MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Feature
  • Gold Loan vs Selling Gold : ఆర్థిక అవసరాల కోసం బంగారం అమ్మాలా? తాకట్టు పెట్టాలా?

Gold Loan vs Selling Gold : ఆర్థిక అవసరాల కోసం బంగారం అమ్మాలా? తాకట్టు పెట్టాలా?

అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు చాలామందికి ఇంట్లో ఉన్న బంగారమే గుర్తొస్తుంది. కానీ ఆ నగలను తాకట్టు పెట్టాలా లేక అమ్మేయాలా అనే ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తు ఆర్థిక పరిస్థితిని మార్చేస్తుంది. ఏది, ఎప్పుడు లాభదాయకమో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 18 2026, 06:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నగలను తాకట్టు పెట్టాలా, లేక అమ్మేయాలా?
Image Credit : Gemini AI

నగలను తాకట్టు పెట్టాలా, లేక అమ్మేయాలా?

హఠాత్తుగా వచ్చే వైద్య ఖర్చులు, వ్యాపారంలో నష్టం, పిల్లల చదువులు లేదా కుటుంబ అవసరాలు... ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో చాలామందికి ముందుగా గుర్తొచ్చేది ఇంట్లో ఉన్న బంగారమే. కానీ ఆ సమయంలో అందరిలో మెదిలే పెద్ద ప్రశ్న, 'నగలను తాకట్టు పెట్టాలా, లేక అమ్మేయాలా?' అనేది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నగలు తాకట్టు పెట్టడం వల్ల లాభాలు
Image Credit : Getty

నగలు తాకట్టు పెట్టడం వల్ల లాభాలు

బంగారు నగలను తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటే వాటిపై యాజమాన్య హక్కు మీ దగ్గరే ఉంటుంది. అవసరమైన డబ్బు వెంటనే చేతికి వస్తుంది. అప్పు తీర్చగానే నగలను తిరిగి తీసుకోవచ్చు. ముఖ్యంగా పెళ్లి నగలు లేదా కుటుంబ వారసత్వ సంపద లాంటి వాటిని శాశ్వతంగా కోల్పోవద్దనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. కానీ ఇందులో ఉన్న చిక్కేంటంటే నిర్ణీత సమయంలోగా అప్పు తీర్చకపోతే, వడ్డీ పెరిగిపోతుంది. కొన్నిసార్లు నగలు వేలానికి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆదాయం తిరిగి వస్తుందనే నమ్మకం ఉంటేనే తాకట్టు పెట్టడం మంచిది.

35
నగలు అమ్మడం వల్ల ప్రయోజనం ఏంటి?
Image Credit : Asianet News

నగలు అమ్మడం వల్ల ప్రయోజనం ఏంటి?

మీరు అప్పు తిరిగి చెల్లించలేని పరిస్థితిలో ఉంటే కొన్నిసార్లు నగలను అమ్మేయడమే మంచి నిర్ణయం. అమ్మేస్తే ప్రతినెలా EMI లేదా వడ్డీ కట్టాల్సిన భారం ఉండదు. ముఖ్యంగా చాలా ఏళ్లుగా వాడకుండా ఉన్న నగలు లేదా పెట్టుబడి కోసం కొన్న బంగారాన్ని అమ్మడం వల్ల, అనవసరమైన అప్పుల భారాన్ని తప్పించుకోవచ్చు.

45
ఎప్పుడు తాకట్టు పెట్టడం మంచిది? ఎప్పుడు అమ్మడం మంచిది?
Image Credit : stockPhoto

ఎప్పుడు తాకట్టు పెట్టడం మంచిది? ఎప్పుడు అమ్మడం మంచిది?

ఎప్పుడు తాకట్టు పెట్టాలి?

కొన్ని నెలల్లో డబ్బు సమస్య తీరిపోతుందనే నమ్మకం ఉంటే.

నగలు కుటుంబానికి గుర్తుగా ఉంటే.

స్వల్పకాలిక డబ్బు అవసరం అయితే.

వడ్డీ చెల్లించే స్థోమత ఉంటే.

ఎప్పుడు అమ్మడం మంచిది? 

దీర్ఘకాలిక ఆర్థిక ఇబ్బందులు ఉంటే. 

అప్పు తిరిగి చెల్లించే అవకాశం తక్కువగా ఉంటే. 

పాతవి లేదా వాడని నగలు అయితే.

వడ్డీ భారాన్ని తప్పించుకోవాలనుకుంటే.

55
ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు?
Image Credit : Gemini AI

ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు?

‘’భావోద్వేగ బంధం ఉన్న నగలను తాకట్టు పెట్టొచ్చు. కానీ వాటిని విడిపించుకునే ప్లాన్ లేకపోతే అమ్మేయడమే మంచిది'' అని చాలామంది ఫైనాన్షియల్ అడ్వైజర్లు చెబుతున్నారు. ఒక్క విషయం గుర్తుంచుకోండి… బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది ఒక అత్యవసర ఆర్థిక రక్షణ కవచం. కానీ ఆ రక్షణను ఎలా వాడుకుంటారనే దానిపైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
బంగారం
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వ‌ర్షాకాలంలో ప‌ట్టాల‌పై రైలు జార‌కుండా ఎలా ఉంటుంది.? రైళ్ల‌లో ఉండే ఇసుక బాక్సుల ప‌ని ఏంటి.?
Recommended image2
Reliance Smart Bazaar : MRP కంటే తక్కువకే సరుకులు..! స్మార్ట్ బజార్ లో ఏ వస్తువు ఎలా కొంటే లాభమో తెలుసా?
Recommended image3
Tirumala Facts : వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు, గోర్లు పెరుగుతాయా? చెమట పడుతుందా?
Related Stories
Recommended image1
Gold Loan: గోల్డ్ లోన్ విష‌యంలో ఈ త‌ప్పు చేస్తున్నారా.? సిబిల్ స్కోర్ ప‌డిపోవ‌డం ఖాయం
Recommended image2
Gold Loan : మీరు గోల్డ్ లోన్ తీసుకుని తిరిగి కట్టలేకపోతున్నారా? బంగారం వేలం వేయకుండా ఆపే సింపుల్ ట్రిక్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved