MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Feature
  • Facts : విమానం విండోస్ రౌండ్ షేప్ లోనే ఎందుకుంటాయి? దీని వెనక ఇంత సైన్స్ దాగుందా?

Facts : విమానం విండోస్ రౌండ్ షేప్ లోనే ఎందుకుంటాయి? దీని వెనక ఇంత సైన్స్ దాగుందా?

మీరు విమానాన్ని చూసినప్పుడు గుండ్రని కిటికీలు ఆకట్టుకుంటారు. ఏ వాహనాానికి లేనివిధంగా విమానానికే ఇలాంటి విండోస్ ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా కనిపిస్తుంది. అయితే ఈ గుండ్రని కిటికీలు ఆకర్షణ కోసం కాదు భద్రత కోసమట… వీటి వెనక సైన్స్ దాాగుందట.

3 Min read
Author : Arun Kumar P
Published : Jul 31 2026, 12:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
విమానానికి రౌండ్ విండోస్ ఎందుకుంటాయి?
Image Credit : Getty

విమానానికి రౌండ్ విండోస్ ఎందుకుంటాయి?

బస్సు, కారు, లారీ, రైలు... ఇలా ఏ వాహనాన్ని అయినా తీసుకొండి వాటి విండోస్ చతురస్రం ఆకారంలో ఉంటాయి. భూమిపైనే కాదు నీటిలో ప్రయాణించే షిప్, క్రూజ్ లలో కూడా ఇలాంటి విండోసే ఉంటాయి. చివరికి ఇళ్లు, పెద్దపెద్ద అపార్ట్ మెంట్స్, విలాసవంతమైన భవనాల్లోనూ కిటికీల ఆకారం చతురస్రమే. ఒక్క విమానంలో మాత్రమే విండోస్ చతురస్రంలో కాకుండా గుడ్రంగా, అండాకారంలో (Oval) ఉంటాయి. ఇది విమానం ఆకర్షనీయంగా కనిపించడానికే అని చాలామంది భావిస్తారు.. కానీ ఇందుకోసం కాదట. దీని వెనక విమానాలను ప్రమాదాల నుండి కాపాడే సైన్స్ దాగుందట. అదేంటో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
విమానానికి చతురస్రాకార విండోస్ ఉంటే ఏం జరుగుతుంది?
Image Credit : Gemini AI

విమానానికి చతురస్రాకార విండోస్ ఉంటే ఏం జరుగుతుంది?

విమానంలో ప్రయాణించేటప్పుడు చాలామంది కిటికీ పక్కన సీటు కోరుకుంటారు... ఎందుకంటే ఆకాశంలోంచి దగ్గరగా కనిపించే మేఘాలు, కింద భూమిపై అందాలు చూడటానికి అద్భుతంగా ఉంటాయి. అయితే విమానంలోంచి బయటకు చూసేటప్పుడు ఒక విషయాన్ని గమనించారా? మన ఇళ్లలో లేదా కార్లలో ఉండే కిటికీలు చతురస్రాకారంలో ఉంటాయి, కానీ విమానంలో కిటికీలు మాత్రం గుండ్రంగా ఉంటాయి. అన్ని వాహనాల్లో మాదిరిగానే విమానానికి చతురస్రాకారం కిటికీలు ఎందుకు ఉండవనే డౌట్ వస్తుంది.

అయితే ప్రారంభంలో వాణిజ్య విమానాల్లో కూడా ఇతర వాహనాల్లో మాదిరిగానే నాలుగు మూలలతో చతురస్రం ఆకారపు కిటికీలే ఉండేవి. 1950ల కాలంలో విమానాలు ఎక్కువ ఎత్తులో ఎగరడం ప్రారంభించాయి... ఇలా ఎత్తులో ఎగరడం వల్ల ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా ప్రయాణం కూడా సున్నితంగా సాగుతుందని గుర్తించాయి విమానయాన సంస్థలు. 

అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఎదురయ్యింది. విమానం ఎత్తుకు వెళ్లేకొద్దీ బయట గాలి ఒత్తిడి తీవ్రంగా తగ్గుతుంది. అందుకే ప్రయాణికులు సురక్షితంగా శ్వాస తీసుకోవడానికి వీలుగా విమానం లోపల గాలి ఒత్తిడిని కృత్రిమంగా పెంచుతారు. ఇలా విమానం లోపల ఒత్తిడి ఎక్కువ, బయటి ఒత్తిడి తక్కువ ఉన్నప్పుడు విమానం బాడీ ఒక బెలూన్ లాగా బయటకు ఉబ్బుతుంది.

ఇలా విమానంలో ఒత్తిడి పెరిగినప్పుడు అద్దాలపై కూడా తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఇలాంటి సమయంలో చతురస్రాకారం కిటికీల పదునైన మూలల వద్దకు ఈ ఒత్తిడి చేరుతుంది. దీనిని సైన్స్‌ బాషలో "స్ట్రెస్ కాన్సంట్రేషన్" అంటారు. ఈ ఒత్తిడి పెరిగితే విమానం అద్దాలు పగిలి ప్రమాదం జరిగే ఆస్కారం ఉంటుంది... ఇలా గతంలో అనేక ప్రమాదాలు జరిగేవి... ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయేవారు.

Related Articles

Related image1
Fact Check: 2005కి ముద్రించిన నోట్లు రద్దు కానున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంకు
Related image2
Rain Facts : వర్షాన్ని ఎలా కొలుస్తారు? మిల్లీమీటర్, సెంటీమీటర్ వర్షం అంటే ఎంత?
34
విమాన ప్రమాదాలను తగ్గించేందుకే రౌండ్ విండోస్..
Image Credit : Getty

విమాన ప్రమాదాలను తగ్గించేందుకే రౌండ్ విండోస్..

1954లో 'డి హావిలాండ్ కామ్యూట్' (de Havilland Comet) అనే ప్రయాణికుల విమానాలు గాల్లోనే పగిలిపోయి ప్రమాదాలకు గురయ్యాయి. ఈ ప్రమాదాలకు కారణాలు తెలుసుకునేందుకు పరిశోధనలు చేయగా చతురస్రాకార కిటికీల మూలల వద్ద పదే పదే ఎక్కువగా ఒత్తిడి పడటం వల్ల బలహీనపడినట్లు తేలింది. ఆ మూలల నుంచే విమానం బాడీ పగిలిపోయిందని గుర్తించారు. ఈ ప్రమాదాల నుంచి పాఠాలు నేర్చుకున్న ఇంజనీర్లు కిటికీల డిజైన్‌ను పూర్తిగా మార్చేశారు.

గుండ్రటి లేదా అండాకారపు కిటికీలకు పదునైన మూలలు ఉండవు. దీనివల్ల లోపలి నుంచి వచ్చే గాలి ఒత్తిడి కిటికీ అంచుల వెంట సమానంగా పంపిణీ అవుతుంది. ఫలితంగా ఏ ఒక్క పాయింట్ వద్ద తీవ్రమైన ఒత్తిడి పడక, విమాన నిర్మాణం అత్యంత బలంగా ఉంటుంది. అందుకే విమానంలో గుండ్రని కిటికీలను ఏర్పాటుచేశారు...దీంతో ప్రమాదాలు తగ్గాయి. ఇలా భద్రతా కారణాలతోనే అన్ని విమానాలకు గుండ్రని లేదా అండాకారం కిటికీలు ఉంటాయి.

44
విమానం అద్దాల వెనక మరికొన్ని విశేషాలు
Image Credit : Getty

విమానం అద్దాల వెనక మరికొన్ని విశేషాలు

విమానం అద్దం ఒకే గాజుతో తయారు కాదు. ఇందులో ప్రాథమికంగా మూడు పొరలు (Acrylic Layers) ఉంటాయి. బయటి పొర బయటి తీవ్రమైన వాతావరణాన్ని తట్టుకుంటే, లోపలి పొర ప్రయాణికుల తాకిడి నుంచి కాపాడుతుంది.

మీరు విమానం కిటికీ అడుగున ఒక చిన్న రంధ్రాన్ని గమనించే ఉంటారు. ఇది మధ్య పొర, బయటి పొరల మధ్య గాలి ఒత్తిడిని సమతుల్యం చేయడానికి, అలాగే అద్దాలపై పొగమంచు (Fog) పట్టకుండా చూడటానికి సహాయపడుతుంది.

మనం రోజూ చూసే ఒక చిన్న రేఖాగణిత (Geometry) మార్పు విమాన ప్రయాణాన్ని ఎంత సురక్షితంగా మార్చిందో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. పదునైన మూలలను తొలగించి, గుండ్రటి ఆకారాన్ని ఎంచుకోవడం అనేది ఏవియేషన్ చరిత్రలోనే అతిపెద్ద, సురక్షితమైన ఆవిష్కరణలలో ఒకటి

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Jail Food : జైలులోని ఖైదీలకు ఏమేం ఫుడ్ ఐటమ్స్ పెడతారో తెలుసా?
Recommended image2
Interesting Facts : జైళ్లను అద్దెకిచ్చే దేశమేదో తెలుసా?
Recommended image3
Snakes : మనుషుల్లాగే పాములు కూడా స్నానం చేస్తాయా? నీటిలో ఎక్కువగా ఎందుకుంటాయి?
Related Stories
Recommended image1
Fact Check: 2005కి ముద్రించిన నోట్లు రద్దు కానున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంకు
Recommended image2
Rain Facts : వర్షాన్ని ఎలా కొలుస్తారు? మిల్లీమీటర్, సెంటీమీటర్ వర్షం అంటే ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved