MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Feature
  • Orange City: మన దేశంలో నారింజ నగరం అని ఏ సిటీని పిలుస్తారు? అలా ఎందుకు పిలుస్తారు?

Orange City: మన దేశంలో నారింజ నగరం అని ఏ సిటీని పిలుస్తారు? అలా ఎందుకు పిలుస్తారు?

Orange City: మనదేశంలో కొన్ని సిటీలకు ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. అలాంటి వాటిల్లో నారింజ నగరం కూడా ఒకటి. ఇది మన అందరికీ తెలిసిన నగరమే. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన నగరం ఇది. ఆ నగరమేదో తెలుసా? 

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 03 2026, 02:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నారింజ నగరం ఏది?
Image Credit : India Mart

నారింజ నగరం ఏది?

మనదేశంలో ఎన్నో నగరాలకు చారిత్రాత్మక సాక్ష్యాలు, పురాతన సాంప్రదాయాలు ఉన్నాయి. భారతదేశంలోని ప్రతి నగరం సొతత ప్రత్యేకతతో వెలిగిపోతుంది. అలాంటి వాటిల్లో నాగపూర్ ఒకటి. మహారాష్ట్రలో ఉన్న ఈ నగరాన్ని నారింజ నగరంగా పిలుస్తారు. ఈ ఆరంజ్ సిటీ కి చాలా ప్రత్యేకత ఉంది. అసలు నాగపూర్ కు ఆరంజ్ సిటీ అనే పేరు ఎందుకు వచ్చింది?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
200 ఏళ్ల నుంచి..
Image Credit : Indian Mart

200 ఏళ్ల నుంచి..

నాగపూర్ లో నారింజ వాసన కొతేమీ కాదు. రెండు వందల ఏళ్ల నుంచి నాగపూర్ నారింజ వాసనతో నిండిపోయింది. భోంస్లే రాజవంశస్తులు మొదటిసారి అక్కడ నారింజ సాగును ప్రారంభించారని చెబుతారు. ఈ పండు అక్కడి వాతావరణం, నేల వల్ల విపరీతంగా కాసేది. శీతాకాలంలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలో విపరీతమైన హెచ్చుతగ్గులు ఉండడం వల్ల నారింజ సాగుకు అనుకూలమైన వాతావరణం ఉండేది. దీంతో ఎక్కడా లేని విధంగా ఇక్కడ నారింజ సాగు అధికంగా జరిగేది. దీంతో నాగపూర్ కు నారింజ సాగు ఒక ప్రత్యేకతను తీసుకొచ్చింది. నాగపురి నారింజ పేరుతో పండ్ల అమ్మకాలు సాగాయి.

Related Articles

Related image1
Lunar Eclipse: మనదేశంలో చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించే నగరాలు ఇవే
Related image2
Home Loan: రూ.50 లక్షల హోమ్ లోన్ కావాలంటే మీ జీతం ఎంత ఉండాలి? నెలకి ఎంత ఈఎంఐ కట్టాలి?
34
నారింజ పండ్ల స్పెషాలిటీ
Image Credit : India Mart

నారింజ పండ్ల స్పెషాలిటీ

నాగపూర్ నారింజలు ఎంతో ప్రత్యేకమైనవి. అందుకే భారత ప్రభుత్వం జిఐ ట్యాగ్ ను కూడా అందించింది. ఈ నారింజలు ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతాయి. ఈ పండ్ల తొక్క చాలా సన్నగా ఉంటుంది. అందుకే వాటిలో రసం ఎక్కువగా ఉంటుంది. అద్భుతంగా తీపి, పుల్లని రుచి కలిగి ఉంటాయి. ఇవి త్వరగా చెడిపోవు. కాబట్టి దేశవ్యాప్తంగా లేదా విదేశాలకు సులువుగా ఎగుమతి చేయవచ్చు. ఆకర్షణీయమైన రంగుతో పాటు ఈ నారింజ పండ్లు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. తినే కొద్ది ఇంకా తినాలనిపించేలా ఉంటాయి ఈ నారింజ పండ్లు.

44
నారింజ పండుగ
Image Credit : India mart

నారింజ పండుగ

దేశంలో నారింజ సాగుకు, పంపిణీకి, వ్యాపారానికి నాగపూర్ అతిపెద్ద కేంద్రంగా మారిపోయింది. నగరంలో పెద్దపెద్ద మార్కెట్లు, శీతల గిడ్డంగి సౌకర్యాలు, బలమైన ఎగుమతి నెట్ వర్క్ వంటివి ఏర్పడ్డాయి. అందుకే నాగపూర్ ను ఆరెంజ్ సిటీగా పిలుచుకోవడం మొదలుపెట్టారు. నాగపూర్ ఆర్థిక వ్యవస్థ కూడా ఈ పండు చుట్టూనే తిరుగుతోంది. నగరం చుట్టుపక్కల నారింజ పండ్ల తోటలు అధికంగా కనిపిస్తాయి. టన్నుల కొద్దిగా నారింజలను ప్రతిరోజూ అమ్ముతూ ఉంటారు. ఎంతోమంది రైతులకు, వ్యాపారులకు జీవన ఉపాధి ఈ నారింజ పండ్లే. అందుకే ఆ నగరవాసులు ఏడాదికి ఒకసారి నాగపూర్ నారింజ పండుగను నిర్వహించుకుంటారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఫీల్ గుడ్ న్యూస్
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
USA Jobs: అమెరికాలో భారతీయులు ఎక్కువగా చేసే ఉద్యోగాలు ఏంటో తెలుసా?
Recommended image2
Rakhi: 90s లో పెద్ద పెద్ద మెరుపుల రాఖీలు గుర్తున్నాయా? తక్కువ కాస్ట్ తో.. చేతినిండా కనిపించే రాఖీల తీపిజ్ఞాపకాలు..
Recommended image3
World's Largest Snake: బాబోయ్ 250 కేజీల పామా? ప్రపంచంలోనే అతిపెద్ద పాము ఏదో తెలుసా?
Related Stories
Recommended image1
Lunar Eclipse: మనదేశంలో చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించే నగరాలు ఇవే
Recommended image2
Home Loan: రూ.50 లక్షల హోమ్ లోన్ కావాలంటే మీ జీతం ఎంత ఉండాలి? నెలకి ఎంత ఈఎంఐ కట్టాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved