MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Feature
  • Viral News : పేరు సుల్తాన్, బరువు 200 కిలోలు, ధర రూ.8 లక్షలు..: ఇది ఓ మేక ఇంట్రెస్టింగ్ స్టోరీ

Viral News : పేరు సుల్తాన్, బరువు 200 కిలోలు, ధర రూ.8 లక్షలు..: ఇది ఓ మేక ఇంట్రెస్టింగ్ స్టోరీ

Sultan Goat : సాధారణంగా ఓ మేక ధర రూ.20 వేల నుండి రూ.30 వేల వరకు ఉంటుంది. మహా అయితే రూ.50 వేలు ఉంటుంది. కానీ ఓ మేక ధర ఏకంగా రూ.8 లక్షలట. ఇంతకూ దాని ప్రత్యేకత ఏంటో తెలుసా..?

2 Min read
Author : Arun Kumar P
Published : May 28 2026, 06:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఈ మేకలు చాలా స్పెషల్ గురూ..
Image Credit : Gemini AI

ఈ మేకలు చాలా స్పెషల్ గురూ..

ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే పండగ బక్రీద్. త్యాగానికి ప్రతీకగా దీన్ని జరుపుకుంటారు కాబట్టి 'ఖుర్బానీ పండగ' లేదా 'ఈద్-ఉల్-అధా' అని కూడా పిలుచుకుంటారు. రంజాన్ తర్వాత ముస్లింలు జరుపుకునే అతిపెద్ద పండగ ఇది. దేశవ్యాప్తంగా ఇవాళ (మే 28, గురువారం) బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి.

బక్రీద్ పండగపూట మూగ జీవాలను మరీముఖ్యంగా మేక, గొర్రెలను బలి ఇవ్వడం ముస్లిం సాంప్రదాయంలో భాగం. అందుకే ఈ సమయంలో మేకలకు ఫుల్ గిరాకీ ఉంటుంది... ఇలాంటి టైంలో మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌ పట్టణానికి చెందిన ఓ మేక సోషల్ మీడియాలో స్టార్ అయిపోయింది. దాని పేరు 'సుల్తాన్'. పంజాబీ బీటల్ జాతికి చెందిన ఈ మేక బరువు ఏకంగా 200 కిలోలు. దీని యజమాని పేరు మొయీన్ ఖాన్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఏమిటీ ఈ 'సుల్తాన్' మేక ప్రత్యేకత..?
Image Credit : Gemini AI

ఏమిటీ ఈ 'సుల్తాన్' మేక ప్రత్యేకత..?

సుల్తాన్ అంటే మామూలు మేక కాదు. తాగడానికి పాలు, తినడానికి డ్రై ఫ్రూట్స్, ఉండటానికి ఏకంగా కూలర్.. ఇలా ఫుల్ లగ్జరీ లైఫ్ గడుపుతోంది. ఈ రేంజ్ లైఫ్‌స్టైల్ వల్లే సోషల్ మీడియాలో సుల్తాన్ తెగ వైరల్ అయ్యింది. సుల్తాన్‌తో పాటు 'గోలు లాలా' అనే మరో మేక కూడా తన రాయల్ లైఫ్‌తో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ బక్రీద్‌ సందర్భంగా ఈ రెండు మేకలను యజమానులు బలి ఇచ్చారు.

సుల్తాన్ పంజాబీ బీటల్ జాతికి చెందిన మేక. దీని బరువు 200 కిలోలకు పైనే ఉంటుంది. ఎత్తు దాదాపు 48 అంగుళాలు. ఇండోర్ లోని గుల్జార్ కాలనీకి చెందిన మొయీన్ ఖాన్ దీని యజమాని. ఏడాది క్రితం పంజాబ్ నుంచి దీన్ని తీసుకొచ్చినట్లు మొయీన్ ఖాన్ చెప్పారు. ఇందుకోసం రెండు రోజుల్లో 1000 కిలోమీటర్లు ప్రయాణించారట. సొంత మనిషిలా చూసుకుంటూ పెంచామని ఆయన అంటున్నారు.

ईद के मौके पर इंदौर में आया 8 लाख का बकरा#MPNews #indore #viralvideochallenge pic.twitter.com/2zwT8cgYyF

— टीटू भारद्वाज (@teetusharma6) May 27, 2026

34
సుల్తాన్ మెనూ ఇదే..
Image Credit : Gemini AI

సుల్తాన్ మెనూ ఇదే..

సుల్తాన్ రోజువారీ మెనూలో 2 లీటర్ల పాలు, 250 గ్రాముల డ్రై ఫ్రూట్స్, దాదాపు 10 కిలోల ఆకులు ఉంటాయి. ఎండ వేడి నుంచి కాపాడటానికి దీనికి ప్రత్యేకంగా కూలర్ కూడా ఉంది. తాగడానికి చల్లటి నీళ్లు, మజ్జిగ ఇస్తారు. సుల్తాన్‌కు సొంతంగా ఓ గది కూడా కేటాయించారు. ఫేమస్ అవ్వడంతో సుల్తాన్‌కు ఏకంగా 8 లక్షల రూపాయల ధర పలికింది. దీన్ని చూడటానికి జనం దూరం దూరం నుంచి వస్తున్నారని తెలుస్తోంది.

44
ఇది 'గోలు లాలా' మేక ప్రత్యేకత
Image Credit : unsplash

ఇది 'గోలు లాలా' మేక ప్రత్యేకత

ఇక 'గోలు లాలా' అనే మరో మేక కూడా ఇండోర్ బక్రీద్ మార్కెట్‌లో తెగ ఫేమస్ అయింది. దీన్ని ఏడాది క్రితం కొన్నామని యజమాని ఫాతిమా చెప్పారు. దీన్ని కూడా కుటుంబ సభ్యుడిలాగే పెంచారట. 

గోలు లాలకి పడుకోవడానికి సొంతంగా మంచం కూడా ఉంది. ఉదయాన్నే పార్లే-జి బిస్కెట్లు తింటుంది. ఆ తర్వాత ఇంట్లోవాళ్లు తినే ఆహారంలో వాటా ఇస్తారు. బాదం, జీడిపప్పు, పాలు కూడా దీని మెనూలో ఉన్నాయి. ఎండకాలంలో వేడి తగలకుండా దీనికి కూడా స్పెషల్ కూలర్ ఏర్పాటు చేశారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వైరల్ న్యూస్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rats Behavior : ఎలుకలు ఏ వస్తువులనైనా ఎందుకు కొరికి పాడుచేస్తాయి? అసలు కారణం ఇదే..!
Recommended image2
చిన్నారులపై లైంగిక అరాచకాలు తగ్గాలంటే... 'టింగ్ టాంగ్' ఫార్ములా ఫాలో అవ్వాల్సిందే, అంటే ఏమిటో తెలుసా?
Recommended image3
Heritage Trains: 170 ఏళ్లు వచ్చినా తగ్గని ఫేరీ క్వీన్ స్పీడ్.. ఇండియాలోని టాప్ 5 హెరిటేజ్ రైళ్లు ఇవే
Related Stories
Recommended image1
Goat vs Sheep: మేకకు, గొర్రెకు మ‌ధ్య తేడా ఏంటి.? రెండింటిలో ఆరోగ్యానికి ఏ మ‌ట‌న్ మంచిది.?
Recommended image2
Goat Blood: మేక రక్తం తింటున్నారా? మంచిదా కాదా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved