MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Phone Addiction : రాత్రుళ్లు ఫోన్ చూస్తుంటే నిద్రపట్టదు కానీ ఆకలేస్తుంది.. రీజన్ ఏంటో తెలుసా?

Phone Addiction : రాత్రుళ్లు ఫోన్ చూస్తుంటే నిద్రపట్టదు కానీ ఆకలేస్తుంది.. రీజన్ ఏంటో తెలుసా?

రాత్రి పడుకునే ముందు ఫోన్ వాడటం ఆపేస్తే శరీరంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు వస్తాయో తెలుసా? నాచురల్ స్లీప్, స్ట్రెస్ తగ్గడం వంటి ఎన్నో ప్రయోజనాలు మీ సొంతమవుతాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Oct 30 2026, 03:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రాత్రి ఫోన్ చూస్తే ఏం జరుగుతుందో తెలుసా?
Image Credit : Gemini AI

రాత్రి ఫోన్ చూస్తే ఏం జరుగుతుందో తెలుసా?

చాలామందికి ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు మొబైల్ చూసే అలవాటు ఉంటుంది. చివరికి పరిస్థితి ఎలా తయారయ్యిందంటే కొందరికి ఫోన్ చూడకుంటే నిద్రపట్టదు. ఇలా అర్ధరాత్రుల వరకు ఫోన్ చూస్తూ నిద్రలోకి జారుకుంటారు. చివరకు చిన్న పిల్లల్లో కూడా ఫోన్ చూస్తూ పడుకునే అలవాటు పెరిగిపోతోంది.

అయితే ఫోన్ చూస్తూ పడుకోవడం చాలా ప్రమాదకరం అని.. అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందని డాక్టర్లు, హెల్త్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ అలవాటు శరీరంలోని హార్మోన్ల బ్యాలెన్స్‌ను దెబ్బతీస్తుందట. అందుకే నిద్రపోవడానికి ఒక గంట ముందు ఫోన్ వాడకం ఆపేస్తే శరీరంలో మెలోటోనిన్ హార్మోన్ ఉత్పత్తి పెరిగి మంచి నిద్ర పడుతుంది… హార్మోన్ బ్యాలెన్స్ కూడా ఉండదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఫోన్ పక్కనబెడితేనే నిద్రొచ్చేది..
Image Credit : Asianet News

ఫోన్ పక్కనబెడితేనే నిద్రొచ్చేది..

మన మెదడులోని పీనియల్ గ్రంథి చీకటి పడగానే మెలాటోనిన్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది మనకు ప్రశాంతమైన నిద్రను ఇస్తుంది. అయితే ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల ఈ హార్మోన్ ఉత్పత్తి 50 శాతం వరకు తగ్గిపోతుంది… అందుకే వెంటనేే నిద్రపట్టదు.

చాలామంది నిద్ర పట్టడంలేదంటూ ఫోన్ చూస్తారు… కానీ ఫోన్ చూడటం వల్లే నిద్రపట్టదని తెలుసుకోవాలి. ఫోన్ పక్కన పెడితే ఆటోమెటిగ్గా నిద్ర వస్తుంది. కాబట్టి ఎలాంటి మాత్రలు లేకుండానే సహజంగానే మంచి నిద్ర పట్టాలంటే ఫోన్ దూరం పెట్టాల్సిందే. అలాగే స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్ తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది.

34
ఫోన్ చూస్తే ఎందుకు ఆకలేస్తుంది?
Image Credit : Freepik

ఫోన్ చూస్తే ఎందుకు ఆకలేస్తుంది?

మన ఆకలిని నియంత్రించడంలో లెప్టిన్, గ్రెలిన్ అనే రెండు హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. రాత్రి వేళల్లో ఫోన్ చూస్తూ నిద్ర పాడుచేసుకోవడం వల్ల ఈ హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. అందుకే అర్థరాత్రి ఒంటిగంట సమయంలో కూడా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అందుకే ఫోన్ పక్కనబెట్టి వేళకు నిద్రపోతే బరువు పెరగకుండా ఉండి, మెటబాలిజం మెరుగుపడుతుంది.

44
ఫోన్ దూరంపెడితే స్కిన్ ముడతలుపడదా?
Image Credit : stockphoto

ఫోన్ దూరంపెడితే స్కిన్ ముడతలుపడదా?

మనం ప్రశాంతంగా నిద్రపోయినప్పుడు శరీరంలో హ్యూమన్ గ్రోత్ హార్మోన్ బాగా విడుదలవుతుంది. ఇది చర్మ కణాలను పునరుద్ధరించి ముడతలు రాకుండా నివారిస్తుంది. అంటే చర్మ సౌందర్యానికి, ఫోన్ వాడకానికి సంబంధం ఉందన్నమాట.

ఎటువంటి బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకుండా సహజ సిద్ధమైన గ్లో పొందడానికి నిద్రకు ముందు ఫోన్ దూరంగా పెట్టడమే మంచి మార్గం. రాత్రి వేళ పుస్తకాలు చదవడం లేదా ఇంట్లో వారితో మాట్లాడటం అలవాటు చేసుకోండి. సాధ్యమైనంతవరకు రాత్రులు ఫోన్ చూడకపోవడం అలవాటు చేసుకొండి.. ఆరోగ్యంగా ఉండండి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఆరోగ్యం
ఏషియానెట్ న్యూస్
 
4th T20 • NZ vs IND 2026
Live
NZNZ
(20.0 ov)259/7
INDIND
(13.4 ov)129/8
IND need 131 runs in 38 balls
Schedule ›
3rd TEST • SA vs AUS
Live
SASA
(73.2 ov) 329 & 201/5
AUSAUS
429
Day 4 - Session 1
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ఒకే సారి రెండు దేశాల్లో నిద్రపోవచ్చు...ప్రపంచంలోనే విచిత్రమైన ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసా?
Recommended image2
Vodka: వోడ్కాకు రంగు, ఘాటైన వాసన ఎందుకు ఉండవు? వోడ్కా, విస్కీల మధ్య తేడా ఏంటి?
Recommended image3
Church : ఆసియాలోనే అతిపెద్ద చర్చ్ తెలంగాణదే.. ఒకేసారి 40,000 మంది ప్రార్థన చేయవచ్చా..!
Related Stories
Recommended image1
Phone Charging Tips : మీ ఫోన్‌ ఛార్జింగ్‌లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. చేశారో పెద్ద ప్రమాదంలో పడ్డట్టే!
Recommended image2
Phone Addiction: కంటిన్యూగా గంటసేపు ఫోన్ చూస్తే ఏమవుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved