MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Feature
  • African Lungfish: నీరు లేకుండా ఏకంగా నాలుగేళ్లు బతికేసే వింత చేప ఇది.. ఈ ఆఫ్రికన్ లంగ్‌ఫిష్ కథేంటో తెలుసా?

African Lungfish: నీరు లేకుండా ఏకంగా నాలుగేళ్లు బతికేసే వింత చేప ఇది.. ఈ ఆఫ్రికన్ లంగ్‌ఫిష్ కథేంటో తెలుసా?

African Lungfish : నీరు లేకపోతే చేపలు చనిపోతాయనే రూల్‌ను బ్రేక్ చేస్తూ, ఏకంగా నాలుగేళ్ల పాటు గాలి పీలుస్తూ బతికేసే ఆఫ్రికన్ లంగ్‌ఫిష్ చాలా ప్రత్యేకం. దీంతో పాటు ఇతర వింత చేపల షాకింగ్ విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 19 2026, 02:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
African Lungfish: వామ్మో.. నీళ్లు లేకపోయినా 4 ఏళ్లు బతికే చేప! తిండి లేకుండా ఎలా మేనేజ్ చేస్తుంది?
Image Credit : Gemini

African Lungfish: వామ్మో.. నీళ్లు లేకపోయినా 4 ఏళ్లు బతికే చేప! తిండి లేకుండా ఎలా మేనేజ్ చేస్తుంది?

చేపలు అనగానే మనకు గుర్తొచ్చేది నీళ్లు. 'చేపను నీటి నుండి బయటకు తీస్తే క్షణాల్లో చనిపోతుంది' అని చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం. కానీ ప్రకృతి రూల్స్ అన్నింటికీ వర్తించవు అని నిరూపిస్తోంది ఒక వింత చేప. తీవ్రమైన కరవు వచ్చి, చెరువులన్నీ ఎండిపోయినా సరే.. చుక్క నీరు లేకుండా ఏకంగా నాలుగేళ్ల పాటు కూల్‌గా బతికేస్తుంది ఈ చేప.

జీవశాస్త్ర నియమాలను సైతం ఛాలెంజ్ చేస్తూ, సొంతంగా మట్టి గూళ్లు కట్టుకుని గాలి పీల్చే ఈ అద్భుతమైన జీవి పేరే 'ఆఫ్రికన్ లంగ్‌ఫిష్'. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 34,000 కంటే ఎక్కువ విభిన్న చేపల జాతులు ఉంటే, అందులో ఇదొక రియల్ వండర్ అని చెప్పాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మట్టిలో స్లీపింగ్ బ్యాగ్.. లంగ్‌ఫిష్ క్రేజీ ప్లాన్
Image Credit : Getty

మట్టిలో స్లీపింగ్ బ్యాగ్.. లంగ్‌ఫిష్ క్రేజీ ప్లాన్

ఆఫ్రికా ఖండంలోని బురద చిత్తడి నేలల్లో ఎండలు ముదిరి, నీరంతా ఎండిపోయినప్పుడు సాధారణ చేపలన్నీ ప్రాణాలు వదిలేస్తాయి. కానీ ఈ లంగ్‌ఫిష్ మాత్రం స్మార్ట్ గేమ్ ఆడుతుంది. చెరువులో నీరు అయిపోతోందని తెలియగానే, తన నోటితో బురదను తవ్వుకుంటూ లోపలికి వెళ్తుంది. 

అక్కడ తన చర్మం నుండి ఒక రకమైన జిగురు లాంటి ద్రవాన్ని రిలీజ్ చేస్తుంది. ఆ ద్రవం కాస్తా గట్టిపడి, ఒక ప్లాస్టిక్ కవర్ లాంటి స్లీపింగ్ బ్యాగ్ లా మారిపోతుంది. ఈ గూడు పైభాగంలో ఒక చిన్న హోల్ పెట్టుకుని, మొప్పలతో కాకుండా నేరుగా తన ఊపిరితిత్తులతో గాలి పీలుస్తుంది. సైంటిస్టులు ఈ వింత వేసవి నిద్రను ఎస్టివేషన్ అని పిలుస్తారు. ఈ టైమ్‌లో అది తన జీవక్రియ వేగాన్ని పూర్తిగా తగ్గించేసి, కదలకుండా తిండి లేకుండా నాలుగేళ్ల వరకు పడుకుంటుంది.

Related Articles

Related image1
Snake: కోబ్రా కాటేసినా నో టెన్షన్.. ఈ కన్నీళ్లు మీ ప్రాణాలు కాపాడతాయి.. అసలు మ్యాటర్ ఇదీ!
Related image2
Gold: ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్న దేశం ఏదో తెలుసా? ఆ నంబర్ చూస్తే షాకవుతారు !
34
నీటిలో ఉంచితే మునిగి చనిపోయే చేప
Image Credit : Asianet News

నీటిలో ఉంచితే మునిగి చనిపోయే చేప

వినడానికి చాలా వింతగా ఉన్నప్పటికీ, ఈ ఆఫ్రికన్ లంగ్‌ఫిష్‌లు వాతావరణంలోని గాలిని నేరుగా పీల్చడంపైనే పూర్తిగా డిపెండ్ అవుతాయి. వీటికి ఊపిరితిత్తులు చాలా బలంగా ఉండటం వల్ల, వీటిని గాలి ఆడనివ్వకుండా ఎక్కువసేపు నీటిలోనే బలవంతంగా ఉంచితే శ్వాస అందక మునిగిపోయి చనిపోతాయి.

భూమిపై డైనోసార్లు తిరిగిన కాలం కంటే ముందు నుండి, అంటే దాదాపు 400 మిలియన్ సంవత్సరాలుగా ఈ జీవులు ఎటువంటి మార్పులు లేకుండా ఇలాగే బతుకుతున్నాయి. అందుకే శాస్త్రవేత్తలు వీటిని జీవించి ఉన్న శిలాజాలు అని పిలుస్తారు. మానవుల పరిణామ క్రమాన్ని స్టడీ చేయడానికి ఇవి ఒక కీ లింక్‌గా మారాయి.

44
కొర్రమీను నుండి మడ్‌స్కిప్పర్ వరకు.. నీటి బయట జీవించే చేపలు
Image Credit : Asianet News

కొర్రమీను నుండి మడ్‌స్కిప్పర్ వరకు.. నీటి బయట జీవించే చేపలు

లంగ్‌ఫిష్ మాత్రమే కాదు, మన చుట్టుపక్కల ఉండే కొన్ని చేపలు కూడా నీరు లేకుండా మేనేజ్ చేయగలవు. మనకు బాగా తెలిసిన 'నార్తర్న్ స్నేక్‌హెడ్' (కొర్రమీను జాతి) గాలిలో కాస్త తేమ ఉంటే చాలు, తనకున్న సుప్రాబ్రాంకియల్ అనే స్పెషల్ అవయవంతో 4 రోజుల పాటు ఈజీగా బతికేస్తుంది.

అలాగే 'మార్బుల్ మ్యాంగ్రోవ్ రివులస్' అనే చేప ఏకంగా 66 రోజుల పాటు కుళ్ళిపోతున్న చెట్ల దుంగల లోపల దాక్కుని, చర్మం ద్వారా ఆక్సిజన్ తీసుకుంటుంది. ఇక 'మడ్‌స్కిప్పర్' అనే వింత చేప తన మొప్పలలో నీటిని స్టోర్ చేసుకుని, రెండు రోజుల పాటు నేలపైనే గడుపుతుంది. 'క్లైంబింగ్ పెర్చ్' అనే చేప అయితే ఒక నీటి గుంట నుండి ఇంకో గుంటకు మారడానికి తన పదునైన మొప్పల పలకలతో నేలపై ఏకంగా నడుచుకుంటూ వెళ్తుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ప్రపంచం

Latest Videos
Recommended Stories
Recommended image1
Onion Tears : ఉల్లిపాయ కోస్తే కన్నీళ్లు ఎందుకు వస్తాయి? దీని వెనక ఇంత కెమిస్ట్రీ దాగుందా?
Recommended image2
Beer Facts: బీర్‌లో నురగ ఎందుకు వస్తుంది? 6 వేల ఏళ్ల చరిత్ర వెనుక ఆసక్తికర విషయాలివే
Recommended image3
సచిన్, ధోని, రోహిత్, కోహ్లీ లకు ఆడపిల్లలే పుట్టడానికి కారణమేంటో తెలుసా?
Related Stories
Recommended image1
Snake: కోబ్రా కాటేసినా నో టెన్షన్.. ఈ కన్నీళ్లు మీ ప్రాణాలు కాపాడతాయి.. అసలు మ్యాటర్ ఇదీ!
Recommended image2
Gold: ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్న దేశం ఏదో తెలుసా? ఆ నంబర్ చూస్తే షాకవుతారు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved