MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Feature
  • Psychology: సైకాలజీ ప్రకారం భర్త మొదటి ప్రాధాన్యం ఎవరికివ్వాలి? భార్యకా.. తల్లికా?

Psychology: సైకాలజీ ప్రకారం భర్త మొదటి ప్రాధాన్యం ఎవరికివ్వాలి? భార్యకా.. తల్లికా?

Psychology: పెళ్లి తర్వాత భర్త మొదటి ప్రాధాన్యం ఎవరివ్వాలి అనే ప్రశ్న ప్రతి కుటుంబంలో వినిపిస్తుంది. కొందరు తల్లే మొదటి ప్రాధాన్యం అంటే.. మరికొందరు భార్యకే మొదటి స్థానం ఇవ్వాలని వాదిస్తారు. అయితే సైకాలజీ నిపుణులు దీని గురించి ఏం చెబుతున్నారో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Jul 06 2026, 01:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భర్త మొదటి ప్రాధాన్యం ఎవరికివ్వాలి?
Image Credit : AI

భర్త మొదటి ప్రాధాన్యం ఎవరికివ్వాలి?

పెళ్లి తర్వాత చాలా కుటుంబాల్లో ఎక్కువగా వినిపించే ప్రశ్నల్లో ఒకటి.. భర్త మొదటి ప్రాధాన్యం భార్యకా? లేక తల్లికా? అని. ఈ అంశంపై ఎన్నో అపోహలు, వాదనలు ఉన్నప్పటికీ.. సైకాలజీ ప్రకారం.. పెళ్లి తర్వాత భర్తకు భార్యతో ఏర్పడే బంధం కొత్త కుటుంబ వ్యవస్థకు కేంద్రంగా మారుతుంది. అంటే తల్లిని ప్రేమించడం లేదా గౌరవించడం తగ్గించాలనే అర్థం కాదు. కానీ జీవిత నిర్ణయాలు, భవిష్యత్ ప్రణాళికలు, ఆర్థిక వ్యవహారాలు, పిల్లల పెంపకం వంటి అంశాల్లో భార్యాభర్తలు కలిసి నిర్ణయాలు తీసుకోవడం ఆరోగ్యకరమైన దాంపత్య జీవితానికి పునాది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భర్త ఎలా ఉండాలంటే?
Image Credit : chatgpt

భర్త ఎలా ఉండాలంటే?

సైకాలజీ నిపుణుల ప్రకారం, భర్త తన తల్లికి ఎప్పటిలాగే ప్రేమ, గౌరవం, ఆదరణ ఇవ్వాలి. అదే సమయంలో భార్యకు భావోద్వేగ భద్రత కల్పించడం కూడా అతని ముఖ్యమైన బాధ్యత. భార్యకు తన భర్త అండగా ఉన్నాడనే నమ్మకం ఉంటే దాంపత్య బంధం మరింత బలపడుతుంది. అలాంటి బంధం పిల్లల పెంపకంపైనా, కుటుంబ వాతావరణంపైనా సానుకూల ప్రభావం చూపుతుంది. ఒకవేళ భార్యకు తాను ఎప్పుడూ రెండో స్థానంలోనే ఉన్నాననే భావన కలిగితే, అది క్రమంగా దూరానికి, అపార్థాలకు, మనస్పర్థలకు దారి తీసే అవకాశం ఉంటుంది.

Related Articles

Related image1
Psychology: సైకాలజీ ప్రకారం మనిషి నిజ స్వరూపం బయటపడే 5 సందర్భాలు ఇవే..!
Related image2
Parenting: తల్లిదండ్రులు పిల్లలకు పొరపాటున కూడా చెప్పకూడని 5 మాటలు ఇవే!
35
ఇద్దరి మాటలను ఓపికగా వినడం
Image Credit : AI Image

ఇద్దరి మాటలను ఓపికగా వినడం

కొందరు భర్తలు భార్యకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో తల్లిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు ప్రేమ, గౌరవం, భరోసా మరింత అవసరం. వారిని చిన్నచూపు చూడడం, వారి భావాలను పట్టించుకోకపోవడం మంచిది కాదు. తల్లిని గౌరవిస్తూ, భార్యను భాగస్వామిగా నిలబెట్టడం నిజమైన సమతుల్యత. కుటుంబ విభేదాలకు ప్రధాన కారణం తమను పట్టించుకోవడం లేదనే భావన కలగడమే. సైకాలజీ ప్రకారం భర్త ఎప్పుడూ తల్లి, భార్య.. ఇద్దరి మాటలను ఓపికగా వినాలి. సమస్య వచ్చినప్పుడు ఒకరి మాట మాత్రమే నమ్మి తీర్పు చెప్పకుండా, వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవాలి.

45
ఒకరిని మరొకరితో పోల్చడం వద్దు
Image Credit : ChatGPT

ఒకరిని మరొకరితో పోల్చడం వద్దు

భార్య, తల్లి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు చాలామంది భర్తలు మౌనంగా ఉండటం లేదా పూర్తిగా ఒకరి వైపు నిలబడటం చేస్తుంటారు. కానీ నిపుణుల ప్రకారం సరైన మార్గం మధ్యవర్తిగా వ్యవహరించడం. ఇద్దరి భావాలను అర్థం చేసుకుని ప్రశాంతంగా మాట్లాడించడం, అపార్థాలు తొలిగేలా చేయడం, ఎవరికీ అవమానం  జరగకుండా పరిష్కారం చూపడం భర్త బాధ్యత. అలాగే భార్యను తల్లితో పోల్చడం, లేదా తల్లిని భార్యతో పోల్చడం ఎప్పుడూ చేయకూడదు. ఈ రెండు బంధాల స్వభావం పూర్తిగా వేరు. ఇద్దరి నుంచి ఒకే విధమైన ప్రవర్తనను ఆశించడం సంబంధాలను దెబ్బతీస్తుంది. ప్రతి వ్యక్తి ప్రత్యేకమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

55
ఇలా చేస్తే మరింత గౌరవం
Image Credit : Gemini AI

ఇలా చేస్తే మరింత గౌరవం

భర్త, భార్యకు గౌరవం ఇస్తే, భార్య కూడా అత్తగారిని మరింత గౌరవించే అవకాశం ఉంటుందని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా తల్లిని ప్రేమగా చూసుకునే కొడుకుని చూసి భార్యలో కూడా సానుభూతి పెరుగుతుందట. తల్లికి గౌరవం, ప్రేమ, ఆదరణ ఇవ్వడం కొడుకు ధర్మం. భార్యతో పరస్పర నమ్మకం, సహకారం, భావోద్వేగ భద్రతతో కొత్త కుటుంబాన్ని నిర్మించడం భర్త బాధ్యత. ఈ రెండింటి మధ్య సమతుల్యతను కాపాడగలిగిన వ్యక్తే మంచి కొడుకుగా, మంచి భర్తగా నిలుస్తాడని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
బంధుత్వం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Investment : ఈరోజు తులం బంగారం కొంటే 2050 నాటికి ఎంత డబ్బు వస్తుంది? లాభం ఎంత?
Recommended image2
Dimple Cheeks : కొందరి బుగ్గలపై సొట్టలు పడతాయి? ఈ సొట్టబుగ్గలకు కారణమేంటి?
Recommended image3
Ambani Ice cream: అంబానీ వారి ఐస్‌క్రీమ్.. అది కూడా కేవలం రూ.10లకే
Related Stories
Recommended image1
Psychology: సైకాలజీ ప్రకారం మనిషి నిజ స్వరూపం బయటపడే 5 సందర్భాలు ఇవే..!
Recommended image2
Parenting: తల్లిదండ్రులు పిల్లలకు పొరపాటున కూడా చెప్పకూడని 5 మాటలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved