MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Feature
  • Psychology: సైకాలజీ ప్రకారం భార్యాభర్తలు ఒకరితో ఒకరు చెప్పకూడని 5 మాటలు ఇవే!

Psychology: సైకాలజీ ప్రకారం భార్యాభర్తలు ఒకరితో ఒకరు చెప్పకూడని 5 మాటలు ఇవే!

Psychology: కొన్ని మాటలు భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచితే, ఇంకొన్ని మాటలు ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతాయి. ముఖ్యంగా కోపంలో లేదా బాధలో అన్న కొన్ని మాటలు మనసుకు తీవ్ర గాయం చేస్తాయి. సైకాలజీ ప్రకారం జీవిత భాగస్వామితో అస్సలు చెప్పకూడని 5 మాటలేంటో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Jul 15 2026, 05:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
జీవిత భాగస్వామితో చెప్పకూడని 5 మాటలు
Image Credit : chatgpt

జీవిత భాగస్వామితో చెప్పకూడని 5 మాటలు

వివాహ జీవితంలో ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవం ఎంత ముఖ్యమో, మాట తీరు కూడా అంతే ముఖ్యం. సైకాలజీ నిపుణుల ప్రకారం భార్యాభర్తల మధ్య ఎక్కువ శాతం గొడవలు కొన్ని మాటల వల్లే మొదలవుతున్నాయట. ఒకసారి మాట్లాడిన మాటను తిరిగి తీసుకోలేం కాబట్టి.. కోపం వచ్చినా లేదా బాధ కలిగినా, నిరాశలో ఉన్నా.. కొన్ని మాటలను జీవిత భాగస్వామితో అస్సలు చెప్పకూడదట. అవేంటో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నువ్వు ఎప్పటికీ మారవు
Image Credit : CHATGPT.COM

నువ్వు ఎప్పటికీ మారవు

ఏదైనా తప్పు జరిగిన సందర్భంలో..  "ఎప్పుడూ", "ఎప్పటికీ" వంటి పదాలు వాడటం వల్ల ఎదుటివారికి మారడానికి అవకాశం లేదన్న భావన కలుగుతుంది. సైకాలజీ ప్రకారం సమస్యను వ్యక్తిపై మోపడం కంటే, జరిగిన సంఘటన గురించి మాత్రమే మాట్లాడటం మంచిది. "నువ్వు ఎప్పుడూ ఇలానే ఉంటావు" అని చెప్పడంకంటే, "ఈ విషయం నాకు బాధ కలిగిస్తోంది అని చెప్పడం మంచిది.

Related Articles

Related image1
Psychology: సైకాలజీ ప్రకారం మన మెదడు మనకు అబద్ధం చెప్పే 5 సందర్భాలు ఇవే!
Related image2
Psychology: సైకాలజీ ప్రకారం కొన్ని పాటలు వింటే పాత జ్ఞాపకాలు ఎందుకు గుర్తొస్తాయో తెలుసా?
36
నిన్ను పెళ్లి చేసుకోవడం నా జీవితంలో చేసిన పెద్ద తప్పు
Image Credit : AI Image

నిన్ను పెళ్లి చేసుకోవడం నా జీవితంలో చేసిన పెద్ద తప్పు

చాలామంది కోపంలో తమ జీవిత భాగస్వామితో నిన్ను పెళ్లి చేసుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు అంటుంటారు. కానీ ఈ ఒక్క మాట జీవిత భాగస్వామి మనసులో తీవ్ర అసురక్షిత భావాన్ని కలిగిస్తుంది. ఈ మాట ఆ క్షణంలోని కోపాన్ని మాత్రమే కాదు, మొత్తం సంబంధాన్నే ప్రశ్నించినట్లుగా అనిపిస్తుంది. ఇలాంటి మాటలు పదేపదే వినిపిస్తే, దంపతుల మధ్య నమ్మకం క్రమంగా తగ్గిపోతుంది.

46
నువ్వు వాళ్లలా ఎందుకు ఉండలేవు?
Image Credit : chatgpt

నువ్వు వాళ్లలా ఎందుకు ఉండలేవు?

భర్తను లేదా భార్యను ఇతరులతో పోల్చడం అస్సలు మంచిది కాదు. పోలికలు ప్రోత్సాహాన్ని ఇవ్వవు. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ప్రతి వ్యక్తికి తన ప్రత్యేకత ఉంటుంది. "అతను ఇలా చేస్తాడు", "ఆమె అలా ఉంటుంది" అని పదే పదే చెప్పడం వల్ల ఎదుటివారికి తాము సెట్ కావట్లేదన్న భావన ఏర్పడుతుంది. సైకాలజీ నిపుణుల ప్రకారం హెల్తీ రిలేషన్ షిప్ లో పోలికలకు స్థానం ఉండకూడదు.

56
నీ వల్లే నా జీవితం ఇలా అయిపోయింది
Image Credit : Gemini AI

నీ వల్లే నా జీవితం ఇలా అయిపోయింది

ఏ సమస్య వచ్చినా మొత్తం బాధ్యతను జీవిత భాగస్వామిపై వేయడం మంచిది కాదు. ఇది బాధ్యతను పంచుకోవడం కాకుండా నింద వేయడం అవుతుంది. "నీ వల్లే ఇలా జరిగింది" అనడం కంటే ఇద్దరూ కలిసి ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో మాట్లాడుకోవడం మంచిది.

66
నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు
Image Credit : chatgpt AI

నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు

భార్య భర్తల గొడవ తర్వాత కాసేపు మౌనంగా ఉండటం సహజమే. కానీ రోజులు తరబడి మాట్లాడకుండా శిక్షించడం, లేదా ఉద్దేశపూర్వకంగా మౌనం పాటించడం మంచిదికాదు. ఇది ఎదుటివారిలో ఒంటరితనం, నిరాశ, తిరస్కరణ భావాలను పెంచుతుంది. కోపం తగ్గిన తర్వాత ప్రశాంతంగా మాట్లాడటం, భావాలను స్పష్టంగా చెప్పడం, ఒకరి మాట మరొకరు వినడం హెల్తీ రిలేషన్ షిప్ చాలా అవసరమని సైకాలజీ నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
బంధుత్వం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Science Facts : తొమ్మిది కాదు ఎనిమిదే గ్రహాలు.. ప్లూటోను గ్రహాల లిస్ట్ లోంచి ఎందుకు తొలగించారు?
Recommended image2
Psychology: మీ మంచితనాన్ని ఎవరైనా వాడుకుంటున్నారా? ఈ 5 సైకాలజీ ట్రిక్స్‌తో తెలుసుకోండి!
Recommended image3
USA: కారు దిగకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చు.. అమెరికాలో డ్రైవ్ త్రూ ATM గురించి మీకు తెలుసా?
Related Stories
Recommended image1
Psychology: సైకాలజీ ప్రకారం మన మెదడు మనకు అబద్ధం చెప్పే 5 సందర్భాలు ఇవే!
Recommended image2
Psychology: సైకాలజీ ప్రకారం కొన్ని పాటలు వింటే పాత జ్ఞాపకాలు ఎందుకు గుర్తొస్తాయో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved