MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Feature
  • UPI Rules : ఫోన్ పే, గూగుల్ పే లో నెంబర్ తప్పుగా టైప్ చేసినా, పొరపాటున ఎక్కువ డబ్బులు పంపినా.. ఏం చేయాలో తెలుసా?

UPI Rules : ఫోన్ పే, గూగుల్ పే లో నెంబర్ తప్పుగా టైప్ చేసినా, పొరపాటున ఎక్కువ డబ్బులు పంపినా.. ఏం చేయాలో తెలుసా?

ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపిఐ యాప్స్ ద్వారా డబ్బులు పంపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పొరపాటు జరిగినా మన డబ్బులు తప్పుడు అకౌంట్‌కి వెళ్లిపోతాయి. ఒకవేళ తెలియని నంబర్లకు డబ్బులు పంపితే ఏం చేయాలో తెలుసా? 

3 Min read
Author : Arun Kumar P
Published : Jun 24 2026, 02:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యూపిఐ లో తప్పుడు పేమెంట్స్ చేశారా?
Image Credit : Gemini AI

యూపిఐ లో తప్పుడు పేమెంట్స్ చేశారా?

ఇండియా ప్రస్తుతం డిజిటల్ మయం అయిపోయింది... ప్రతి పనీ టెక్నాలజీ సాయంతో జరుగిపోతోంది. ఇక ఆర్థిక లావాదేవీల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు... గతంలో మాదిరిగా బ్యాంకులు చుట్టూ తిరిగే అవసరం లేకుండా చేతిలోనే స్మార్ట్ ఫోనే డిజిటల్ బ్యాంకుగా మారింది. యూపిఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) యాప్స్ ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, భీమ్, అమెజాన్ పే ద్వారా ఒక్క క్లిక్ తోనే ఆర్థిక లావాదేవీలు జరిగిపోతున్నాయి.

అయితే ఈ యూపిఐ యాప్స్ ద్వారా పేమెంట్స్ చాలా జాగ్రత్తగా చేయాలి... ఏ చిన్న పొరపాటు చేసినా డబ్బులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. తప్పుడు ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే తెలియని వ్యక్తుల అకౌంట్లోకి డబ్బులు వెళతాయి... కొన్నిసార్లు పొరపాటున ఎక్కువ డబ్బులు పంపిస్తుంటాం. ఇలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక చాలామంది కంగారుపడిపోతుంటారు. మరి ఈ సమయంలో ఏం చేయాలి?పంపిన డబ్బును తిరిగి పొందగలమా? అనే విషయాలు వివరంగా చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
యూపిఐ యాప్స్ లో తప్పుడు ట్రాన్సాక్షన్ కు కారణాలివే..
Image Credit : Getty

యూపిఐ యాప్స్ లో తప్పుడు ట్రాన్సాక్షన్ కు కారణాలివే..

సాధారణంగా ఈ కింద కారణాల వల్ల యూపిఐలో తప్పుడు ట్రాన్సాక్షన్లు జరుగుతాయి.

  • తప్పుడు యూపీఐ ఐడీ ఎంటర్ చేయడం లేదా మొబైల్ నంబర్‌ను తప్పుగా టైప్ చేయడం
  • తొందరపాటులో ఒక్క అంకె ఎక్కువగా టైప్ చేసినా ఎక్కువ డబ్బులు పోతాయి. ఉదాహరణకు ఫోన్ పే లో ఒకరికి రూ.1,000 పంపాలనుకుందాం... ఒక్క సున్న ఎక్కువ టైప్ చేస్తే రూ.10,000 కట్ అవుతాయి.
  • క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేటప్పుడు డబ్బు అందుకునే వారి పేరు సరిచూసుకోకుండా పంపడం

Related Articles

Related image1
UPI Rules : యూపిఐ పేమెంట్స్ లో 'గోల్డెన్ అవర్' .. ఏమిటీ కొత్త రూల్..?
Related image2
UPI Payments : మీ అకౌంట్లో రూపాయి లేకున్నా.. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా పేమెంట్స్ చేయొచ్చు. ఎలాగో తెలుసా?
35
యూపిఐలో పొరపాటున డబ్బు పంపితే వెంటనే ఏం చేయాలి?
Image Credit : Getty

యూపిఐలో పొరపాటున డబ్బు పంపితే వెంటనే ఏం చేయాలి?

1. లావాదేవీ వివరాలు సేవ్ చేసుకోండి

ముందుగా ట్రాన్సాక్షన్ ఐడీ, యూటీఆర్ నంబర్, తేదీ, సమయం, అమౌంట్ వంటి వివరాలను స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోండి.

2. డబ్బు అందుకున్న వ్యక్తిని కాంటాక్ట్ చేయండి

పొరపాటున డబ్బు వెళ్లిన వ్యక్తి వివరాలు మీకు తెలిస్తే, నేరుగా వాళ్లను సంప్రదించి డబ్బు తిరిగి పంపమని అడగవచ్చు. చాలా సందర్భాల్లో ఇదే ఫాస్ట్ సొల్యూషన్.

3. బ్యాంకు లేదా యూపీఐ యాప్‌లో ఫిర్యాదు చేయండి

Google Pay, PhonePe, Paytm, BHIM వంటి యాప్స్‌లో 'Transaction History'కి వెళ్లి, సంబంధిత ట్రాన్సాక్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి. అక్కడ 'Report Issue' లేదా 'Raise Complaint' ఆప్షన్‌ను ఎంచుకుని, తప్పుడు లావాదేవీ గురించి వివరాలు నమోదు చేయండి.

45
NPCI రూల్స్ ప్రకారం ఏం చేయొచ్చు?
Image Credit : Getty

NPCI రూల్స్ ప్రకారం ఏం చేయొచ్చు?

మీరు తప్పుడు వ్యక్తులకు డబ్బులు పంపినా, పంపాల్సిన దానికంటే ఎక్కువ డబ్బులు పంపినా ఏం చేయాలి? యూపీఐ లావాదేవీలను పర్యవేక్షించే సంస్థ NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) రూల్స్ ఏం చెబుతున్నాయి?

ముందుగా బ్యాంకులో అధికారికంగా ఫిర్యాదు చేయవచ్చు.

NPCI గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా కంప్లైంట్ రిజిస్టర్ చేయవచ్చు. NPCI డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజం ద్వారా 1800-120-1740 టోల్-ఫ్రీ నంబర్‌కు కూడా ఫిర్యాదు చేయొచ్చు.

ట్రాన్సాక్షన్ ఆధారాలను సమర్పించాలి.

విచారణ తర్వాత డబ్బు పొరపాటున వెళ్లిందని తేలితే, దాన్ని రికవర్ చేసే ప్రాసెస్ మొదలవుతుంది.

 NPCI నిబంధనల ప్రకారం నెలలో 10 సార్లు మాత్రమే తప్పుగా పంపిన డబ్బును తిరిగి పొందడానికి ప్రయత్నించవచ్చు. అదే ఒకే వ్యక్తికి 5 కంటే ఎక్కువసార్లు తప్పుగా పంపితే డబ్బు తిరిగి రాదు.

RBI అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చా?

బ్యాంకు లేదా యూపీఐ సర్వీస్ ప్రొవైడర్‌కు ఫిర్యాదు చేసినా పరిష్కారం దొరకకపోతే RBI ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ కింద ఫిర్యాదు చేయవచ్చు. దీనికోసం ముందుగా బ్యాంకులో ఫిర్యాదు చేసి ఉండాలి. 30 రోజుల్లోగా పరిష్కారం రాకపోతేనే RBIని సంప్రదించాలి.

డబ్బు తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది?

ఫిర్యాదు, విచారణను బట్టి కొన్ని రోజుల్లో పరిష్కారం దొరకొచ్చు. కొన్ని క్లిష్టమైన కేసుల్లో కొన్ని వారాలు పట్టొచ్చు. ట్రాన్సాక్షన్ వివరాలు కరెక్ట్‌గా ఇస్తే, ప్రాసెస్ వేగంగా జరుగుతుంది.

55
డబ్బు తిరిగి రాని సందర్భాలు
Image Credit : Getty

డబ్బు తిరిగి రాని సందర్భాలు

కొన్ని సందర్భాల్లో యూపిఐ ద్వారా జరిగిన పొరపాటును సరిదిద్దుకోలేం… అంటే డబ్బు తిరిగి రావడం కష్టం అన్నమాట. ఇలాంటి సందర్భాలేంటంటే…

  • మీరు సరైన వ్యక్తికే డబ్బు పంపి, తర్వాత కావాలని వెనక్కి అడిగితే.
  • డబ్బు అందుకున్న వ్యక్తి ఆ డబ్బును వాడేస్తే.
  • తప్పుడు సమాచారంతో ఫిర్యాదు చేస్తే.
  • లావాదేవీకి సరైన ఆధారం లేకపోతే.

యూపిఐ పేమెంట్స్ సమయంలో తప్పులు జరగకుండా ఉండాలంటే?

  • డబ్బు పంపే ముందు అవతలి వ్యక్తి పేరు రెండుసార్లు చెక్ చేసుకోండి.
  • పెద్ద మొత్తంలో డబ్బు పంపే ముందు రూ.1 పంపి కన్ఫర్మ్ చేసుకోండి.
  • క్యూఆర్ కోడ్‌ను జాగ్రత్తగా స్కాన్ చేయండి.
  • తొందరపడి ట్రాన్సాక్షన్ చేయకుండా, అమౌంట్‌ను మళ్లీ సరిచూసుకోండి.
  • యూపీఐ పిన్ ఎంటర్ చేసే ముందు అన్ని వివరాలు కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకోండి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
యుటిలిటీ
చిట్కాలు మరియు ఉపాయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Nepal Tourism : నేపాల్ లో ఇండియన్స్ అత్యధికంగా సందర్శించే టూరిస్ట్ స్పాట్స్ ఇవే..
Recommended image2
Facilities in Jail : జైల్లో ఖైదీలకు బెడ్, పరుపు, దుప్పటి ఇస్తారా? స్నానానికి సబ్బు సంగతేంటి?
Recommended image3
School Bus : అమెరికా నుండి అమీర్ పేట వరకు స్కూల్ బస్సులు పసుపు రంగులోనే ఎందుకుంటాయి? టాప్ 5 సైంటిఫిక్ రీజన్స్
Related Stories
Recommended image1
UPI Rules : యూపిఐ పేమెంట్స్ లో 'గోల్డెన్ అవర్' .. ఏమిటీ కొత్త రూల్..?
Recommended image2
UPI Payments : మీ అకౌంట్లో రూపాయి లేకున్నా.. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా పేమెంట్స్ చేయొచ్చు. ఎలాగో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved