MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Feature
  • Top 5 Dump Yards : ప్రపంచంలోనే అతిపెద్ద డంప్ యార్డ్ ఏది..? టాప్ 5 లో హైదరాబాద్...

Top 5 Dump Yards : ప్రపంచంలోనే అతిపెద్ద డంప్ యార్డ్ ఏది..? టాప్ 5 లో హైదరాబాద్...

ప్రపంచంలోనే అతిపెద్ద దేశమేది… అతిపెద్ద నగరమేది… అతిపెద్ద కట్టడమేది..? ఈ ప్రశ్నలకు జవాబు మీకు తెలిసే ఉంటుంది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద డంప్ యార్డ్ ఏది.. ఎక్కడుందో తెలుసా..?

3 Min read
Author : Arun Kumar P
Published : Apr 27 2026, 02:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రపంచంలో టాప్ 5 బిగ్గెస్ట్ డంప్ యార్డ్స్..
Image Credit : Gemini AI

ప్రపంచంలో టాప్ 5 బిగ్గెస్ట్ డంప్ యార్డ్స్..

Worlds Biggest Dump Yards : ప్రపంచంలో అత్యధికంగా చెత్తను ఉత్పత్తి చేసే దేశమేది...? ఈ ప్రశ్న కనిపించగానే మీకుకూడా ఏ నిరుపేద దేశమో గుర్తొచ్చి ఉంటుంది కదా..? చాలామంది ఏ కెన్యా, సోమాలియా, సూడాన్ లేక బంగ్లాదేశ్ వంటి దేశాలు అనుకుంటారు... కానీ కాదు. ఎవరూ ఊహించని విధంగా ప్రపంచంలో అతిపెద్ద డంప్ యార్డ్ (చెత్తను పడేసే ప్రాంతం) అగ్రరాజ్యం అమెరికాలో ఉంది. ఇటీవల విడుదలైన వరల్డ్ టాప్ డంపిగ్ యార్డ్స్ లిస్ట్ లో అమెరికా టాప్ లో నిలిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రపంచంలోనే అతిపెద్ద డంప్ ఇదే...
Image Credit : Gemini AI

ప్రపంచంలోనే అతిపెద్ద డంప్ ఇదే...

అపెక్స్ రీజినల్ ల్యాండ్‌ఫిల్ (Apex Regional Landfill)... అమెరికాలోని నెవాడా (Nevada) ప్రాంతంలోని డంప్ యార్డ్ ఇది. వైశాల్యం పరంగా చూస్తే ఇదే ప్రపంచంలోనే అతిపెద్ద డంప్ యార్డ్... సుమారు 2,200 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజూ 9 వేల నుండి 15 వేల టన్నుల చెత్తను డంప్ చేస్తారు. 250 ఏళ్ల పాటు చెత్తను నిల్వ చేసే సామర్థ్యం దీనికి ఉంది.

అయితే భూమి మీద కాకుండా సముద్రంలో పేరుకుపోయిన చెత్తను పరిగణనలోకి తీసుకుంటే 'గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్' (Great Pacific Garbage Patch) అతిపెద్దది. ఇది పసిఫిక్ మహాసముద్రంలో రెండు 'టెక్సాస్' రాష్ట్రాలంత వైశాల్యంలో (సుమారు 16 లక్షల చదరపు కిలోమీటర్లు) విస్తరించి ఉంది.

Related Articles

Related image1
Password: అత్యంత చెత్త పాస్‌వర్డ్స్‌ ఇవే.. మీరు కూడా ఇవే ఉపయోగిస్తున్నారా.? చెక్ చేసుకోండి..
Related image2
Biscuits: టాప్ 5 చెత్త బిస్కెట్లు ఇవే.. తిన్నారంటే ఈ సమస్యలు తప్పవు జాగ్రత్త!
35
అతిపెద్ద డంప్ యార్డ్స్ లోనూ చైనా సెకండ్..
Image Credit : Gemini AI

అతిపెద్ద డంప్ యార్డ్స్ లోనూ చైనా సెకండ్..

లావోగాంగ్ (Laogang)... ఇది చైనాలో అత్యధిక జనాభా కలిగిన షాంఘై నగరంలోని డంప్ యార్డ్. ఇది సుమారు 830 ఎకరాల్లో విస్తరించి ఉంది... ప్రతిరోజూ 11 వేల టన్నుల చెత్తను డంప్ చేస్తారు. అయితే టెక్నాలజీ సాయంతో ఇక్కడ చెత్త నుండి 1.6 బిలియన్ కిలో వాట్స్ విద్యుత్తును తయారుచేస్తున్నారు.

అయితే గతంలో మెక్సికో లోని బోర్డో పొనియంటే (Bordo Poniente) ప్రపంచంలో రెండో అతిపెద్ద డంప్ యార్డ్ గా ఉండేది. 927 ఎకరాల్లోని డంప్ యార్డ్ ప్రస్తుతం మూతపడింది... అంటే దీన్ని ఉపయోగించడం లేదు. అందుకే చైనాలోని లావోగాంగ్ రెండో స్థానానికి చేరుకుంది.

45
మూడో అతిపెద్ద డంప్ యార్డ్..
Image Credit : Asianet News

మూడో అతిపెద్ద డంప్ యార్డ్..

బంటర్ జెబ్యాంగ్ (Bantar Gembang)... ఇది ఇండోనేషియా దేశంలోని జకార్తాలో గల డంపింగ్ యార్డ్. ఇక్కడ చెత్త పెద్ద కొండలా పేరుకుపోయిందట. ప్రతిరోజూ 7000 నుండి 9000 టన్నుల చెత్త డంప్ చేస్తారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ డంప్ యార్డ్ ఏకంగా 20000 ఉపాధి కల్పిస్తోంది. ఇక్కడి చెత్తనుండి వస్తువులను ఏరుకుని అమ్ముకుని జీవనోపాధి పొందుతున్నారు.

55
ఇండియాలో అతిపెద్ద డంప్ యార్డ్ మన హైదరాబాద్ దే..
Image Credit : ANI

ఇండియాలో అతిపెద్ద డంప్ యార్డ్ మన హైదరాబాద్ దే..

జవహర్ నగర్ డంప్ యార్డ్ (హైదరాబాద్)

ఇక ప్రపంచంలో అతిపెద్ద డంప్ యార్డ్స్ లిస్ట్ లో టాప్ 4, 5 ఇండియాలోనే ఉన్నాయి. మన హైదరాబాద్ చెత్తను తరలించే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ దేశంలోనే అతిపెద్దది... ప్రపంచంలో నాల్గవది. 350 ఎకరాల్లో విస్తరించిన ఈ డంప్ యార్డ్ లో రోజూ 9 వేల నుండి 10 వేల టన్నుల డంప్ అవుతుంది. 

ఆందోళనకరమైన అంశం ఏంటంటే ప్రపంచంలోనే అత్యధికంగా మీథేన్ వాయువును విడుదల చేస్తున్న డంప్ యార్డ్ ఈ జవహర్ నగర్ దే. ఇది గంటకు 5.9 టన్నుల మీథేన్‌ను విడుదల చేస్తూ పర్యావరణానికి ముప్పుగా మారింది... ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఇలా జవహర్ నగర్ డంప్ యార్డ్ కార్డన్ డై ఆక్సైడ్ కంటే ప్రమాదకమైన మీథేన్ విడుదలచేస్తూ... చుట్టుపక్కల 8,9 కిలోమీటర్ల పరిధిలో నీటిని కాలుష్యపరుస్తూ... ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది.

ఘాజీపూర్ డంప్ యార్డ్ (డిల్లీ)

దేశ రాజధాని డిల్లీలోని ఘాజీ పూర్ డంప్ యార్డ్ ప్రపంచంలోనే అతిపెద్దది. ఈ డంప్ యార్డ్ వైశాల్యం పరంగా చిన్నదైనా, ఎత్తు పరంగా కుతుబ్ మినార్‌ను కూడా దాటేసి 'చెత్త పర్వతంగా' మారింది. డిల్లీలోని వేల టన్నుల చెత్త ప్రతిరోజూ ఈ డంప్ యార్డ్ కే చేరుకుంటుంది.

చైనా, కొరియా వంటి దేశాలు ఈ చెత్తను కేవలం పారేయడమే కాకుండా, దాని నుండి గ్యాస్, విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ 'వేస్ట్ టు వెల్త్' కాన్సెప్ట్‌ను అమలు చేస్తున్నాయి. భారతదేశం కూడా ఇలాగే చెత్తనుండి సంపదను సృష్టించే ఏర్పాట్లు చేయాలి... అప్పుడే డంప్ యార్డ్స్ లో చెత్త పేరుకుపోకుండా నిలువరించవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రపంచం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
Car Buying: భార్య పేరు మీద కారు కొంటే ఎంత లాభమో తెలుసా? సెలెబ్రిటీలు ఇలాగే కొంటారు
Recommended image2
Science Facts: 12 ఏళ్ల వయసులో అబ్బాయిలుగా మారే అమ్మాయిలు.. విచిత్ర గ్రామం ఇది !
Recommended image3
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ లీక్ కాకుండా ఉండాలంటే.. ఈ 3 సెట్టింగ్స్ ఆన్ చేయండి
Related Stories
Recommended image1
Password: అత్యంత చెత్త పాస్‌వర్డ్స్‌ ఇవే.. మీరు కూడా ఇవే ఉపయోగిస్తున్నారా.? చెక్ చేసుకోండి..
Recommended image2
Biscuits: టాప్ 5 చెత్త బిస్కెట్లు ఇవే.. తిన్నారంటే ఈ సమస్యలు తప్పవు జాగ్రత్త!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved