MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Technology
  • UPI Payments : మీ అకౌంట్లో రూపాయి లేకున్నా.. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా పేమెంట్స్ చేయొచ్చు. ఎలాగో తెలుసా?

UPI Payments : మీ అకౌంట్లో రూపాయి లేకున్నా.. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా పేమెంట్స్ చేయొచ్చు. ఎలాగో తెలుసా?

మీ బ్యాంక్ అకౌంట్లో రూపాయి లేకున్నా సరే యూపిఐ యాప్స్ ద్వారా పేమెంట్స్ చేయవచ్చు. ఇది ఎలా సాధ్యమో ఇక్కడ తెలుసుకుందాం… ఎలాంటి ఆటంకం లేకుండా యూపిఐ పేమెంట్స్ చేద్దాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 04 2026, 12:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏమిటీ క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ?
Image Credit : Gemini AI

ఏమిటీ క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ?

భారతదేశంలో కరెన్సీ వినియోగం బాగా తగ్గిపోయింది… డిజిటల్ కరెన్సీ వినియోగం పెరిగింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వంటి UPI (యూనిఫైడ్ ఫేమెంట్స్ ఇంటర్‌ఫేస్) యాప్స్ వాడుతున్నారు… రోడ్డుపక్కల బజ్జీల బండి నుండి బంగారం షాపుల వరకు ప్రతి చోట యూపిఐ పేమెంట్సే జరుగుతున్నాయి. రాత్రి, పగలు అని తేడాలేదు… శనివారం, ఆదివారం సెలవులంటూ భయపడాల్సిన పనిలేదు… వారంలో ప్రతిరోజు, రోజులో 24 గంటలు నిరంతరాయంగా యూపిఐ సేవలు అందుబాటులో ఉంటాయి… తక్షణమే, సురక్షితంగా డబ్బులు పంపవచ్చు.

అయితే ఫోన్ నుండి డబ్బులు బదిలీ చేయాలంటే మన అకౌంట్లో కచ్చితంగా డబ్బులు ఉండాలి… లేకుంటే పేమెంట్స్ జరగవు. ఇది గతంలో పరిస్థితి… కానీ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకున్నా యూపిఐ పేమెంట్స్ చేయవచ్చు. ఇందుకోసం యూపిఐ యాప్స్ లో సరికొత్త ఫీచర్ వచ్చింది… అదే 'క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ'.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
క్రెడిట్ లైన్ యూపిఐ ఎలా పనిచేస్తుంది..?
Image Credit : Gemini

క్రెడిట్ లైన్ యూపిఐ ఎలా పనిచేస్తుంది..?

ఈ క్రెడిట్ లైన్ యూపిఐ కూడా మామూలు యూపీఐ లావాదేవీలాగే పనిచేస్తుంది. కానీ డబ్బులు మీ సేవింగ్స్ అకౌంట్ నుంచి కాకుండా, బ్యాంకు మీకు ముందుగా మంజూరు చేసిన లోన్ లిమిట్ (క్రెడిట్ లిమిట్) నుంచి కట్ అవుతాయి.

ఇది బ్యాంకులు అందించే ప్రీ-అప్రూవ్డ్ లోన్ సౌకర్యం. ఈ క్రెడిట్ లిమిట్‌ను మీ యూపీఐ ఐడీతో లింక్ చేశాక గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యాప్స్‌లో నేరుగా వాడుకోవచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లించేటప్పుడు, మీ బ్యాంకు ఖాతాకు బదులుగా 'క్రెడిట్ లైన్' ఆప్షన్ ఎంచుకుని లావాదేవీ పూర్తి చేయవచ్చు.

35
 క్రెడిట్ లైన్ యూపిఐ ఎలా వాడాలి..?
Image Credit : Getty

క్రెడిట్ లైన్ యూపిఐ ఎలా వాడాలి..?

మీ ఆదాయం, కేవైసీ, క్రెడిట్ హిస్టరీ ఆధారంగా మీ బ్యాంకు ఒక క్రెడిట్ లిమిట్‌ను ఆమోదిస్తుంది. ఆ క్రెడిట్ లైన్‌ను యూపీఐ యాప్‌లో లింక్ చేయాలి. డబ్బులు చెల్లించేటప్పుడు సేవింగ్స్ అకౌంట్‌కు బదులుగా క్రెడిట్ లైన్ ఎంచుకోవచ్చు. మీరు ఖర్చు చేసిన మొత్తం అప్పుగా నమోదవుతుంది. తర్వాత బ్యాంకు నిర్దేశించిన గడువులోగా ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. 

45
ఈ ఫీచర్ ఎవరికి లభిస్తుంది?
Image Credit : Getty

ఈ ఫీచర్ ఎవరికి లభిస్తుంది?

ఈ క్రెడిట్ లైన్ యూపిఐ వినియోగదారులు అందరికీ ఆటోమేటిక్‌గా రాదు. మంచి సిబిల్ స్కోర్, స్థిరమైన ఆదాయం, పూర్తి కేవైసీ ఉన్న కస్టమర్లకు మాత్రమే బ్యాంకులు ఈ క్రెడిట్ లైన్ అందిస్తాయి. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు, కొందరు ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ సౌకర్యాన్ని ఇస్తున్నాయి.

55
క్రెడిట్ లైన్ యూపిఐ ప్రధాన ప్రయోజనాలివే..
Image Credit : PR

క్రెడిట్ లైన్ యూపిఐ ప్రధాన ప్రయోజనాలివే..

బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా యూపిఐతో యధావిధిగా డబ్బులు చెల్లించవచ్చు.   అత్యవసర ఖర్చులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 

ప్రత్యేకంగా క్రెడిట్ కార్డు వెంట తీసుకెళ్లాల్సిన పనిలేదు. యూపీఐ యాప్స్‌లోనే నేరుగా వాడుకోవచ్చు. ఇది 'ఇప్పుడు కొని, తర్వాత చెల్లించు' (Pay Now, Repay Later) పద్ధతిలో పనిచేస్తుంది. 

గమనించాల్సిన విషయాలు :  

క్రెడిట్ లైన్ అనేది ఉచితంగా వచ్చే డబ్బు కాదు. ఇది అవసరం అయినప్పుడు లభించే అప్పు మాత్రమే. గడువులోగా తిరిగి చెల్లించకపోతే ఫైన్ పడుతుంది… వడ్డీ, ఆలస్య రుసుములు విధిస్తారు. చెల్లింపులు ఆలస్యం అయితే క్రెడిట్ స్కోర్‌పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

మొత్తంగా 'క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ' ఫీచర్‌తో బ్యాంకు ఖాతాలో డబ్బు లేనప్పుడు కూడా సురక్షితంగా, సులభంగా చెల్లింపులు చేయవచ్చు. కానీ ఇది ఒక అప్పు కాబట్టి, బాధ్యతాయుతంగా ఉపయోగించడం చాలా ముఖ్యం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jio Offers Free Canva Pro: జియో యూజర్లకు సూపర్ ఆఫర్.. 4 వేలు ఫ్రీ.. ఇలా చేయండి
Recommended image2
Smartwatch : స్మార్ట్‌వాచ్ వెనక ఓ పచ్చ లైట్ ఎప్పుడూ బ్లింక్ అవుతుంటుంది.. ఎందుకో తెలుసా?
Recommended image3
POCO: పోకో నుంచి 3 మైండ్ బ్లోయింగ్ 5G కొత్త ఫోన్లు.. భారీ డిస్కౌంట్లు, అద్భుతమైన ఫీచర్ల వివరాలు ఇవే
Related Stories
Recommended image1
Personal Finance : అనుకోకుండా 1 లక్ష రూపాయలు మీకు కలిసి వచ్చాయా..అయితే ఇలా ఖర్చు చేసి చూడండి..?
Recommended image2
EPFO: ఆ రోజు రానే వ‌చ్చేస్తోంది.. UPI ద్వారా PF డబ్బులు విత్‌డ్రా, ఎప్ప‌టి నుంచంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved