MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Feature
  • Interesting Facts: నదిలో నీళ్లు ప్రవహిస్తున్నా బ్రిడ్జి ఎలా కడతారో తెలుసా?

Interesting Facts: నదిలో నీళ్లు ప్రవహిస్తున్నా బ్రిడ్జి ఎలా కడతారో తెలుసా?

Interesting Facts: నదులపై వంతెనలు నిర్మించడం ప్రస్తుతం సాధారణం అయిపోయింది. కానీ వేగంగా ప్రవహించే నదులపై అంత బలమైన వంతెన ఎలా కడతారు? అసలు అక్కడ ఎలా పనిచేస్తారు? అవి ఎన్నో ఏళ్లు చెక్కుచెదరకుండా ఎలా ఉంటాయి? వంటి విషయాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Jul 30 2026, 04:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నదులపై వంతెన ఎలా కడతారు?
Image Credit : ChatGPT

నదులపై వంతెన ఎలా కడతారు?

మనం డిజిటల్ ప్రపంచంలో ఉన్నప్పటికీ.. కొన్ని విషయాలు అందరికీ తెలియకపోవచ్చు. అలాంటి వాటిలో ఒకటే నదిపై వంతెన నిర్మాణం. మనం ఏళ్ల తరబడి బ్రిడ్జిలపై ప్రయాణిస్తున్నాం. కానీ, ఉధృతంగా ప్రవహించే నది మధ్యలో ఇంత పెద్ద పిల్లర్లను ఎలా నిర్మిస్తారు? అవి భారీ వాహనాల బరువును ఎలా మోస్తాయి? ఎన్నో ఏళ్లపాటు స్ట్రాంగ్ గా ఎలా ఉంటాయి? దీని వెనుక ఉన్న సవాళ్లు, వంతెన నిర్మాణ పద్ధతుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వంతెన డిజైన్
Image Credit : ChatGPT

వంతెన డిజైన్

వేగంగా ప్రవహించే నది మధ్యలో పిల్లర్లు నిర్మించడం అత్యంత సవాలుతో కూడుకున్న పని. దీనికి కచ్చితత్వం, ధైర్యం, ఆధునిక టెక్నాలజీ అవసరం. చిన్న పొరపాటు జరిగినా, నెలల తరబడి చేసిన కష్టం వృథా అవుతుంది. వంతెన కట్టే ముందు, ఇంజినీర్లు ఆ నదిని పూర్తిగా సర్వే చేస్తారు. నీటి లోతు, నది గర్భంలోని నేల బలం, నీటి ప్రవాహ వేగాన్ని కొలుస్తారు. వీటి ఆధారంగా, ఎన్ని పిల్లర్లు అవసరమో నిర్ణయించి, వంతెన డిజైన్‌ను రూపొందిస్తారు.

Related Articles

Related image1
Facts: లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు పెడతారు? ముఖం చూసుకోవడానికి మాత్రమే కాదు!
Related image2
Interesting Facts: అక్కడ ఒక్క చీమ కూడా ఉండదు.. అసలు బతకలేదు.. ఎందుకో తెలుసా?
35
కాఫర్‌ డ్యామ్
Image Credit : AI Generated

కాఫర్‌ డ్యామ్

నదిపై వంతెన పునాదులు వేయడానికి కాఫర్‌ డ్యామ్ చాలా ముఖ్యం. ఇది నిర్మాణ పనుల కోసం పొడి ప్రదేశాన్ని సృష్టించేందుకు ఉపయోగపడే ఒక తాత్కాలిక వాటర్‌ప్రూఫ్ నిర్మాణం. 10-20 మీటర్ల పొడవైన స్టీల్ షీట్లను ఉపయోగించి ఈ కాఫర్‌ డ్యామ్‌లను నిర్మిస్తారు. హైడ్రాలిక్ సుత్తులు లేదా వైబ్రేటర్ల ద్వారా ఈ షీట్లను నది అడుగు భాగంలో ఉంచుతారు. ఈ షీట్లను ఒకదానికొకటి కలిపి గుండ్రంగా లేదా చతురస్రాకారంలో ఒక గోడలా నిర్మిస్తారు. ఇది నిర్మాణ ప్రాంతంలోకి నీరు రాకుండా అడ్డుకుంటుంది.

45
చిన్న లీక్ కూడా ప్రమాదమే..
Image Credit : AI Generated

చిన్న లీక్ కూడా ప్రమాదమే..

కాఫర్‌డ్యామ్ కట్టాక, లోపలున్న నీటిని పెద్ద పంపులతో బయటకు తోడి, తిరిగి నదిలోకి వదిలేస్తారు. ఇప్పుడు ఆ ప్రదేశం పొడిగా మారుతుంది. కార్మికులు నిచ్చెనలు లేదా క్రేన్ల సాయంతో ఆ పొడి ప్రదేశంలోకి దిగి ఇసుక, మట్టి, రాళ్లను తొలగిస్తారు. నేలపై పునాది వేయడానికి, వంతెన బరువును మోసేందుకు 20-25 మీటర్ల పొడవైన ఇనుప పైపులను నది గర్భంలోకి పంపుతారు. ఆ తర్వాత, పునాది కోసం కాంక్రీట్ వేస్తారు. గాలి బుడగలను తొలగించి, నిర్మాణం బలంగా, ఎక్కువ కాలం ఉండేలా వైబ్రేటర్లను వాడతారు. ఈ మొత్తం ప్రక్రియ చాలా కష్టంతో కూడుకుంటుంది. కాఫర్‌ డ్యామ్‌లో చిన్న లీక్ వచ్చినా లేదా భూకంపం లాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినా, మొత్తం నిర్మాణం కూలిపోయే ప్రమాదం ఉంటుంది.

55
కైసన్ టెక్నాలజీ
Image Credit : stockPhoto

కైసన్ టెక్నాలజీ

ఈ పనులు పూర్తయ్యాక, ఇంజినీర్లు కైసన్ టెక్నాలజీని వాడతారు. ఇవి నీరు చొరబడని పెట్టెలు. వీటిని నది అడుగుభాగంలో ఉంచుతారు. లోపల కార్మికులు పనిచేయడానికి పొడి ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఓపెన్ కైసన్‌ల అడుగున ఒక రంధ్రం ఉంటుంది, అది మునగడానికి సహాయపడుతుంది. న్యూమాటిక్ కెైసన్‌లు, ఒత్తిడితో కూడిన గాలిని ఉపయోగించి నీటిని బయటకు నెడతాయి. కార్మికులు ఎయిర్‌లాక్ ద్వారా ఈ ప్రెషరైజ్డ్ గదిలోకి ప్రవేశించి సేఫ్ గా పని చేస్తారు. ఇలా సాంకేతికత సాయంతో, కార్మీకుల కష్టంతో వంతెన నిర్మాణాలను అనుకున్న టైంలో పూర్తి చేస్తారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Shiva Purana Rules: మహిళలు రుద్రాక్ష ధరించవచ్చా? శివాభిషేకం చేసేటప్పుడు ఏ వైపు నిలబడాలి? శివపురాణం ఏం చెప్తోంది?
Recommended image2
అన్నీ ఉన్నాయన్న పొగరు పనికి రాదు.. జీవితం ఎప్పుడెలా పరీక్ష పెడుతుందో తెలియ‌దు
Recommended image3
Worlds Cheapest House: ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు.. కేవలం 1 డాలర్‌ మాత్రమే !
Related Stories
Recommended image1
Facts: లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు పెడతారు? ముఖం చూసుకోవడానికి మాత్రమే కాదు!
Recommended image2
Interesting Facts: అక్కడ ఒక్క చీమ కూడా ఉండదు.. అసలు బతకలేదు.. ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved