MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • UK: యూకేలో ఇండియన్స్ బ్రతకాలంటే నెలకు ఎంత ఖర్చవుతుందో తెలుసా? ఫ్యూజులు ఎగిరిపోయే నిజం

UK: యూకేలో ఇండియన్స్ బ్రతకాలంటే నెలకు ఎంత ఖర్చవుతుందో తెలుసా? ఫ్యూజులు ఎగిరిపోయే నిజం

UK Cost of Living: ఇండియా నుంచే కాదు చాలా దేశాల నుంచి ఎంతో మంది యువత యూకే(UK)కి వలసవెళ్లి చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం లాంటివి చేస్తుంటారు. అయితే అక్కడ నివసించడం అంత తేలికైన పని కాదు. ఖర్చులు ఎంత మోత మోగిస్తాయంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 15 2026, 08:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యూకే వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది..
Image Credit : Gemini AI

యూకే వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది..

భారతదేశం నుండి ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసం యునైటెడ్ కింగ్‌డమ్ (UK) వెళ్లే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, యూకే వెళ్లాలనుకునే ప్రతి ఒక్కరి మనస్సులో మెదిలే మొదటి ప్రశ్న—"అక్కడ నెలకు ఎంత ఖర్చవుతుంది?". లండన్ చాలా కాస్ట్లీ సిటీ, అక్కడ బ్రతకాలంటే చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు కావాలి. మరి అక్కడ ఖర్చుల వివరాల సంగతేంటి? ఇప్పటికే యూకేలో ఉంటున్నవారి పరిస్థితి ఏంటి? వారు ఏం చెపుతున్నారు. తాజా అంచనాల ప్రకారం, యూకేలో ఒక వ్యక్తి నివసించడానికి అయ్యే సగటు ఖర్చుల వివరాలు ఓ యూట్యూబర్ చెప్పిన సమాచారం ప్రకారం చూస్తే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆదాయానికి తగ్గ ఖర్చులు ఉంటాయి..
Image Credit : Gemini AI

ఆదాయానికి తగ్గ ఖర్చులు ఉంటాయి..

యూకే(United Kingdom)లో జీవన వ్యయం (Cost of Living) అనేది ప్రధానంగా మీరు ఉండే నగరంపై ఆధారపడి ఉంటుంది. ఆ దేశంలో అత్యంత కాస్లీ సిటీ లండన్. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటిగా ఉంది. ఇక మాంచెస్టర్, బర్మింగ్‌హామ్, ఎడిన్‌బర్గ్ వంటి ఇతర నగరాల్లో ఖర్చులు కాస్త తక్కువగా ఉంటాయి. తక్కువ అంటే మరీ తక్కువ అని చెప్పలేము. లండన్ లో లక్షరూపాయలు ఖర్చు వస్తే.. మిగతాసిటీస్ లో 50 వేల నుంచి 80 వేల వరకూ రావచ్చు.

35
యూకే లో నెల ఖర్చులు ఎంత అవుతాయి..
Image Credit : Gemini AI

యూకే లో నెల ఖర్చులు ఎంత అవుతాయి..

యూకేలో నెలవారీ ఖర్చుల గురించి మాట్లాడుకుంటే.. అందులో రెంట్, కరెంట్, వాటర్, ఫుడ్, కిరాణా, గ్యాస్, ఇలా చాలా రకాల ఖర్చులు ఏరియాల వారిగా తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి. ఈ రకంగా చూసుకుంటే ముందుగా…

వసతి (Rent): ఇది మీ బడ్జెట్‌లో అతిపెద్ద వాటా. లండన్ వెలుపల ఒక ప్రైవేట్ రూమ్ (షేరింగ్) కోసం నెలకు సగటున 554 పౌండ్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 58,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. అదే మీరు లండన్ నగరంలో ఉండాలనుకుంటే, కేవలం రెంట్ కోసమే కనీసం 750 నుండి £1,100 పౌండ్స్ వరకూ కేటాయించాల్సి ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సలో 1,15,000 దాకా కేటాయించాల్సి ఉంటుంది.

45
బయట తిన్నారంటే బ్యాండ్ పడినట్టే..
Image Credit : Getty

బయట తిన్నారంటే బ్యాండ్ పడినట్టే..

యూకేలో వాటర్, గ్యాస్, కరెంట్ తో పాటు బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ బిల్లుల కోసం నెలకు సగటున 80 నుండి 140 పౌండ్స్ అంటే సుమారు 8,000 నుండి 1500 రూపాయల వరకూ ఖర్చవుతుంది. ఇక కిరాణా (Groceries) విషయానికి వస్తే.. మీ ఇంటి వద్దే వండుకుని తింటే ఖర్చు చాలా ఆదా అవుతుంది. నెలకు ఒక వ్యక్తికి కిరాణా  కోసం 116 నుండి 155 పౌండ్స్ అంటే సుమారుగా 16,000 రూపాయలు అవసరమవుతాయి.

55
ఇతర ఖర్చుల సంగతేంటి..?
Image Credit : Gemini AI

ఇతర ఖర్చుల సంగతేంటి..?

ఇక యూకే(United Kingdom)లో ఉండేవారి ఇతర ఖర్చుల వివరాలు చూస్తే.. ముఖ్యంగా రవాణా (Transport).. బస్సులు లేదా ట్యూబ్ (సబ్‌వే) ప్రయాణాలకు మంత్లీ పాస్ తీసుకోవడం మంచిది. రవాణా కోసం నెలకు 54 నుండి 103 పౌండ్స్ అంటే దాదాపు 5 వేల 6 వందల నుంచి 11వేల వరకూ ఖర్చవుతుంది. ఇక ఇతర ఖర్చుల విషయానికి వస్తే.. మొబైల్ కనెక్షన్ కోసం 1,900 వేలు, బయట స్నేహితులతో కలిసి తిరగడం లేదా సినిమా వంటి వినోదాల కోసం నెలకు కనీసం 8 వేల నుండి 15,500 వరకూ అవసరమవుతాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Godavari: గోదావరి నది సముద్రంలో కలిసే చోట కనిపించే అద్భుతం.. ‘అన్నా చెల్లెళ్ల గట్టు’
Recommended image2
Gold Hating Country: ఈ దేశంలో బంగారమంటేనే పడదు, గోల్డ్ జ్యూయలరీ వేసుకోవడం పెద్ద వింత
Recommended image3
Free Train: మనదేశంలో ఎవరైనా ఉచితంగా ప్రయాణించగల రైలు ఇదొక్కటే.. ఈ ట్రైన్ ఎక్కడుందో తెలుసా?
Related Stories
Recommended image1
Salary: అమెరికాలో చెత్త ఏరుకునేవారి జీతం ఎంత ఉంటుందో తెలుసా? ఏ జాబ్ కి ఎంత శాలరి వస్తుంది?
Recommended image2
Mutton: చికెన్, మటన్ కలిపి తింటే ఏమౌతుంది? రెండు మాంసాలు కలిపి వండొచ్చా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved