MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Long Drive: ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్.. బైక్ పై లాంగ్ డ్రైవ్ వెళ్లాలనుకునే కపుల్స్ కి ది బెస్ట్ రూట్స్..

Long Drive: ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్.. బైక్ పై లాంగ్ డ్రైవ్ వెళ్లాలనుకునే కపుల్స్ కి ది బెస్ట్ రూట్స్..

Beautiful Roads in India: సొంత కారో, బైక్ మీదో లాంగ్ డ్రైవ్ కి వెళ్లడమనేది మాటల్లోని చెప్పలేని ఒక ఫీలింగ్. విశాలమైన రోడ్లు, ప్రకృతి అందాలు చూస్తూ వెళ్తే ఆ మజానే వేరు. లాంగ్ డ్రైవ్‌కి వెళ్లేవారికి బెస్ట్ అనిపించే ఇండియాలోని టాప్ 5 అందమైన రోడ్లు.

3 Min read
Author : Nandini Arava
Published : Nov 26 2026, 01:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
మన దేశంలో బ్యూటీఫుల్ రోడ్స్
Image Credit : Internet archive

మన దేశంలో బ్యూటీఫుల్ రోడ్స్

మన సొంత వెహికల్ లో ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఆ మజానే వేరు. రోడ్లు బాగుండి, చుట్టూ గ్రీనరీ ఉంటే ట్రావెల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సరైన రూట్ తెలియక చాలాసార్లు దరిద్రమైన రోడ్లలో వెళ్లి నానా ఇబ్బందులు పడతాం. కానీ ఈ 5 రోడ్లలో ప్రయాణిస్తే మీరు మళ్లీ మళ్లీ ఇక్కడికే రావాలనుకుంటారు. బైక్, కార్లలో లాంగ్ ట్రిప్ వేయాలనుకునే వారికి ఇవి పర్ఫెక్ట్ ఛాయిస్. ఎత్తైన పర్వతాలు, జలపాతాలు, అడవుల గుండా సాగే ఈ ప్రయాణం మీకెంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కపుల్స్ కావొచ్చు, ఫ్రెండ్స్ తో అయినా టైం స్పెండ్ చేస్తూ జర్నీ చేస్తుంటే…ఊహిస్తేనే అదిరిపోతుంది కదా…ఓ లుక్కేయండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
మనాలి టూ లేహ్ రూట్.. అందానికి కేరాఫ్ అడ్రస్!
Image Credit : Internet archive

మనాలి టూ లేహ్ రూట్.. అందానికి కేరాఫ్ అడ్రస్!

అందమైన రోడ్లపై ప్రయాణించాలనే కోరిక ఉంటే మనాలి నుంచి లేహ్ రూట్‌లో కచ్చితంగా వెళ్లాల్సిందే. బైక్ రైడర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లుగా ఉండే ఈ రోడ్డు ఇండియాలోనే అత్యంత పాపులర్. ఏటా లక్షలాది మంది యువకులు స్పోర్ట్స్ బైక్స్‌పై ఇక్కడికి వస్తుంటారు. మంచుతో కప్పబడిన కొండలు, విశాలమైన లోయలు, చల్లటి గాలులు ఈ జర్నీని మరింత స్పెషల్ చేస్తాయి. లద్దాఖ్‌లోని ఫేమస్ పాస్‌లను చూస్తూ కొండల మధ్య సాగే ఈ జర్నీ మీ అలసటను ఇట్టే మాయం చేస్తుంది.

బెస్ట్ టైమ్: మనాలి నుంచి లేహ్ రోడ్ ట్రిప్‌కి జూన్, సెప్టెంబర్ మధ్య అనువైన సమయం.

37
చెన్నై టూ పుదుచ్చేరి కోస్టల్ రైడ్
Image Credit : Internet archive

చెన్నై టూ పుదుచ్చేరి కోస్టల్ రైడ్

మనాలి-లేహ్ దూరంగా అనిపిస్తే.. పొరుగు రాష్ట్రంలోని చెన్నై-పుదుచ్చేరి రూట్‌ను ట్రై చేయండి. ఇక్కడ ఈస్ట్ కోస్ట్ రోడ్ (ECR) అద్భుతంగా ఉంటుంది. ఈ రూట్‌లో ఒకవైపు సముద్రం, మరోవైపు పచ్చదనం కనిపిస్తాయి. రోజంతా సముద్రాన్ని చూస్తూ ట్రావెల్ చేయొచ్చు. చల్లటి సముద్రపు గాలి మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తుంది. వీకెండ్ ట్రిప్‌కి ఇది బెస్ట్ ఆప్షన్. మీరు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య వెళ్తే వాతావరణం చాలా బాగుంటుంది.

47
బెంగళూరు నుంచి ఊటీకి అద్భుతమైన జర్నీ!
Image Credit : Internet archive

బెంగళూరు నుంచి ఊటీకి అద్భుతమైన జర్నీ!

ఇది మనకు కాస్త దగ్గరే. వీకెండ్‌లో లాంగ్ డ్రైవ్ చేయాలనుకుంటే బెంగళూరు నుంచి ఊటీకి ప్లాన్ చేయండి. ఈ రూట్‌లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే.. 36 హెయిర్‌పిన్ బెండ్స్ ఉంటాయి. అందుకే ఇక్కడికి బైకర్స్ క్యూ కడుతుంటారు. దారిలో ముదుమలై నేషనల్ పార్క్ ఉండటం వల్ల జర్నీ మరింత ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. రోడ్డుకు ఇరువైపులా టీ ఎస్టేట్లు, జలపాతాలు, స్పష్టమైన సరస్సులు మీ కళ్లకు కనువిందు చేస్తాయి. ఈ రోడ్ ట్రిప్ సుమారు 6 గంటలు పడుతుంది. దారిలో ఎన్నో స్టాప్స్ ఉంటాయి కాబట్టి ఫుడ్, వాటర్ కోసం టెన్షన్ పడక్కర్లేదు.

ఈ రూట్‌లో వెళ్లడానికి అక్టోబర్ నుంచి జూన్ వరకు బెస్ట్ టైమ్.

57
గౌహతి నుంచి తవాంగ్ ప్రయాణం
Image Credit : Internet archive

గౌహతి నుంచి తవాంగ్ ప్రయాణం

ఈశాన్య భారతంలో గౌహతి నుంచి తవాంగ్‌కు చేసే రోడ్ ట్రిప్ ఒక మరపురాని అనుభూతిని ఇస్తుంది. దారి పొడవునా పచ్చదనం, అందమైన దృశ్యాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. అయితే ఇక్కడ ప్రయాణించే ముందు ఒక విషయం గుర్తుంచుకోవాలి. అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించాలంటే భారతీయులు, విదేశీయులకు ఇన్నర్ లైన్ పర్మిట్ తప్పనిసరి. గౌహతి నుంచి తవాంగ్ చేరుకోవడానికి సుమారు 14 గంటలు పడుతుంది. మార్చి నుంచి అక్టోబర్ మధ్య ఈ ట్రిప్ ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.

67
మనాలి టూ సిమ్లా వయా మండి
Image Credit : Internet archive

మనాలి టూ సిమ్లా వయా మండి

మనాలి నుంచి మండి మీదుగా సిమ్లా వెళ్లే రూట్ పర్వత ప్రయాణాలకు ఫేమస్. ఒకవైపు ఎత్తైన కొండలు, మరోవైపు లోతైన లోయలతో రోడ్డు అద్భుతంగా ఉంటుంది. కారు లేదా బైక్‌లో ఈ రూట్‌ను ఎక్స్‌ప్లోర్ చేయడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది.

77
ఫోటోగ్రఫీకి పెట్టింది పేరు.. సిమ్లా రూట్
Image Credit : Internet archive

ఫోటోగ్రఫీకి పెట్టింది పేరు.. సిమ్లా రూట్

మనాలి నుంచి సిమ్లా వెళ్లడానికి హిమాచల్ టూరిజం బస్సులు కూడా ఉంటాయి. కానీ ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే కారు లేదా బైక్ జర్నీనే బెస్ట్. సిమ్లా దాటాక NH-88 రోడ్డు NH-21ను కలుపుతుంది. సిమ్లాకు 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న శలఘాట్ దారి చాలా అందంగా ఉంటుంది.

ఈ రూట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు స్థానిక వంటకాలతో పాటు పంజాబీ మీల్స్ కూడా టేస్ట్ చేయొచ్చు. 51 కిలోమీటర్లు ముందుకెళ్తే దల్దమోడ్, ఆ తర్వాత బాగే చేరుకుంటారు. దారి పొడవునా పచ్చదనం, పర్వతాల అందాలు కట్టిపడేస్తాయి. వంకరటింకర రోడ్లు ప్రయాణాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికి ఈ రూట్ ఒక స్వర్గం లాంటిది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ప్రయాణం
జీవనశైలి
 
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
32nd T20 • WBBLT20
abandoned
MS-WMS-W
159/7
MR-WMR-W
28/0
Match abandoned
Schedule ›
31st T20 • WBBLT20
Result
BH-WBH-W
142/9
AS-WAS-W
179/4
Adelaide Strikers Women beat Brisbane Heat Women by 37 runs
Schedule ›
30th T20 • WBBLT20
Result
SS-WSS-W
123/6
PS-WPS-W
142/7
Sydney Sixers Women beat Perth Scorchers Women by 4 wickets (D/L) method
Schedule ›
29th T20 • WBBLT20
Result
HH-WHH-W
151/2
ST-WST-W
150/5
Hobart Hurricanes Women beat Sydney Thunder Women by 8 wickets
Schedule ›
28th T20 • WBBLT20
Result
AS-WAS-W
168/5
MR-WMR-W
165/4
Adelaide Strikers Women beat Melbourne Renegades Women by 5 wickets
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
1st TEST • NZ vs IND 2026
Result
NZNZ
368 & 239/5
INDIND
720/9
Match drawn
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Result
PAKPAK
325 & 90/2
SLSL
98 & 316
PAK won by 8 wickets
Schedule ›
33rd T20 • WBBLT20
MR-WMR-W
Wed, 25 Nov, 2026
BH-WBH-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
34th T20 • WBBLT20
ST-WST-W
Thu, 26 Nov, 2026
AS-WAS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
35th T20 • WBBLT20
SS-WSS-W
Thu, 26 Nov, 2026
MS-WMS-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar: 10 కిలోల చెరకు నుంచి ఎన్ని కేజీల చక్కెర వస్తుంది? అసలు చక్కెర ఎలా తయారవుతుంది?
Recommended image2
Tirumala : అలంకార ప్రియుడు శ్రీవారికి రూ.200 కోట్ల బంగారు ఆభరణాలు.. ఎవరీ వర్దమాన్ జైన్?
Recommended image3
Drum Brake vs Disc Brake: బైక్‌లో డ్రమ్ బ్రేక్ vs డిస్క్ బ్రేక్.. రెండింటి మధ్య తేడా ఏంటి? ఏది బెస్ట్?
Related Stories
Recommended image1
Handloom / Powerloom: చేనేత పేరుతో వెంటనే మోసపోకండి..ఈ టిప్ తో అసలుదో కాదో ఇలా తెలుసుకోండి
Recommended image2
Celebrity Food: బాలీవుడ్ సెలబ్రిటీలకు తెగ నచ్చేస్తున్న రెసిపీ..మీరు ట్రై చేస్తారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved