MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Tech News
  • Smartphone : స్మార్ట్‌ఫోన్‌ను వారంలో ఒక్కసారైనా రీస్టార్ట్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా?

Smartphone : స్మార్ట్‌ఫోన్‌ను వారంలో ఒక్కసారైనా రీస్టార్ట్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా?

Why Restart Phone Weekly : మీ ఫోన్‌ను అస్సలు రీస్టార్ట్ చేయడం లేదా? అయితే అలర్ట్ అవ్వండి. ఫోన్ రీస్టార్ట్ చేయకపోతే వచ్చే సమస్యలు, నిపుణుల హెచ్చరికలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 20 2026, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అసలు ఫోన్ ఎందుకు రీస్టార్ట్ చేయాలి?
Image Credit : Gemini

అసలు ఫోన్ ఎందుకు రీస్టార్ట్ చేయాలి?

ఇప్పుడున్న రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేకపోతే ముద్ద దిగదు, నిద్ర పట్టదు. ఆఫీస్ వర్క్, బ్యాంకింగ్, ట్రావెల్, కమ్యూనికేషన్.. ఇలా ప్రతీదానికీ 2026లో ఫోనే సర్వస్వం అయిపోయింది. అయితే, మనలో చాలా మంది ఫోన్‌ను అస్సలు స్విచ్చాఫ్ చేయరు. రాత్రింబవళ్లు అది ఆనే ఉంటుంది. పాత ఫోన్లతో పోలిస్తే ఇప్పటి మోడ్రన్ స్మార్ట్‌ఫోన్లు చాలా పవర్‌ఫుల్ అండ్ రిలయబుల్ అనడంలో డౌట్ లేదు.

కానీ, ఇవి కూడా బ్రేక్ లేకుండా అలానే రన్ అవ్వడానికి డిజైన్ చేయలేదు. వారాలు, నెలల తరబడి ఫోన్ ఆన్‌లోనే ఉంటే.. బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్ రన్ అవుతూనే ఉంటాయి. టెంపరరీ ఫైల్స్ పేరుకుపోతాయి. సాఫ్ట్‌వేర్ బగ్స్ యాక్టివ్‌గా ఉండిపోతాయి. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే ఒకసారి రీబూట్ కొట్టాల్సిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రీస్టార్ట్ చేయకపోతే వచ్చే తిప్పలు ఏంటి?
Image Credit : Meta AI

రీస్టార్ట్ చేయకపోతే వచ్చే తిప్పలు ఏంటి?

ఒకవేళ మీరు ఏడాది పొడవునా మీ ఫోన్‌ను అస్సలు రీస్టార్ట్ చేయకుండా అలానే వదిలేస్తే ఏమవుతుంది? ఫోన్ పూర్తిగా పాడైపోకపోవచ్చు కానీ, పర్ఫార్మెన్స్ దారుణంగా పడిపోతుంది. యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్కువ రిసోర్సెస్ వాడేయడం వల్ల బ్యాటరీ ఎప్పుడు అయిపోతుందో తెలియదు.

ఛార్జింగ్ త్వరగా దిగిపోతుంది. కొన్ని యాప్స్ తరచూ క్రాష్ అవుతుంటాయి. స్టోరేజ్, మెమరీ మేనేజ్‌మెంట్ సరిగ్గా పని చేయదు. ఫోన్ హ్యాంగ్ అవ్వడం, స్లో అవ్వడం లాంటివి జరుగుతాయి. చాలా మంది ఫోన్ పాతది అయిపోయింది అనుకుంటారు కానీ, ఒక చిన్న రీస్టార్ట్ ఇస్తే సెట్ అయిపోయే చిన్న చిన్న సాఫ్ట్‌వేర్ ఇష్యూస్ వల్లే అలా జరుగుతుందని గ్రహించరు.

35
ఆపరేటింగ్ సిస్టమ్‌కు రీబూట్ బూస్ట్
Image Credit : pexels

ఆపరేటింగ్ సిస్టమ్‌కు రీబూట్ బూస్ట్

మనం ఫోన్‌ను రీస్టార్ట్ చేసినప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందో తెలుసా? బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న అనవసరమైన ప్రాసెస్ మొత్తాన్ని ఫోర్స్ గా ఆఫ్ చేస్తుంది. అవసరమైన మెయిన్ సర్వీసులను మొదటి నుంచి ఫ్రెష్‌గా రీలోడ్ చేస్తుంది.

దీనివల్ల చిన్న చిన్న గ్లిచెస్, ఫ్రీజ్ అయిపోయే యాప్స్, నోటిఫికేషన్లు ఆలస్యంగా రావడం, అకస్మాత్తుగా ఫోన్ స్లో అవ్వడం వంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా సాల్వ్ అవుతాయి. ఈ రూల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు అందరికీ వర్తిస్తుంది.

45
సెక్యూరిటీ పెరగాలంటే వారానికి ఒకసారి రీస్టార్ట్ చేయాల్సిందే
Image Credit : Gemini

సెక్యూరిటీ పెరగాలంటే వారానికి ఒకసారి రీస్టార్ట్ చేయాల్సిందే

ఫోన్ రీస్టార్ట్ చేయడం వల్ల కేవలం స్పీడ్ పెరగడమే కాదు, సెక్యూరిటీ కూడా మెరుగుపడుతుంది. అమెరికాకు చెందిన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ గతంలో ఒక క్రేజీ అడ్వైజ్ ఇచ్చింది. సైబర్ సెక్యూరిటీ బాగుండాలంటే స్మార్ట్‌ఫోన్‌లను వారానికి కనీసం ఒక్కసారైనా రీబూట్ చేయాలని రికమండ్ చేసింది.

ఫోన్ ర్యామ్ ఆధారంగా పనిచేసే మాల్వేర్‌లను, మెమరీ బేస్డ్ సైబర్ ఎటాక్స్‌ను అడ్డుకోవడానికి రీస్టార్ట్ ఎంతగానో హెల్ప్ అవుతుంది. అయితే, రీస్టార్ట్ చేయడం అనేది కేవలం అటాక్స్‌ను డిస్టర్బ్ చేయడానికే. అంతేకానీ స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లు, సేఫ్ బ్రౌజింగ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లకు ఇది ప్రత్యామ్నాయం కాదు. ఎప్పటికప్పుడు ఓఎస్ అప్‌డేట్ చేసుకోవడమే మెయిన్ డిఫెన్స్ అని నిపుణులు చెబుతున్నారు.

55
ఎన్ని రోజులకు ఒకసారి రీస్టార్ట్ చేయాలి?
Image Credit : ChatGPT

ఎన్ని రోజులకు ఒకసారి రీస్టార్ట్ చేయాలి?

మరి ఫోన్‌ను ఎంత కాలానికి ఒకసారి రీస్టార్ట్ చేయాలి? దీనికి నిపుణులు చెబుతున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే.. ప్రతి వారం లేదా రెండు వారాలకు ఒకసారి రీస్టార్ట్ చేయడం మంచిది. ఇప్పుడు వస్తున్న కొత్త ఫోన్లలో అయితే ఒక అదిరిపోయే ఫీచర్ ఉంది.

యూజర్ ప్రమేయం లేకుండానే ఫోన్ ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ అయ్యేలా సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. ఏడాది పాటు ఫోన్ ఆపకుండా వాడితే ఫోన్ పేలిపోదు కానీ, స్లో పర్ఫార్మెన్స్, బ్యాటరీ డ్రైన్, యాప్ గ్లిచెస్, అనవసరమైన సెక్యూరిటీ రిస్క్‌లు ఫేస్ చేయాల్సి వస్తుంది. నిమిషం కూడా పట్టని ఈ చిన్న అలవాటు మీ ఫోన్ లైఫ్‌ను సేఫ్ గా ఉంచుతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jio Offers Free Canva Pro: జియో యూజర్లకు సూపర్ ఆఫర్.. 4 వేలు ఫ్రీ.. ఇలా చేయండి
Recommended image2
Aadhaar: గుడ్ న్యూస్.. ఆధార్‌ ఫేస్‌ వెరిఫికేషన్ ఇక చాలా ఈజీ.. కొత్త టూల్స్‌ లాంచ్ చేసిన UIDAI
Recommended image3
iPhone Duo: శాంసంగ్‌కు గట్టి పోటీ.. ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యూయో వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే షాకే
Related Stories
Recommended image1
Water Bar Trend: పెళ్లిళ్లలో సరికొత్త క్రేజ్.. మందు బార్లకు పోటీగా వస్తున్న వాటర్ బార్స్! అసలు ఏంటివి?
Recommended image2
Best Smartphones Under 20K : రూ.20 వేల బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు.. గేమర్స్, క్రియేటర్స్ కోసం టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved