MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Feature
  • Psychology: సైకాలజీ ప్రకారం కొన్ని పాటలు వింటే పాత జ్ఞాపకాలు ఎందుకు గుర్తొస్తాయో తెలుసా?

Psychology: సైకాలజీ ప్రకారం కొన్ని పాటలు వింటే పాత జ్ఞాపకాలు ఎందుకు గుర్తొస్తాయో తెలుసా?

Psychology: మీరు ఎప్పుడైనా ఒక పాట వింటూ ఒక్కసారిగా పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారా? చాలా ఏళ్ల క్రితం కలిసిన వ్యక్తి, స్కూల్ డేస్, లేదా జీవితంలో మరచిపోలేని సంఘటన గుర్తొచ్చిందా? అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? దీని గురించి సైకాలజీ ఏం చెబుతోందో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Jul 13 2026, 01:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాటల వల్ల కలిగే మానసిక ప్రభావాలు
Image Credit : Getty

పాటల వల్ల కలిగే మానసిక ప్రభావాలు

కొన్ని పాటలు వినగానే ఒక్కసారిగా చిన్ననాటి రోజులు గుర్తుకు రావడం, స్కూల్ ఫ్రెండ్స్, లేదా స్పెషల్ పర్సన్ తో గడిపిన క్షణాలు కళ్లముందు మెదలడం చాలామందికి జరుగుతుంటుంది. కొన్నిసార్లు మర్చిపోయిన సంఘటనలు కూడా ఒక పాట విన్న వెంటనే స్పష్టంగా గుర్తుకు వస్తాయి. సైకాలజీ నిపుణుల ప్రకారం ఇది యాదృచ్ఛికంగా జరిగేది కాదు. మన మెదడు సంగీతాన్ని, భావోద్వేగాలను, జ్ఞాపకాలను ఒకదానితో ఒకటి కలిపి స్టోర్ చేసుకోవడం వల్ల అలా జరుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అదే పాట మళ్లీ వింటే?
Image Credit : Getty

అదే పాట మళ్లీ వింటే?

సైకాలజీ ప్రకారం ఏదైనా సంఘటన జరిగినప్పుడు మన మెదడులో ఆ సంఘటన మాత్రమే కాదు, ఆ సమయంలో మనం విన్న సౌండ్స్, సాంగ్స్, పరిసరాలు, భావోద్వేగాలు కూడా స్టోర్ అవుతాయి. కాలేజ్ డేస్ లో తరచుగా విన్న ఒక పాట.. స్నేహితులు, తరగతి గది లేదా ఏదైనా స్పెషల్ మూమెంట్ తో అనుసంధానమై ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత అదే పాట మళ్లీ వినిపిస్తే, ఆ పాటతో ఉన్న జ్ఞాపకాలు కూడా మన బ్రెయిన్ లో యాక్టివేట్ అవుతాయి.

Related Articles

Related image1
Psychology: సైకాలజీ ప్రకారం మన మెదడు మనకు అబద్ధం చెప్పే 5 సందర్భాలు ఇవే!
Related image2
Psychology: సైకాలజీ ప్రకారం భర్త మొదటి ప్రాధాన్యం ఎవరికివ్వాలి? భార్యకా.. తల్లికా?
35
మనకు తెలియకుండానే..
Image Credit : Gemini

మనకు తెలియకుండానే..

ఒక పాటతో ఆనందం, ప్రేమ, బాధ లేదా ఉత్సాహం వంటి ఎమోషన్స్ ముడిపడి ఉంటే, ఆ పాట వినగానే మన మెదడులోని కొన్ని భాగాలు ఆ అనుభూతులను మళ్లీ గుర్తుకు తెస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే కొన్ని పాటలు వినగానే మనకు తెలియకుండానే చిరునవ్వు రావడం, మరికొన్ని పాటలు వినగానే కళ్లలో నీళ్లు తిరుగడం వంటివి జరుగుతాయట.

45
జీవితాంతం గుర్తుండే అవకాశం..
Image Credit : Getty

జీవితాంతం గుర్తుండే అవకాశం..

కొన్ని పరిశోధనల ప్రకారం యవ్వనంలో, ముఖ్యంగా 15 నుంచి 30 సంవత్సరాల మధ్య విన్న పాటలు జీవితాంతం గుర్తుండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ దశలో మన జీవితంలో ఎన్నో ముఖ్యమైన అనుభవాలు, కొత్త పరిచయాలు, భావోద్వేగ సంఘటనలు చోటుచేసుకుంటాయి. అవన్నీ ఆ సమయంలో విన్న మ్యూజిక్ తో అనుసంధానమై ఉండవచ్చు. 

నిపుణుల ప్రకారం సంగీతం వినోదం మాత్రమే కాదు, అది మన భావోద్వేగాలను ప్రభావితం చేసే ఒక శక్తివంతమైన సాధనం. మనం సంతోషంగా ఉన్నప్పుడు ఒక పాటను వింటే, తర్వాత అదే పాట వినప్పుడు మళ్లీ హ్యాపీగా అనిపించవచ్చు. అదే బాధలో ఉన్నప్పుడు విన్న పాట అయితే, అది వినగానే విచారం కూడా కలగవచ్చు. ఇది పాట వల్ల కాదు, ఆ పాటకు మన మెదడు ఇచ్చిన భావోద్వేగ అనుసంధానం వల్ల జరుగుతుంది.

55
మనసుకు ప్రశాంతత
Image Credit : stockPhoto

మనసుకు ప్రశాంతత

కొన్ని సందర్భాల్లో పాత జ్ఞాపకాలను గుర్తు చేసే పాటలు మనసుకు ఉపశమనం కూడా కలిగిస్తాయి. చిన్ననాటి మధుర జ్ఞాపకాలు, కుటుంబ సభ్యులతో గడిపిన సమయం లేదా స్నేహితులతో ఉన్న అనుభవాలు గుర్తుకు రావడం వల్ల ఒత్తిడి తగ్గి, మనసుకు ప్రశాంతంగా అనిపించవచ్చు. అయితే ప్రతి పాట అందరికీ ఒకే రకమైన జ్ఞాపకాలను గుర్తుకు తేదు. ప్రతి వ్యక్తి జీవిత అనుభవాలు, సంబంధాలు, భావోద్వేగాలు వేర్వేరుగా ఉంటాయి. ఒకే పాట ఒకరికి ఆనందాన్ని కలిగిస్తే, మరొకరికి బాధను కూడా గుర్తు చేయవచ్చు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
విమానంలో కొబ్బరికాయను ఎందుకు తీసుకెళ్లనివ్వరు? కారణం తెలిస్తే అవాక్కవుతారు
Recommended image2
School Uniforms : ఒక్కో స్కూల్ యూనిఫామ్స్ ఒక్కోలా ఉంటాయి.. ఎందుకో తెలుసా?
Recommended image3
Psychology: సైకాలజీ ప్రకారం మీ భర్తలో ఈ 5 లక్షణాలు ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులే!
Related Stories
Recommended image1
Psychology: సైకాలజీ ప్రకారం మన మెదడు మనకు అబద్ధం చెప్పే 5 సందర్భాలు ఇవే!
Recommended image2
Psychology: సైకాలజీ ప్రకారం భర్త మొదటి ప్రాధాన్యం ఎవరికివ్వాలి? భార్యకా.. తల్లికా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved