- Home
- Feature
- Top 10 Police Stations : ఇండియాలో టాప్ పోలీస్టేషన్లు ఇవే.. తెలుగు రాష్ట్రాల నుండి ఒకేఒక్క స్టేషన్
Top 10 Police Stations : ఇండియాలో టాప్ పోలీస్టేషన్లు ఇవే.. తెలుగు రాష్ట్రాల నుండి ఒకేఒక్క స్టేషన్
Top 10 Police Stations in India : నేరాల నియంత్రణ, ప్రజా రక్షణ వంటి పలు అంశాల ఆధారంగా దేశంలో టాప్ 10 పోలీస్ స్టేషన్లను ప్రకటించింది కేంద్ర హోంశాఖ. ఈ స్టేషన్లేవో తెలుసా?

ఇండియాలో టాప్ 10 పోలీస్ స్టేషన్లు
Best Police Stations in India : ప్రతి ఏడాది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశంలోనే అన్ని పోలీస్ స్టేషన్ల పనితీరు ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తుంది. ఇలా 2025 లో కూడా వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని అత్యుత్తమ పోలీస్ స్టేషన్లను గుర్తించింది. ఏదో నామమాత్రంగా పోలీస్ స్టేషన్లను పరిశీలించడం కాదు... ట్రాన్స్ రూరల్ కన్సల్టింట్ ప్రైవేట్ లిమిటెడ్ (TRANSRURAL) ద్వారా ప్రత్యేక సర్వే చేపట్టింది హోంశాఖ.
ట్రాన్స్ రూరల్ సంస్థ మహిళలు, బలహీనవర్గాలకు సంబంధించిన కేసులు, సివిల్, మిస్సింగ్, డెత్ కేసులు, వాటి పరిష్కారం, పోలీసుల సామర్థ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని దేశంలోని పోలీస్ స్టేషన్లను షార్ట్ లిస్ట్ చేసింది. తర్వాత మరింత వడగట్టి టాప్ 10 స్టేషన్లను గుర్తించింది. ఈ ట్రాన్స్ రూరల్ రిపోర్ట్ ఆధారంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ టాప్ 10 పోలీస్ స్టేషన్లను అధికారికంగా ప్రకటించింది.
1. ఘాజీపూర్ పోలీస్ స్టేషన్, న్యూడిల్లీ
దేశ రాజధాని డిల్లీలోని ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ దేశంలోనే మొదటి ర్యాంకు సాధించింది. సివిల్, క్రిమినల్ కేసుల విషయంలో ఈ స్టేషన్ పరితీరు అద్భుతంగా ఉందని TRANSRURAL తేల్చింది.
2. పహర్గాన్ పోలీస్ స్టేషన్, అండమాన్ & నికోబర్
సౌత్ అండమాన్ జిల్లాలో ఈ పహర్గాన్ పోలీస్ స్టేషన్ ఉంది. ఇది మహిళ, చిన్నారుల రక్షణ విషయంలో అద్భుతమైన పనితీరును కనబర్చింది. మహిళల కేసుల విషయంలో పకడ్బందీగా వ్యవహరించి వారికి అండగా నిలిచింది. అందుకే దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్లలో రెండో స్థానాన్ని దక్కించుకుంది.
3. కవితల్ పోలీస్ స్టేషన్, రాయచూర్, కర్ణాటక
దేశంలో మూడో స్థానం, కర్ణాటకలో అయితే మొదటి స్థానంలో నిలిచింది ఈ కవితల్ పోలీస్ స్టేషన్. రాయచూర్ జిల్లాలో ఈ పోలీస్ స్టేషన్ ఉంది. ఈ స్టేషన్లో నమోదైన కేసుల విషయంలో పోలీసులు పకడ్బందీగా వ్యవహరించి త్వరగా చేధిస్తున్నారు. అందుకే కేంద్రం ఈ స్టేషన్ కు ఉత్తర ర్యాంకు కేటాయించింది.
4. చౌకా పోలీస్ స్టేషన్, సరయికేల, జార్ఖండ్
జార్ఖండ్ రాష్ట్రంలోని ఈ చౌకా పోలీస్ స్టేషన్టు జాతీయస్థాయిలో నాలుగో ర్యాంకు సాధించింది. నేరాల నియంత్రణ, పౌరుల రక్షణ, స్టేషన్లో మౌలిక సదుపాయాలు, కేసుల పరిష్కారంలో టెక్నాలజీ వినియోగం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ర్యాంకులు కేటాయించింది హోంశాఖ. ఈ విషయాల్లో చౌకా స్టేషన్ మెరుగైన స్థానంలో నిలిచింది.
5. బిచోలిమ్ పోలీస్ స్టేషన్, గోవా
ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గోవాలో ఈ బిచోలిమ్ పోలీస్ స్టేషన్ ఉంది. దేశ నలుమూలల నుండి మాత్రమే కాదు విదేశాల నుండి కూడా భారీగా పర్యాటకులు గోవాకు వస్తుంటారు. కాబట్టి ఇక్కడ శాంతిభద్రతల పరిరక్షణ చాలా అవసరం. గోవాలో మాధకద్రవ్యాల మాఫియా ఆగడాలు మరీ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి చోట కొలువైన పోలీస్ స్టేషన్ అత్యుత్తమ పనితీరు కరబర్చి టాప్ 5 లో చోటు దక్కించుకుంది.
6. సోహ్రా పోలీస్ స్టేషన్, మేఘాలయ
ఈశాన్య ప్రాంతంలోని మేఘాలయలో చారిత్రక పోలీస్ స్టేషన్ ఈ సోహ్రా. దీన్ని 1885 లో అంటే బ్రిటిష్ కాలంలో ఈస్ట్ ఖాసీ హిల్స్ లో స్థాపించారు. ఇది పాతకాలపు లాకప్ లతో ఆకట్టుకునేలా ఉంటుంది. ఇప్పటికీ ఇది అత్యుత్తమ స్టేషన్ గా గుర్తింపు కలిగి ఉంది.
7. శామీర్ పేట, తెలంగాణ
తెలుగు రాష్ట్రాల నుండి టాప్ 10 పోలీస్ స్టేషన్ల జాబితాలో కేవలం శామీర్ పేట స్టేషన్ కు మాత్రమే చోటు దక్కింది. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని ఈ స్టేషన్ పనిచేస్తోంది. ఇది దేశంలో ఏడో స్థానం, తెలంగాణలో అయితే మొదటిస్థానంలో నిలిచింది.
8. బాహౌర్ పోలీస్ స్టేషన్, పాండిచ్చెరి
కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చెరిలోని ముఖ్యమైన పోలీస్ స్టేషన్ ఈ బాహౌర్. ఇది దేశంలోని అత్యుత్తమ పోలీస్ స్టేషన్లలో ఎనిమిదో ర్యాంకు సాధించింది.
9. మల్హార్ ఘర్ పోలీస్ స్టేషన్, మధ్య ప్రదేశ్
మధ్య ప్రదేశ్ లోని మాంధసౌర్ జిల్లాలో ఈ పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఈ స్టేషన్ నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన రక్షణ కల్పించడంలో ముందుంది. అందుకే ఉత్తమ ర్యాంకు సాధించింది.
10. రత్తన్ నగర్, చురు, రాజస్థాన్
రాజస్థాన్ లోని చురు జిల్లాలో ఉంది ఈ రత్తన్ నగర్ పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉత్తమ పనితీరు కనబర్చడంతో దేశంలోనే టాప్ 10 స్టేషన్ల జాబితాలో చోటు దక్కించుకుంది.

