- Home
- Technology
- Tech News
- Password: అత్యంత చెత్త పాస్‌వర్డ్స్ ఇవే.. మీరు కూడా ఇవే ఉపయోగిస్తున్నారా.? చెక్ చేసుకోండి..
Password: అత్యంత చెత్త పాస్‌వర్డ్స్ ఇవే.. మీరు కూడా ఇవే ఉపయోగిస్తున్నారా.? చెక్ చేసుకోండి..
ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మెజారిటీ సైబర్ నేరాల్లో మన తప్పిదాలే ఉంటాయని మీకు తెలుసా.? ముఖ్యంగా మనలో చాలా మంది పాస్‌వర్డ్‌ల విషయంలో పెద్దగా దృష్టిసారించారు. ఇదే సైబర్ నేరస్థులకు అస్త్రంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని బలహీనమైన పాస్‌వర్డ్‌ల జాబితాను విడుదల చేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- FB
- TW
- Linkdin
Follow Us
)
సైబర్ భద్రతపై ఇటీవల 'నోహోస్ట్' అనే సంస్థ ఓ అధ్యయాన్ని నిర్వహించింది. ఈ అధ్యయనంలో భాగంగా ప్రజలు ఉపయోగిస్తున్న పాస్‌వర్డ్‌లకు సంబంధించి కీలక వివరాలను వెల్లడైంది. ఎక్కువ సైబర్ నేరాలకు గురైన వారి పాస్‌వర్డ్‌ల జాబితాను విడుదల చేశారు. ఇలాంటి బలహీనమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకోవడం వల్లే సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని చెబుతున్నారు. ఇంతకీ ఆ బలహీనమైన పాస్‌వర్డ్స్ ఏంటంటే.
* 123456 అత్యంత చెత్త పాస్‌వర్డ్స్ ఇది మొదటిది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ఇలాంటి పిన్‌లను సెట్ చేసుకుంటున్నారు. ఈ పాస్‌వర్డ్ ఉన్న సుమారు 5,02,03,085 సైబర్ నేరాలకు గురైనట్లు అధ్యయనంలో తేలింది.
* 123456789 ఈ పాస్‌వర్డ్ ఉపయోగించిన సుమారు 2,05,08,946 మంది డేటా దొంగతనానికిగు గురయ్యారు.
* 1234 ఈ పాస్‌వర్డ్ ఉపయోగించిన 44,53,720 సైబర్ నేరాల బారిన పడ్డారు.
* 12345678 పాస్‌వర్డ్ ఉపయోగించిన 98 లక్షలకు పైగా యూజర్లు హ్యాకింగ్‌కు గురయ్యారు.
* 12345 ఉపయోగించిన 50 లక్షల యూజర్ల ఖాతాల్లో డబ్బులు దొంగలించారు.
* ఇక కొందరు తెలివిగా 'Password' అనే పిన్ సెట్ చేసుకుంటారు. అయితే విచిత్రంగా ఈ పాస్‌వర్డ్ కూడా వీక్ పాస్‌వర్డ్స్ జాబితాలో ఉంది. ఈ పాస్‌వర్డ్ ఉపయోగించిన లక్షలాది మంది సైబర్ నేరాల బారిన పడ్డారు.
* 111111 పాస్‌వర్డ్ సుమారు 54 లక్షల సార్లు సైబర్ నేరాలకు గురైంది.
* అడ్మిన్ అనే పాస్‌వర్డ్ కూడా అత్యంత బలహీనమైంది.
* 123123 పాస్‌వర్డ్ 4.3 మిలియన్లకు పైగా హ్యాక్ చేశారు.
* abc123 ఈ పాస్‌వర్డ్‌ను సుమారు 42 లక్షల సార్లు హ్యాకింగ్‌కు గురైంది.
పైన తెలిపిన పాస్‌వర్డ్‌లలో మీరు ఉపయోగిస్తున్న పాస్‌వర్డ్ కూడా ఉంటే వెంటనే మార్చుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. హ్యాకర్లు ఈ పాస్‌వర్డ్‌లను సులభంగా ఛేదించగలరు, ఇది డేటా దొంగతనానికి, ఆర్థిక నష్టానికి దారితీస్తుంది.
పాస్‌వర్డ్ ఎలా ఉండాంటే.?
సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే స్ట్రాంగ్ పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి. ఇందుకోసం కొన్ని టిప్స్ పాటించాలని సైబర్ నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. మీ పాస్‌వర్డ్ కచ్చితంగా 12 నుంచి 16 అక్షరాలు ఉండేలా చూసుకోవాలి. వీటిలో అంకెలతో పాటు కొన్ని సింబల్స్ ఉండేలా చూసుకోవాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లో పాస్‌వర్డ్‌లలో మీ ఫోన్ నెంబర్ కానీ, పుట్టిన తేదీ కానీ, వాహన నెంబర్ లాంటివి కానీ ఉపయోగించకూడదు.
ఇది కూడా చదవండి: ప్రపంచంలో తొలి CNG బైక్.. కేవలం రూ. 10 వేలు చెల్లించి మీ సొంతం చేసుకోండి.