MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Costly Wedding Venue: ఇక్కడ ఒక్క రోజుకి అయ్యే పెళ్లి ఖర్చుతో.. మన లైఫ్ సెటిల్ అయిపోతుంది..!

Costly Wedding Venue: ఇక్కడ ఒక్క రోజుకి అయ్యే పెళ్లి ఖర్చుతో.. మన లైఫ్ సెటిల్ అయిపోతుంది..!

Costly Wedding Venue: మన దేశంలో అత్యంత ఖరీదైన పెళ్లి మండపం ఏదో తెలుసా? అక్కడ ఒక్క రోజు పెళ్లికి ఎంత ఖర్చు చేయాలో తెలుసా? ఒక్క రోజు పెళ్లి ఖర్చుతో.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ సెటిల్ అయిపోతుందని తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
| Updated : Jul 18 2026, 12:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే ఎన్ని రూ. కోట్లు కావాలో తెలుసా?
Image Credit : Chat GPT

ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే ఎన్ని రూ. కోట్లు కావాలో తెలుసా?

మన దేశంలో ప్రతిరోజూ ఎంతో మంది పెళ్లి బంధంతో ఒక్కటి అవుతున్నారు. పెళ్లి విషయంలో ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుంది. జీవితం పెళ్లి ఒక్కసారి మాత్రమే చేసుకుంటాం కాబట్టి.. చాలా గ్రాండ్ గా చేసుకోవాలని కొందరు అనుకుంటే.. పెళ్లి కోసం ఇంత ఖర్చు ఎందుకు..సింపుల్ గా చేసుకుంటే సరిపోదా అనుకుంటారు. అయితే.. మన దేశంలో అత్యంత ఖరీదైన పెళ్లి మండపం ఒకటి ఉంది. ఇక్కడ.. ఒక్క రోజు పెళ్లి ఖర్చుతో.. రెండు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కొనేయచ్చు. అది ఎక్కడ ఉంది? ఇక్కడ ఎవరు పెళ్లి చేసుకుంటారు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం...

మన దేశంలో అత్యంత ఖరీదైన పెళ్లి మండపం ఉదయ్ పూర్ లో ఉంది. ఈ ప్యాలెస్ పేరు ది ఒబేరాయ్ ఉదయ్ విలాస్. బాలీవుడ్ సెలబ్రెటీలు, ప్రముఖ వ్యాపారవేత్తలు.. ఇదే ప్యాలెస్ లో పెళ్లిళ్లు చేసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఈ ఉదయ్ విలాస్ లో ఉన్న స్పెషాలిటీ ఇదే..
Image Credit : Chat GPT

ఈ ఉదయ్ విలాస్ లో ఉన్న స్పెషాలిటీ ఇదే..

ఈ ది ఒబేరాయ్ ఉదయ్ విలాస్.. రాజస్థాన్ లోని పిచోలా సరస్సు ఒడ్డున ఉంటుంది. ఈ లగ్జరీ ప్యాలెస్ చూడటానికి రెండు కళ్లు సరిపోవు. ఇక.. దీని అసలైన అందం రాత్రిపూట కనపడుతుంది. లైట్ల వెలుగుల్లో మెరిసిపోతూ కనిపిస్తుంది. రాజస్థానీ సాంప్రదాయం, విలాసవంతమైన గదులు, సరస్సు అందాలు.. ఈ ప్యాలెస్ కి మరింత అందాన్ని తీసుకువస్తాయి. అందుకే, ధనవంతులు అంతా తమ పెళ్లిళ్లకు ఇలాంటి ప్యాలెస్ ని ఎంచుకుంటారు.

33
ఈ ప్యాలెస్ లో ఒక రోజు అద్దె ఎంత?
Image Credit : Chat GPT

ఈ ప్యాలెస్ లో ఒక రోజు అద్దె ఎంత?

ఈ ప్యాలెస్ లో పెళ్లి చేసుకోవాలంటే ఒక్క రోజుకి కనీసం రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక.. పెళ్లిళ్ల సీజన్, వచ్చే అతిథుల సంఖ్యను బట్టి ధర ఇంకాస్త పెరిగే అవకాశం కూడా ఉంది. దీనిని మనం పెళ్లి కోసం రెంట్ తీసుకుంటే.. కేవలం ఆ ప్యాలెస్ మనకు ఇవ్వడమే కాదు.. దానిని అందంగా అలంకరించడం, వచ్చిన అతిథుల కోసం భోజనం, సంగీత్ కార్యక్రమాలు, ఫోటో గ్రఫీ, వీడియో గ్రఫీ ఇలాంటి సదుపాయాలు కూడా మనకు అందిస్తారు. అయితే.. ఇవన్నీ కలిపితే ఖర్చు రూ.10 కోట్లు దాటుతుంది. సింపుల్ గా ఒక్క రోజులో అన్నీ చేస్తేనే రూ.10 కోట్లు.అదే.. ఓ నాలుగైదు రోజులు అక్కడే ఉండి.. హల్దీ, సంగీత్ లాంటి అన్నీ కార్యక్రమాలు చేసుకోవాలంటే బడ్జెట్ పెరుగుతూనే ఉంటుంది. చాలా మంది సెలబ్రెటీలు ఇక్కడే తమ పెళ్లిళ్లు చేసుకోవడం గమనార్హం. ఇక్కడ.. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. లొకేషన్స్ చాలా అందంగా ఉంటాయి కాబట్టి..ఫోటోలు కూడా చాలా అద్భుతంగా వస్తాయి.

ఈ ప్యాలెస్ లో రూమ్ ఖరీదు..

పెళ్లితో సంబంధం లేకుండా.. సరదాగా ఒక రోజు ఈ ప్యాలెస్ లో మీరు గడపాలి అనుకుంటే కూడా ఇక్కడికి వెళ్లొచ్చు. డీలక్స్ రూమ్ కి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లించాలి. అదే లగ్జరీ సూట్లు రూ.2లక్షల నుంచి రూ.10లక్షల వరకు చెల్లించాలి. ఇదే ఉదయ్ పూర్ లో ఇలాంటి లగ్జరీ ప్యాలెస్ లు మరో రెండు మూడు ఉన్నాయి. తాజ్ లేక్ ప్యాలెస్, లీలా ప్యాలెస్ కూడా చాలా ఫేమస్. జైపూర్, జోధ్ పూర్ లో కూడా ఇలాంటి ఖరీదైన ప్యాలెస్ లు ఉన్నాయి. చాలా మంది సెలబ్రిటీలు ఈ ప్యాలెస్ లో పెళ్లిళ్లు చేసుకున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Cloves: దిండు కింద లవంగాలు పెట్టుకొని పడుకుంటే ఏమౌతుంది?
Recommended image2
Apple: కట్ చేసిన యాపిల్ రంగు మారకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేస్తే చాలు!
Recommended image3
Bangles Set: ఎంత చూసినా తనివితీరని యాంటిక్ గాజుల కలెక్షన్
Related Stories
Recommended image1
School Fee: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్కూల్.. ఏడాది స్కూల్ ఫీజ్ తో లగ్జరీ విల్లా కొనుక్కోవచ్చు..!
Recommended image2
Grand Children Gifts: ఈ అపర కుబేరులు తమ మనవళ్లకు ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved