MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Colour Change Mountain: ఊసరవెల్లిలా ఈ పర్వతం రంగులు మారుస్తుంది..ఎక్కడ ఉందో తెలుసా?

Colour Change Mountain: ఊసరవెల్లిలా ఈ పర్వతం రంగులు మారుస్తుంది..ఎక్కడ ఉందో తెలుసా?

Colour Change Mountain: ఊసరవెల్లి రంగులు మారినట్లు.. ఓ పర్వతం రంగులు మారడం గురించి ఎక్కడైనా ఉన్నారా? ఉదయం గులాబీ రంగులో.. సాయంత్రానికి గోల్డెన్ కలర్ లో మారే పర్వతం ఎక్కడ ఉందో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 14 2026, 12:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రంగులు మారే పర్వతం..
Image Credit : chat GPT

రంగులు మారే పర్వతం..

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పర్వతాలు ఉన్నాయి. పర్వాతాలు అనగానే మనకు ఎత్తు గుర్తుకు వస్తుంది. కానీ.. ఎత్తుతో సంబంధం లేకుండా.. రంగులు మార్చే పర్వతం గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ పర్వతం...ఉదయం నుంచి సాయంత్రానికి రంగు మారుతూనే ఉంటుంది. పగలు గడిచేకొద్దీ అందమైన రంగులు మారుతూ కనపడుతుంది. ఉదయాన్నే సూర్యోదయం అవుతున్న సమయంలో.. లేత గులాబీ రంగులోకి మారుతుంది. మధ్యాహ్నానికి ఆరెంజ్ గోల్డ్ కలర్, చీకటిపడే సమయంలో ఊదా రంగు లోకి మారుతుంది. ఈ అరుదైన పర్వతం ఆస్ట్రేలియాలో ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఈ పర్వతం స్పెషాలిటీ...
Image Credit : chat GPT

ఈ పర్వతం స్పెషాలిటీ...

ఆస్ట్రేలియాలోని నార్తర్న్ టెరిటరీ నడిబొడ్డున ఉన్న ఈ పర్వతం పేరు ఉలూరు. ఈ దేశంలోని అత్యంత సహజసిద్ధంగా ఏర్పడిన ప్రదేశాల్లో ఇది ఒకటి. ఈ పర్వతాన్ని ఏయర్స్ రాక్ అని కూడా పిలుస్తారు. ఇది ఏకశిల. రోజంతా సూర్యకాంతి ఈ పర్వతంపై పడటం వల్ల మనకు రోజంతా రంగులు మారుతున్నట్లుగా కనిపిస్తుంది. సూర్యకాంతి ఎక్కువగా ఉన్నప్పుడు గులాబీ రంగులో.. కాంతి తగ్గుతున్న సమయంలో నారింజ రంగులో కనిపిస్తుంది.

ఉలూరు పర్వతం ఎందుకు రంగులు మారుతుంది..?

సూర్యోదయం సమయంలో ఈ ఉలూరు పర్వతం.. లేత గులాబీ రంగులో , మధ్యాహ్నం ఎండలో నారింజ, కాషాయ రంగులో, మధ్యాహ్నం ఎరుపు రంగులో.. సూర్యాస్తమయం సమయంలో ఊదా రంగులో కనపడుతుంది. ఈ పర్వతంలో ని ఇనుప ఖనిజాలు సూర్యరశ్మి తగిలి.. కాలక్రమేణా ఆక్సీకరణం చెందడం వల్ల.. ఈ పర్వతం రంగులు మారుతూ కనిపిస్తుంది. సూర్యరశ్మి మారుతున్నప్పుడల్లా.. పర్వతం రంగు మారుతూ కనపడుతుంది.

Related Articles

Related image1
Chess Village: ఒకప్పుడు ఊరంతా తాగుబోతులే.. కట్ చేస్తే, ఇంటికో చెస్ ఛాంపియన్ తయారయ్యాడు..!
Related image2
Oldest Bazar: మన దేశంలో అతి పాత బజార్ ఇదే..350 ఏళ్లుగా నడుస్తోంది..ఇక్కడ దొరకనిది అంటూ ఏదీ లేదు
33
పవిత్ర స్థలం..
Image Credit : chat GPT

పవిత్ర స్థలం..

ఉలూరు పర్వతం కేవలం అందమైన ప్రదేశం మాత్రమే కాదు.. ఈ పర్వతాన్ని అక్కడి ప్రజలు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణిస్తారు. ఈ పర్వతాన్ని చూడటానికి పర్యాటకులు దాదాపు ఉదయం లేదా సాయంత్రం మాత్రమే వస్తూ ఉంటారు. ముఖ్యంగా అక్కడ వాకింగ్ చేస్తూ.. ఆ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు.

ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం...

ఉలూరు పర్వతాన్ని సందర్శించడానికి మే- సెప్టెంబర్ నెలల మధ్య కాలం చాలా బాగుంటుంది. ఎందుకంటే..ఈ సమయంలో కాస్త ఉష్ణోగ్రత్తలు తక్కువగా ఉంటాయి. చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. సౌకర్యవంతంగా కూడా ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Money Tree : ఈ అడవుల్లో డబ్బుల చెట్లు నిజంగానే కనిపిస్తాయి... ఎక్కడో తెలుసా?
Recommended image2
Chicken: మటన్, చికెన్ కలిపి తింటే ఏమౌతుంది? రెండు మాంసాలు కలిపి వండొచ్చా..?
Recommended image3
Government Schemes : మీ ఇంటి ఖర్చులు తగ్గించుకోవాలా? ఈ 5 ప్రభుత్వ పథకాలతో డబ్బులు సేవ్ చేసుకొండి
Related Stories
Recommended image1
Chess Village: ఒకప్పుడు ఊరంతా తాగుబోతులే.. కట్ చేస్తే, ఇంటికో చెస్ ఛాంపియన్ తయారయ్యాడు..!
Recommended image2
Oldest Bazar: మన దేశంలో అతి పాత బజార్ ఇదే..350 ఏళ్లుగా నడుస్తోంది..ఇక్కడ దొరకనిది అంటూ ఏదీ లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved