MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Facts : హిప్పో చెమట ఎర్రగా ఉంటుందా..! 'బ్లడ్ స్వెట్' నిజమేనా?

Facts : హిప్పో చెమట ఎర్రగా ఉంటుందా..! 'బ్లడ్ స్వెట్' నిజమేనా?

నీటి ఏనుగుల (హిప్పోపొటమస్) చెమట ఎరుపు రంగులో ఎందుకు ఉంటుందో తెలుసా? దీని వెనుక ఆసక్తికరమైన సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 22 2026, 01:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హిప్పో 'బ్లడ్ స్వెట్' నిజమేనా?
Image Credit : stockPhoto

హిప్పో 'బ్లడ్ స్వెట్' నిజమేనా?

ఈ భూమిపై ఉన్న వింత జీవులలో నీటి ఏనుగులు (హిప్పోపొటమస్) కూడా ఒకటి. భారీ శరీరంతో ఉండే ఇవి, తమ జీవితంలో ఎక్కువ సమయం నీటిలోనే గడుపుతాయి. అయితే ఇవి భూమిపైనా జీవించగలవు… అందుకే వీటిని ‘పాక్షిక జలచరంగా’ పేర్కొంటారు. ఏనుగులు, ఖడ్గమృగాల తర్వాత భూమిపై నివసించే అతిపెద్ద జంతువు హిప్పోనే. 

అయితే మిగతా జంతువుల్లా కాకుండా హిప్పో కొన్ని ప్రత్యేకతలు కలిగివుంది. సాధాారణంగా మనిషి, ఇతర జంతువుల చెమట తెల్లగా నీటిమాదిరిగానే ఉంటుంది… కానీ హిప్పో చెమట మాత్రం రంగు లేకుండా ఉండదు… ఎరుపు లేదా నారింజ రంగులో ఉంటుంది. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? ఆ చెమట వాటికి ఎంత ముఖ్యమో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నీటి ఏనుగుల చెమట ఎర్రగా ఉండటానికి కారణమిదే..
Image Credit : stockPhoto

నీటి ఏనుగుల చెమట ఎర్రగా ఉండటానికి కారణమిదే..

నీటి ఏనుగుల చెమట ఎర్రగా ఉండటానికి ఓ సైంటిఫిక్ కారణం ఉంది. నిజానికి అది చెమట కాదు, రక్తం అంతకన్నా కాదు. వాటి చర్మం కింద ఉండే ప్రత్యేక గ్రంథులు ఒక రకమైన ద్రవాన్ని స్రవిస్తాయి. ఈ ద్రవాలు ఇతర జంతువుల చెమట మాదిరిగానే రంగు లేకుండా ఉంటుంది… అయితే శరీరంలోంచి బయటకు వచ్చాక ఈ ద్రవం గాలిలోని  ఆక్సిజన్ తో చర్య జరిపి ఎరుపు లేదా నారింజ రంగులోకి మారుతుంది. ఇది చూడటానికి రక్తంలా ఉండటంతో దీన్ని 'బ్లడ్ స్వెట్' అని పొరపాటుగా పిలుస్తారు.

35
సహజసిద్ధమైన సన్‌స్క్రీన్ గా పనిచేస్తుంది
Image Credit : stockPhoto

సహజసిద్ధమైన సన్‌స్క్రీన్ గా పనిచేస్తుంది

నీటి ఏనుగుల (హిప్పో) శరీరానికి గమనిస్తే చాలా నునుపుగా ఉంటాయి… వెంట్రుకలు అనేవే ఉండవు. వాటి చర్మం కూడా చాలా సున్నితంగా ఉంటుంది. హిప్పోలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి… అక్కడి మండుటెండకు వాటి చర్మం కాలిపోయే ప్రమాదం ఉంది. ఈ ఎండల నుండి తమనుతాము కాపాడుకునేందుకే ఈ ఎర్రటి ద్రవం విడుదల చేస్తాయి. 

హిప్పోలు విడుదలచేసే ఎర్రటి ద్రవంలో హిప్పోసుడోరిక్ యాసిడ్, నార్‌హిప్పోసుడోరిక్ యాసిడ్ అనే రెండు ఆమ్లాలు ఉంటాయి. ఇవి సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను (UV rays) గ్రహిస్తాయి. ఇలా చర్మానికి ఎలాంటి హాని కలగకుండా ఒక సహజ సన్‌స్క్రీన్‌లా పనిచేస్తాయి. అందువల్లే హిప్పోలు 40-45 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ తిరుగుతూ కనిపిస్తుంటాయి.

45
యాంటీబయాటిక్ పనిచేస్తుంది
Image Credit : stockPhoto

యాంటీబయాటిక్ పనిచేస్తుంది

మగ నీటి ఏనుగులు తమ ప్రాంతం కోసం ఇతర హిప్పోలతో భయంకరంగా పోరాడతాయి. ఈ గొడవల్లో వాటి శరీరానికి పెద్ద గాయాలు అవుతాయి. క్రిములు ఎక్కువగా ఉండే బురద నీటిలో ఉన్నప్పటికీ హిప్పో శరీరంనుండి విడుదలయ్యే ప్రత్యేక ద్రవం యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. అంటే గాయంపై బ్యాక్టీరియా చేరకుండా చూస్తుంది. ఇలా గాయాలు త్వరగా నయం కావడానికి ఇది సహాయపడుతుంది.

55
కీటక నాశిని, మాయిశ్చరైజర్
Image Credit : stockPhoto

కీటక నాశిని, మాయిశ్చరైజర్

నీటిలో, బురదలో జీవించే నీటి ఏనుగులపై ఈగలు, దోమలు వంటి కీటకాలు సులభంగా వాలుతాయి. కానీ ఈ ఎర్రటి ద్రవం జిగటగా ఉండటం, దాని వాసన కారణంగా కీటకాలు వాటిపైకి రాకుండా ఉంటాయి. అంటే ఇది ఒక కీటక నాశినిగా కూడా పనిచేస్తుంది. అంతేకాదు ఎక్కువసేపు ఎండలో ఉన్నప్పుడు చర్మం పొడిబారకుండా, పగలకుండా ఈ ద్రవం ఒక లోషన్‌లా పనిచేసి చర్మంలోని తేమను కాపాడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నీటి ఏనుగు శరీరం దానికి అవసరమైన సన్‌స్క్రీన్, యాంటీసెప్టిక్, మాయిశ్చరైజర్‌ను సొంతంగా తయారు చేసుకుంటుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేని దేశం.. మరి వాహనాలను ఎలా నియంత్రిస్తారో తెలుసా?
Recommended image2
Girls vs Boys: అమ్మాయిలు, అబ్బాయిల్లో ఎవరు అందంగా ఉంటారు? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
Recommended image3
చూడ్డానికి ఒకేలా ఉన్నా.. ఎస్కలేటర్, ట్రావెలేటర్ మధ్య తేడా ఏంటి.?
Related Stories
Recommended image1
Exam Facts : పాాస్ మార్కులు 35 ఎందుకు? ఈ రూల్ ఎవరు పెట్టారు?
Recommended image2
Facts : నుదిటినే బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? కుంకుమ, చందనం, విభూతి, పసుపు.. ఏది పెట్టుకుంటే ఏమిటర్థం?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved