- Home
- Feature
- ఒకే సారి రెండు దేశాల్లో నిద్రపోవచ్చు...ప్రపంచంలోనే విచిత్రమైన ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసా?
ఒకే సారి రెండు దేశాల్లో నిద్రపోవచ్చు...ప్రపంచంలోనే విచిత్రమైన ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసా?
ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలి అంటే.. చాలా రూల్స్ ఉంటాయి. కానీ, ఇవేమీ లేకుండా.. మీరు ఒకే ప్రదేశంలో ఉంటూనే.. రెండు దేశాల్లోనూ ఉండొచ్చు. ముఖ్యంగా.. రెండు దేశాల్లో ఒకేసారి నిద్రపోవచ్చు.

ఒకే సారి రెండు దేశాలు..
మనం ఒక దేశం దాటి మరొక దేశానికి వెళ్లాలంటే... పాస్ పోర్టు, వీసా ఉండాల్సిందే. కానీ, మీరు కేవలం.. ఒక హోటల్ కారిడార్ లో అలా నడుచుకుంటూ వెళ్తే చాలు.. ఫ్రాన్స్ నుంచి స్విట్జర్లాండ్ దేశంలోకి వెళ్లొచ్చు. చాలా వింతగా ఉన్నా ఇలాంటి హోటల్ ఒకటి ఉంది. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ సరిహద్దులోని లా క్యూర్ అనే చిన్న గ్రామంలో ఉన్న ఈ హోటల్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన హోటళ్లలో ఒకటి కావడం విశేషం.
ఒకే మంచం...రెండు దేశాలు...
ఈ హోటల్ అర్బెజ్ బయటకు చూడటానికి బయటకు మనకు నార్మల్ గానే కనపడుతుంది. కానీ, దీని లోపల అడుగుపెడితే అసలు మ్యాజిక్ ప్రారంభమౌతుంది. ఈ హోటల్ రెండు దేశాల సరిహద్దులో ఉంటుంది. ఈ హోటల్ భవనం, డైనింగ్ ఏరియా, మెట్లు, రూమ్స్ అన్నీ... ఫ్రాన్స్ నుంచి స్విట్జర్లాండ్ లోకి వెళ్లేలా ఉంటాయి. దానిని తెలియజేసేలా ఒక గీత కూడా గీసి ఉంటుంది. ఇక్కడి కొన్ని రూమ్స్ లో ఈ గీత సరిగ్గా.. మంచం మధ్య నుంచి వెళ్తుంది. అంటే.. మీరు పడుకున్నప్పుడు మీ తల ఫ్రాన్స్ లో ఉంటే.. కాళ్లు.. స్విట్జర్లాండ్ లో ఉంటాయన్నమాట. ఒకే చోట నిద్రపోతూనే మీరు..ఒకేసారి రెండు దేశాలను కవర్ చేయచ్చు. కేవలం నిద్ర మాత్రమే కాదు.. మీరు కాఫీ తాగడం, బ్రేక్ ఫాస్ట్ కూడా రెండు దేశాల్లో ఒకేసారి చేయచ్చు.
ఈ హోటల్ ఎలా నిర్మించారంటే...
సహజంగా ఇలా రెండు దేశాల సరిహద్దులో ఇలాంటివి నిర్మించడానికి అనుమతి ఉండదు. కానీ, ఈ హోటల్ నిర్మాణం వెనక మాత్రం ఒక పెద్ద కథే ఉంది. ఒక ఒప్పందం కూడా ఉంది. 1860లలో ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ ప్రభుత్వాలు తమ సరిహద్దులను సరిచేసుకోవడానిక ఒక ఒప్పందం చేసుకున్నాయి. అదే డ్యాప్స్ ఒప్పందం. ఈ ఒప్పందం అమలులోకి రాక ముందే పోంథస్ అనే స్థానిక వ్యాపారి తన హోటల్ నిర్మించుకున్నాడు. సరిహద్దు మారడంతో.. ఈ హోటల్ లోనే.. రెండు దేశాల సరిహద్దు గీత గీశారు. సరిహద్దు మారినప్పటికీ పాత కట్టడాలను కూల్చకూడదనే నిబంధన ఉండటంతో.. ఈ హోటల్ ని ఏమీ చేయలేదు. అందుకే.. ఇప్పటికీ.. ఈ హోటల్ కంటిన్యూ అవుతోంది. ఇలా రెండు దేశాలను ఎటాచ్ చేస్తూ ఉండటంతో.. దీనికి క్రేజ్ కూడా ఎక్కువే. చాలా మంది ఈ హోటల్ లో రెండు దేశాల్లో ఉన్నట్లు ఎక్స్ పీరియన్స్ చేయాలని.. ఇక్కడికి వస్తూ ఉంటారు.
రెండు సంస్కృతుల కలయిక..
1958లో హోటల్ యజమాని కుటుంబానికి చెందిన మ్యాక్స్ అర్బెజ్ ఈ హోటల్ కి సరదాగా అర్బెజీ అనే స్వతంత్ర చిరు దేశంగా ప్రకటించుకున్నాడు. ఇక్కడి రెస్టారెంట్ లో ఫ్రెంచ్, స్విస్ రెండు ప్రాంతాల సంప్రదాయ వంటకాలు లభిస్తాయి. పాస్ పోర్టు, వీసా లాంటివి ఏమీ లేకుండా.. ఇక్కడ ఒక దేశం నుంచి మరో దేశంలోకి అడుగుపెట్టొచ్చు అనే కారణంతో.. ఎక్కువ మంది ఈ హోటల్ కి రావడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా పర్యాటకులను ఎక్కువగా ఆకట్టుకుంటుంది.





