MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Most Stolen Thing: ప్రపంచంలో అత్యధికంగా దొంగలు ఎత్తుకుపోయేది దీన్నే.. బంగారం, వజ్రాలు మాత్రం కాదు

Most Stolen Thing: ప్రపంచంలో అత్యధికంగా దొంగలు ఎత్తుకుపోయేది దీన్నే.. బంగారం, వజ్రాలు మాత్రం కాదు

Most Stolen Thing: బంగారం, వజ్రాలు అతిముఖ్యమైనవి. కానీ ప్రపంచంలో భారీగా దొంగతనానికి గురవుతున్నది ఇవి మాత్ర కాదు. ప్రతిరోజూ దొంగలు ఎత్తుకుపోతున్నది ఒక ఆహారపదార్థాన్ని. అదే చీజ్. ఎంత చీజ్ దొంగతనానికి గురవుతుందో తెలుసా?

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 16 2026, 11:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
అధికంగా దొంగతనాలకు గురయ్యే వస్తువు
Image Credit : Gemini AI

అధికంగా దొంగతనాలకు గురయ్యే వస్తువు

ప్రపంచంలో అధికంగా దొంగతనం గురయ్యేది ఏ వస్తువు అనుకుంటున్నారు? బంగారం, వజ్రాల అనుకుంటున్నారా.. కాదు. ప్రపంచవ్యాప్తంగా దొంగల కళ్లు ఎక్కువగా పడే వస్తువు చీజ్. బ్రిటన్‌కు చెందిన సెంటర్ ఫర్ రిటైల్ రీసెర్చ్ నిర్వహించిన ఒక అధ్యయనంలో ప్రపంచంలో అత్యధికంగా దొంగతనానికి గురవుతున్న వస్తువు చీజ్. షాపుల్లోకి వచ్చే సరుకుల్లో దాదాపు 4 శాతం చీజ్ దొంగతనానికి గురవుతున్నట్టు ఈ నివేదిక చెబుతోంది. అంటే ఇది కొన్ని కోట్ల కిలోగ్రాముల చీజ్ దొంగతనం అనేది ఇప్పుడు పెద్ద అంతర్జాతీయ సమస్యగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
చీజ్ ఎందుకు దొంగతనం?
Image Credit : Getty

చీజ్ ఎందుకు దొంగతనం?

అసలు చీజ్ ఎందుకు ఇంతగా దొంగతనానికి గురవుతోంది? దీని వెనుక ఉన్న ప్రధాన కారణం దాని ధర, డిమాండ్. రోజురోజుకూ పెరుగుతున్న చీజ్ ధరల వల్ల దొంగలు దీనిని దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్నారు. దొంగిలించిన చీజ్ ను విక్రయించి డబ్బు సంపాదించుకుంటున్నారు. ఇది ఆకలి తీర్చుకోవడం కోసం చేసే దొంగతనం కాదు దీని వెనుక ఒక పెద్ద 'బ్లాక్ మార్కెట్' పనిచేస్తోంది. చాలా మంది దొంగలు ఖరీదైన చీజ్ రకాలను దొంగిలించి తక్కువ ధరకు రెస్టారెంట్లకు లేదా చిన్న చిన్న దుకాణాలకు అమ్ముతుంటారు. చీజ్ పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండటం కూడా దొంగలకు కలిసి వస్తుంది. చీజ్ తర్వాత అత్యధికంగా దొంగతనానికి గురవుతున్న ఆహారాల్లో మాంసం, చాక్లెట్లు, మద్యం, సీఫుడ్, పిల్లల పాలపొడి వంటివి ఉన్నాయి.

33
అతి పెద్ద దొంగతనం
Image Credit : Getty

అతి పెద్ద దొంగతనం

ఓసారి బ్రిటన్ లో ఏకంగా రాత్రికి రాత్రి ట్రక్కుల్లో వచ్చి 22 టన్నుల చీజ్ దొంగిలించారు. చీజ్ దొంగతనాల వల్ల రిటైల్ వ్యాపారులు భారీగా నష్టపోతున్నారు. ఈ దొంగతనాలను ఆపేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూపర్ మార్కెట్లు ఇప్పుడు అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నాయి. చీజ్ ప్యాకెట్లకు ప్రత్యేకమైన 'సెక్యూరిటీ ట్యాగ్‌లను' అమర్చడం, సీసీ కెమెరాల నిఘాను పెంచడం, ఏఐ ద్వారా కస్టమర్ల కదలికలను గమనించడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనా చీజ్ ముక్క వెనుక ఇంత పెద్ద క్రైమ్ స్టోరీ ఉండటం ఆశ్చర్యపరుస్తుంది. వచ్చే సారి మీరు సూపర్ మార్కెట్‌లో చీజ్ సెక్షన్‌కు వెళ్ళినప్పుడు, అక్కడ సెక్యూరిటీ కెమెరాలు ఎక్కువగా ఉన్నాయో లేదో చూడండి. ఆహార పదార్థాల్లోని ఈ వింత దొంగతనం గురించి తెలిసినప్పుడు, వ్యాపార రంగంలో భద్రత ఎంత ముఖ్యమో మనకు స్పష్టమవుతోంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మరణం తర్వాత మ‌నిషి శరీరంలో ఏం జరుగుతుంది? మొదట మారేది ఇదే..
Recommended image2
Godavari: గోదావరి నది సముద్రంలో కలిసే చోట కనిపించే అద్భుతం.. ‘అన్నా చెల్లెళ్ల గట్టు’
Recommended image3
Gold Hating Country: ఈ దేశంలో బంగారమంటేనే పడదు, గోల్డ్ జ్యూయలరీ వేసుకోవడం పెద్ద వింత
Related Stories
Recommended image1
Ambani Home: ముఖేష్ అంబానీ ఇల్లు ఇప్పుడు అమ్మితే ఎంత ధర ఉంటుందో తెలుసా? ఎవరూ కొనలేరేమో
Recommended image2
Automatic Cars: రూ.7 లక్షలలోపు వచ్చే టాప్ 5 బెస్ట్ ఆటోమేటిక్ కార్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved