష్షు ఎక్కువ అనే దానిపై ఓ అధ్యయనం జరిగింది. ఇందులో ఆసక్తికర విషయాలు బైటపడ్డాయి.

Image credits: AI Meta
Telugu

అధ్యయనం ఏం చెబుతోంది..?

జామా నెట్‌వర్క్ ఓపెన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. పెళ్లికాని మగాళ్ల కంటే పెళ్లైన వాళ్లే ఎక్కువ కాలం జీవిస్తారట. పెళ్లైన పురుషుల్లో మరణాల రేటు 15 శాతం తక్కువగా ఉందట. 

Image credits: AI Meta
Telugu

50-60 ఏళ్ల వారిపై పరిశోధన

ఆసియాలో 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న 6,23,000 మంది ఆరోగ్యంపై ఈ అధ్యయనం చేశారు. జపాన్ పరిశోధకులు 15 ఏళ్ల పాటు ఈ రీసెర్చ్ పూర్తి చేశారు.

Image credits: AI Meta
Telugu

పెళ్లికాని వారి ఆయుష్షు తక్కువ

పెళ్లైన పురుషులతో పోలిస్తే.. విడాకులు తీసుకున్న, పెళ్లికాని మగాళ్లలో ఆయుర్దాయం తక్కువగా ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది.

Image credits: AI Meta
Telugu

మరణం ముప్పు 20% తక్కువ

పెళ్లికాని వారితో పోలిస్తే పెళ్లైన జంటలు ప్రమాదాలు, గాయాలు లేదా గుండె జబ్బులతో చనిపోయే అవకాశం 20 శాతం తక్కువగా ఉంటుంది. 

Image credits: AI Meta
Telugu

ఎక్కువ కాలం బతకడానికి కారణం?

 పెళ్లైన వాళ్లు తమ జీవితంలో తక్కువ రిస్క్ తీసుకుంటారు. ఈ కారణంగా ఆల్కహాల్, మాధకద్రవ్యాల బారినపడి చనిపోయే ప్రమాదం కూాడా తక్కువే.

Image credits: Getty

షుగర్ ఉత్పత్తి, వాడకంలో వరల్డ్ నెంబర్ 1 ఎవరో తెలుసా..?

Snakes : పాములు నిజంగానే నిధుల్ని కాపాడతాయా?

సైన్స్ కు అందని అద్భుతం.. రోజుకు మూడుసార్లు రంగులు మార్చే శివలింగం

AC Bill : మే నెలలో ఏసీ బిల్లు తక్కువ రావాలా? ఈ సింపుల్ ట్రిక్ ఫాలోకండి