MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Feature
  • Interesting Facts: అక్కడ ఒక్క చీమ కూడా ఉండదు.. అసలు బతకలేదు.. ఎందుకో తెలుసా?

Interesting Facts: అక్కడ ఒక్క చీమ కూడా ఉండదు.. అసలు బతకలేదు.. ఎందుకో తెలుసా?

Interesting Facts: సాధారణంగా చీమలు ఎక్కడపడితే అక్కడ ఉంటాయి. ఇల్లు, వాకిలి, రోడ్లు, చెట్ల దగ్గర ఇలా ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కనిపిస్తుంటాయి. కానీ ఒక ప్లేసులో ఒక్క చీమ కూడా కనిపించదు. అక్కడ చీమలు ఎందుకు ఉండవు? ఆ ప్రదేశం ఎక్కడుందో తెలుసుకుందాం.

1 Min read
Author : Kavitha G
Published : Jul 17 2026, 03:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చీమలు లేని ప్రదేశం
Image Credit : stockPhoto

చీమలు లేని ప్రదేశం

ప్రపంచంలో మనకు తెలియని వింతలు, ఆశ్చర్యకరమైన ప్రదేశాలు ఎన్నో ఉంటాయి. సాధారణంగా మన చుట్టూ ఎక్కడ చూసినా కనిపించే చీమలు ఒక ప్రదేశంలో అస్సలు ఉండవు. అదే ప్రపంచంలోనే అత్యంత చల్లని ఖండమైన అంటార్కిటికా. అక్కడి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు జీవుల మనుగడకు పెద్ద సవాలుగా నిలుస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తీవ్రమైన చలి కారణంగా..
Image Credit : Getty

తీవ్రమైన చలి కారణంగా..

అంటార్కిటికా మంచుతో కప్పబడిన ఖండం. ఇది ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఖండం అయినప్పటికీ, అక్కడి పరిస్థితులు ఇతర ఖండాల కంటే పూర్తి భిన్నంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో ఎక్కువ భాగం ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే చాలా తక్కువకు పడిపోతాయి. ఇలాంటి తీవ్రమైన చలిలో చీమలు వంటి కీటకాలు జీవించడం చాలా కష్టం.

Related Articles

Related image1
Psychology: సైకాలజీ ప్రకారం భార్యాభర్తలు ఒకరితో ఒకరు చెప్పకూడని 5 మాటలు ఇవే!
Related image2
Psychology: సైకాలజీ ప్రకారం మన మెదడు మనకు అబద్ధం చెప్పే 5 సందర్భాలు ఇవే!
35
జీవన పరిస్థితులు లేకపోవడం
Image Credit : our own

జీవన పరిస్థితులు లేకపోవడం

చీమలు జీవించడానికి ఒక నిర్దిష్టమైన వాతావరణం అవసరం. సాధారణంగా ఇవి భూమి లోపల, రాళ్లకింద, చెట్ల బెరళ్లలో జీవిస్తుంటాయి. ఆహారం కోసం బయటకు వస్తాయి. వాటి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి పరిసర ఉష్ణోగ్రతపై ఆధారపడతాయి. కానీ అంటార్కిటికాలో ఎక్కువ మంచు, గడ్డకట్టిన నేల, తీవ్రమైన గాలులు ఉండటం వల్ల చీమలకు అవసరమైన జీవన పరిస్థితులు ఉండవు.

45
వేడిని నిలుపుకోలేకపోవడం
Image Credit : Pinterest

వేడిని నిలుపుకోలేకపోవడం

శాస్త్రవేత్తల ప్రకారం చీమలు చిన్న పరిమాణంలో ఉండే జీవులు కాబట్టి వాటి శరీరంలో వేడిని నిలుపుకోవడం కష్టం. చాలా చల్లటి వాతావరణంలో వాటి కదలికలు తగ్గిపోతాయి. ఆహారం కోసం వెతకడం, గూడు నిర్మించడం వంటి పనులు సాధ్యం కావు. అందుకే అంటార్కిటికా వంటి ప్రదేశాలు వాటికి అనుకూలంగా ఉండవు.

55
ఏ జీవి బతకాలన్నా ఇవి అవసరం
Image Credit : Freepik

ఏ జీవి బతకాలన్నా ఇవి అవసరం

భూమిపై ప్రతి జీవి బతకడానికి ప్రత్యేకమైన పరిస్థితులు అవసరం. ఒక ప్రాంతంలో సులభంగా బతికే జీవి మరో ప్రాంతంలో మనుగడ సాగించలేకపోవచ్చు. వాతావరణం, ఉష్ణోగ్రత, ఆహార లభ్యత, నివాస స్థలం వంటి అంశాలు జీవుల లైఫ్ ని ప్రభావితం చేస్తాయి. అందుకే ప్రకృతిలో ప్రతి జీవి తనకు అనుకూలమైన వాతావరణంలోనే అభివృద్ధి చెందుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ప్రపంచం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Boys vs Girls Height : మహిళల కంటే మగవాళ్లే ఎక్కువ పొడవు పెరుగుతారు? కారణమేంటో తెలుసా?
Recommended image2
Telugu Saying: అంతా మనవాళ్లే కానీ.. అన్నానికి రమ్మనే వాళ్లు లేరు! ఈ కాలానికి తగ్గ సామెత!
Recommended image3
Water Tank: వాటర్ ట్యాంకును టెర్రస్ పై కాకుండా నేలపై కడితే ఏమవుతుంది?
Related Stories
Recommended image1
Psychology: సైకాలజీ ప్రకారం భార్యాభర్తలు ఒకరితో ఒకరు చెప్పకూడని 5 మాటలు ఇవే!
Recommended image2
Psychology: సైకాలజీ ప్రకారం మన మెదడు మనకు అబద్ధం చెప్పే 5 సందర్భాలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved