MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Feature
  • Interesting Facts: వారం రోజులు కరెంట్ లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా?

Interesting Facts: వారం రోజులు కరెంట్ లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా?

Interesting Facts: మన రోజూవారీ జీవితంలో కరెంట్ ఎంత ముఖ్యమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరెంట్ ఒక గంటసేపు పోతే చాలు.. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతాయ్. ఒక గంటకే అలా ఉంటే వారం రోజులు కరెంట్ లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా?

2 Min read
Author : Kavitha G
Published : Aug 10 2026, 02:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వారం రోజులు కరెంట్ లేకపోతే?
Image Credit : Gemini

వారం రోజులు కరెంట్ లేకపోతే?

ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం చేసే ప్రతి పనిలో విద్యుత్ కీలకమైంది. లైట్, ఫ్యాన్, ఛార్జింగ్, ఇంటర్నెట్ ఇలా ప్రతి విషయం కరెంట్‌పై ఆధారపడి ఉంటుంది. అలాంటి విద్యుత్ ఒక వారం రోజుల పాటు లేకపోతే మన జీవితం ఎలా మారిపోతుంది? మొదట చిన్న అసౌకర్యంగా అనిపించినా, రోజులు గడిచే కొద్దీ దాని ప్రభావం ఎలా ఉంటుంది? వంటి ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సంబంధాలు కట్!
Image Credit : Asianet News

సంబంధాలు కట్!

వారం రోజులు కరెంట్ లేకపోతే, ఉదయం లేవగానే ఫ్యాన్‌ తిరగదు, మోటర్‌ పనిచేయదు, ఫోన్‌ ఛార్జింగ్ ఉండదు, ఇంటర్నెట్‌ ఉండదు, టీవీ పనిచేయదు. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన పాలు, కూరగాయలు, పండ్లు, ఇతర పదార్థాలు పాడైపోతాయి. అనేక ప్రాంతాల్లో తాగునీటి సరఫరా కూడా నిలిచిపోతుంది. నగరాల్లో అపార్ట్‌మెంట్లలో నివసించే వారికి లిఫ్ట్‌లు పనిచేయవు. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు మెట్లు ఎక్కి దిగడమే సవాలుగా మారుతుంది. మొబైల్‌ ఫోన్లకు ఛార్జింగ్‌ లేక కుటుంబ సభ్యులతో, స్నేహితులతో లేదా అత్యవసర సేవలతో సంబంధాలు తెగిపోతాయి. ఇంటర్నెట్‌ లేక ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, డిజిటల్‌ చెల్లింపులు, ఆఫీసు పనులు, ఆన్‌లైన్‌ చదువులు అన్నీ నిలిచిపోతాయి.

35
గంధరగోళ పరిస్థితులు
Image Credit : Getty

గంధరగోళ పరిస్థితులు

అంతేకాదు ఆసుపత్రుల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. పెద్ద ఆసుపత్రుల్లో జనరేటర్లు ఉన్నప్పటికీ అవి కూడా పరిమిత సమయం వరకు మాత్రమే పనిచేస్తాయి. ఇంధనం అయిపోతే వెంటిలేటర్లు, ఐసీయూ పరికరాలు, ఆపరేషన్‌ థియేటర్లు, రక్త నిల్వ కేంద్రాల వంటివి ప్రమాదంలో పడతాయి. పరిశ్రమలు మూతపడతాయి. వేలాది మంది కార్మికులకు పని ఉండదు. ఉత్పత్తి నిలిచిపోవడంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. రైళ్లు, విద్యుత్‌తో నడిచే అనేక రవాణా సేవలు నిలిచిపోతాయి. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ పనిచేయక రోడ్లపై గందరగోళం ఏర్పడుతుంది.

45
నేరాలు పెరిగే అవకాశం
Image Credit : Chatgpt

నేరాలు పెరిగే అవకాశం

అలాగే రాత్రిపూట స్ట్రీట్ లైట్స్ లేకపోవడం వల్ల ప్రమాదాలు, దొంగతనాలు, ఇతర నేరాలు పెరిగే అవకాశం ఉంటుంది. విద్యుత్‌పై ఆధారపడే వ్యవసాయ రంగం కూడా తీవ్రంగా ప్రభావితమవుతుంది. బోర్లు పనిచేయక పంటలకు నీరు అందదు. కోళ్ల ఫారాలు, పాల పరిశ్రమలు, చేపల పెంపకం వంటి రంగాల్లో భారీ నష్టాలు వస్తాయి. కంప్యూటర్లపై ఆధారపడే ఉద్యోగులు పనిని కొనసాగించలేరు. టెలికాం టవర్ల బ్యాటరీలు కూడా కొంత సమయం తర్వాత పనిచేయక మొబైల్‌ నెట్‌వర్క్‌లు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వ సేవలు, పోలీస్‌, అత్యవసర స్పందన వ్యవస్థలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాయి.

55
నిత్యావసర వస్తువుల కోసం పోటీ..
Image Credit : Social Media

నిత్యావసర వస్తువుల కోసం పోటీ..

చిన్నగా ప్రజల్లో భయం, ఆందోళన పెరుగుతుంది. దుకాణాల్లో నిత్యావసర వస్తువుల కోసం పోటీ పెరగవచ్చు. కొన్ని ప్రాంతాల్లో తాగునీరు, ఆహారం వంటి ప్రాథమిక అవసరాల కోసం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఏదైనా కాస్త మంచి విషయం కనిపిస్తుంది అంటే.. విద్యుత్‌, మొబైల్‌, టీవీ, సోషల్‌ మీడియా వంటి వాటికి దూరంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపడం, మాటలు, ఆటలు వంటివి కనిపించవచ్చు. అయినప్పటికీ కరెంట్ లేని జీవితాన్ని ఊహించుకోవడం కూడా కష్టమే. కాబట్టి విద్యుత్‌ను వృథా చేయకుండా అవసరమైనంత మాత్రమే వినియోగించడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Largest Ganesha Temples: ప్రపంచంలోనే ప్రముఖ, అతిపెద్ద గణపతి ఆలయాలు ఇవే
Recommended image2
ఇప్ప‌టి వాళ్లు నిజంగానే 1980లోకి వెళ్తే.. ప్రపంచం ఎలా కనిపిస్తుంది? ఈ మార్పులు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
Recommended image3
Salt: సముద్రపు నీరు మనం తినే తెల్లని ఉప్పుగా ఎలా మారుతుంది? షాక్ అవుతారు
Related Stories
Recommended image1
Interesting Facts: నదిలో నీళ్లు ప్రవహిస్తున్నా బ్రిడ్జి ఎలా కడతారో తెలుసా?
Recommended image2
Psychology: సైకాలజీ ప్రకారం మీపై క్రష్ ఉన్న వాళ్లు అనుకోకుండా చేసే 5 పనులు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved