MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Feature
  • Trash On Roads: అమెరికా రోడ్లపై చెత్త వేస్తే ఎంత పెద్ద నేరమో తెలుసా? శిక్షలు ఏ రేంజ్ లో ఉంటాయంటే?

Trash On Roads: అమెరికా రోడ్లపై చెత్త వేస్తే ఎంత పెద్ద నేరమో తెలుసా? శిక్షలు ఏ రేంజ్ లో ఉంటాయంటే?

USA: అభివృద్ది చెందుతున్న చాలా దేశాల్లో ఇప్పటికీ రోడ్లపై చెత్త వేయడం, ఉమ్మడం లాంటివి కామన్ గా జరుగుతుంటుంది. కానీ అమెరికా లాంటి కొన్ని దేశాల్లో మాత్రం రోడ్డుపై చెత్త వేస్తే పరిణామం ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుసా? ఏం చేస్తారంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 19 2026, 07:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
లిటరింగ్ అంటే ఏంటి?
Image Credit : Gemini AI

లిటరింగ్ అంటే ఏంటి?

నేటి ఆధునిక ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత అనేవి ఎంతో ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అంశాలు. అయితే ప్రస్తుతం అభివృద్ది చెందుతున్న దేశాల్లో కూడా రోడ్లపై చెత్త వేయడం, ఉమ్మడం, మూత్ర విసర్జన లాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాల్లో పరిస్థితులు ఎంత ధారుణంగా ఉంటాయో అందరికి తెలుసు. ఇండియా వంటి దేశాలలో రోడ్లపై బహిరంగంగా చెత్త వేయడాన్ని చాలా మంది సాధారణ విషయంగా తీసుకుంటారు.. చాలా నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, అమెరికా (USA) వంటి అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడ రోడ్లపై లేదా బహిరంగ ప్రదేశాల్లో చిన్న కాగితం ముక్క, సిగరెట్ పీక లేదా ప్లాస్టిక్ బాటిల్ పడేసినా దానిని తీవ్రమైన చట్టపరమైన నేరంగా పరిగణిస్తారు. దీనినే అక్కడ 'లిటరింగ్' (Littering) అని పిలుస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రోడ్డుపై చిన్న పేపర్ వేసినా అంతే సంగతులు..
Image Credit : Gemini AI

రోడ్డుపై చిన్న పేపర్ వేసినా అంతే సంగతులు..

అమెరికా తో పాటు కొన్ని రిచ్ కంట్రీస్ లో ప్రభుత్వం రోడ్ల పరిశుభ్రత విషయంలో ఏమాత్రం రాజీ పడదు. ప్రతి వీధిలోనూ, జాతీయ రహదారుల (Highways) పక్కన 'నో లిటరింగ్' (No Littering) అంతే కాదు 'డోంట్ మెస్ విత్ టెక్సాస్' వంటి హెచ్చరిక బోర్డులను స్పష్టంగా ఏర్పాటు చేస్తారు. అక్కడి ప్రతి హైవే, జంక్షన్లలో అత్యాధునిక సీసీటీవీ (CCTV) కెమెరాలు నిరంతరం నిఘా ఉంచుతాయి. ఒకవేళ ఎవరైనా ప్రయాణికులు కారులో వెళ్తూ కిటికీలోంచి చిన్న చెత్తను రోడ్డుపైకి విసిరినా, ఆ కెమెరాలు కారు నంబర్ ప్లేట్‌తో సహా ఆ దృశ్యాలను స్పష్టంగా రికార్డ్ చేస్తాయి. ట్రాఫిక్ పోలీసులు లేదా నిఘా వ్యవస్థ ఆధారంగా నిందితుల ఇంటికి నేరుగా జరిమానా టికెట్ చేరుకుంటుంది.

35
శిక్షలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలుసా?
Image Credit : Gemini AI

శిక్షలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలుసా?

అమెరికాలో రోడ్డుపై చెత్త వేస్తే పడే ఫైన్ (జరిమానా) ఎంతో తెలిస్తే.. నిజంగా షాక్ అవుతారు. అయితే ఈ ఫైన్ విషయం ప్రతీ రాష్ట్రానికి వేరుగా ఉంటుంది. ఆ రాష్ట్ర నిబంధనలు బట్టి ఈ జరిమానాలు మారుతుంటాయి: సాధారణంగా మొదటిసారి చిన్నపాటి తప్పు చేసిన వారికి కనీసం 250 డాలర్ల నుండి 500 డాలర్ల వరకు అంటే ఇండియన్ కరెన్సీలో 45 వేలకు పైగా ఫైన్ విధిస్తారు. కాలిఫోర్నియా, టెక్సాస్ లేదా న్యూయార్క్ వంటి ప్రధాన రాష్ట్రాల్లో తీవ్రతను బట్టి ఈ జరిమానా 1,000 డాలర్ల అంటే భారత కరెన్సీలో సుమారు 84,000 పైగా ఫైన్ వేస్తారు. అత్యధికంగా 2,000 డాలర్ల వరకు అంటే లక్ష 60 వేలకు పైగా జరిమానా ఉంటుంది.

45
జరిమానాతో పాటు పనిష్మెంట్ కూడా..
Image Credit : Gemini AI

జరిమానాతో పాటు పనిష్మెంట్ కూడా..

కొన్ని సందర్భాల్లో రోడ్డుపూ చెత్త వేస్తే.. కేవలం డబ్బులు కట్టడంతోనే ఈ నేరం ముగిసిపోదు. నిబంధనలను పదే పదే ఉల్లంఘించిన వారికి కోర్టులు 'కమ్యూనిటీ సర్వీస్' శిక్షను విధిస్తాయి. అంటే నేరస్థుడే స్వయంగా రోడ్లపైకి వచ్చి నిర్ణీత గంటల పాటు నిలబడి చెత్తను శుభ్రం చేయాల్సి ఉంటుంది. మరీ తీవ్రమైన సందర్భాల్లో కొన్ని నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది.

55
రోడ్లు అద్దాల్లా మెరిసిపోవడానికి కారణం..
Image Credit : Gemini AI

రోడ్లు అద్దాల్లా మెరిసిపోవడానికి కారణం..

అమెరికాలో రహదారులు అంత అందంగా, స్వచ్ఛంగా ఉండటానికి కారణం కేవలం అక్కడి ప్రభుత్వాలు మాత్రమే కాదు, పౌరులను కట్టడి చేసే కఠినమైన చట్టాలు, నిరంతర నిఘాతో పాటు.. చట్టానికి, సమాజానికి భయపడైనా సరే ప్రజలు అక్కడ క్రమశిక్షణను అలవరచుకుంటారు. ప్రతి ఒక్కరిలో బాధ్యతను పెంచే ఇటువంటి కఠినమైన విధానాలు అన్ని దేశాల్లోనూ అమలు కావడం ఎంతో ముఖ్యం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వ‌ర్షాకాలంలో ప‌ట్టాల‌పై రైలు జార‌కుండా ఎలా ఉంటుంది.? రైళ్ల‌లో ఉండే ఇసుక బాక్సుల ప‌ని ఏంటి.?
Recommended image2
Reliance Smart Bazaar : MRP కంటే తక్కువకే సరుకులు..! స్మార్ట్ బజార్ లో ఏ వస్తువు ఎలా కొంటే లాభమో తెలుసా?
Recommended image3
Tirumala Facts : వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు, గోర్లు పెరుగుతాయా? చెమట పడుతుందా?
Related Stories
Recommended image1
Toilets: ఫారెన్ టాయిలెట్స్‌లో వాటర్ బదులు టిష్యూస్ ఎందుకు వాడతారో తెలుసా? అసలు కారణాలు ఇవే
Recommended image2
Salary: అమెరికాలో చెత్త ఏరుకునేవారి జీతం ఎంత ఉంటుందో తెలుసా? ఏ జాబ్ కి ఎంత శాలరి వస్తుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved