MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Feature
  • Exam Facts : పాాస్ మార్కులు 35 ఎందుకు? ఈ రూల్ ఎవరు పెట్టారు?

Exam Facts : పాాస్ మార్కులు 35 ఎందుకు? ఈ రూల్ ఎవరు పెట్టారు?

100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తే కేవలం 35 మార్కులు వస్తే పాస్ అయినట్లే… ఇది అందరికీ తెలిసిందే. అయితే పాస్ మార్కులు 35 ఎందుకు? ఏ 30, 40 ఎందుకు కాదు? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్రను ఇప్పుడు చూద్దాం.

3 Min read
Author : Arun Kumar P
Published : Jul 14 2026, 02:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
35 మార్కులు వస్తేనే పాస్... ఈ రూల్ ఎలా వచ్చింది
Image Credit : Gemini AI

35 మార్కులు వస్తేనే పాస్... ఈ రూల్ ఎలా వచ్చింది

స్కూల్, కాలేజీ, యూనివర్సిటీ… ఎక్కడైనా పరీక్షల్లో పాస్ అవ్వాలంటే 100 కు తప్పనిసరిగా 35 మార్కులు రావాలి. ఒక్క మార్కు తక్కువ వచ్చినా ఫెయిల్ అయినట్లే. అందుకే చదువులో వెనకబడ్డ విద్యార్థులు కేవలం 35 మార్కులు వస్తే చాలని అనుకుంటారు... ఇందుకోసమే ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ 35 పాస్ మార్కుల రూల్ ఎక్కడి నుండి వచ్చింద్రా బాబు అనుకుంటారు.. ఇదే డౌట్ ఇంకా చాలామందికి ఉంటుంది. మరి ఈ పాస్ మార్కుల స్టోరీ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. 

కొన్ని దశాబ్దాలుగా భారత విద్యావ్యవస్థలో పాస్ మార్కులు 35 రూల్ కొనసాగుతోంది.. ఇది మన పరీక్షల సంస్కృతిలో భాగమైపోయింది. అయితే ఈ రూల్ బ్రిటిష్ కాలం నాటి వారసత్వంగా వచ్చిందా లేక స్వాతంత్య్రం తర్వాత తీసుకున్న నిర్ణయమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మన విద్యా విధానాన్ని రూపొందించే క్రమంలో తీసుకున్న ఆనాటి నిర్ణయాలను లోతుగా పరిశీలించాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇండియాలో ఇంగ్లీష్ చదువు ఎలా మొదలయ్యిందో తెలుసా?
Image Credit : Asianet News

ఇండియాలో ఇంగ్లీష్ చదువు ఎలా మొదలయ్యిందో తెలుసా?

ఇండియా బ్రిటిష్ వాళ్ల ఆధీనంలో ఉండగా పరిపాలనా అవసరాల కోసం ఉద్యోగులు కావాల్సి వచ్చింది. అయితే ప్రతి చిన్న ఉద్యోగిని ఇంగ్లాండ్ నుండి తీసుకురాలేరు… కాబట్టి ఇక్కడి ప్రజలకే జాబ్స్ ఇవ్వాలని భావించారు. అందుకోసమే ఇక్కడి విద్యావ్యవస్థలో కీలక సంస్కరణలు చేపట్టారు ఆంగ్లేయులు.

బ్రిటీష్ అధికారి లార్డ్ మెకాలే 1835లో తన 'మినిట్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్'లో ఒక ప్రతిపాదన చేశారు. 'రక్తంలో, రంగులో భారతీయులుగా ఉండి.. అభిరుచి, అభిప్రాయాలు, నైతికత, తెలివిలో ఆంగ్లేయులుగా' ఉండే ఒక వర్గాన్ని తయారు చేయడమే మన లక్ష్యం కావాలని సూచించాడు. ఈ మెకాలే ప్రతిపాదనలే ఆంగ్ల విద్యకు దారి చూపాయి. 

అయితే మెకాలే ఎక్కడా 35 పాస్ మార్క్ గురించి చెప్పలేదు. ఆయన దృష్టి బోధనా మాధ్యమం, సిలబస్‌పైనే ఉండేది. మొదట్లో కొద్దిమంది ఉన్నత వర్గాలకే విద్య అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ అది క్రమంగా మారింది… అందరికీ విద్యా అందుబాటులోకి వచ్చింది.

35
35 మార్కుల రూల్ వెనక సీక్రెట్..
Image Credit : Getty

35 మార్కుల రూల్ వెనక సీక్రెట్..

పరీక్షల్లో 35 పాస్ మార్క్ అనే నియమం కచ్చితంగా ఎప్పుడు మొదలైందో చెప్పడం కష్టం. దీనిపై స్పష్టమైన ఆధారాలు లేవు. 19వ శతాబ్దం చివర్లో లేదా 20వ శతాబ్దం ప్రారంభంలో తీసుకున్న కొన్ని ఆచరణాత్మక నిర్ణయాల వల్లే ఈ రూల్ వచ్చివుంటుందని చాలామంది మేథావుల అభిప్రాయం.   

బ్రిటిష్ పరిపాలనకు పెద్ద సంఖ్యలో క్లర్కులు, జూనియర్ అధికారులు అవసరమయ్యారు. ఇందుకోసం 100 కు 100 మార్కులు సాధించేంత తెెలివైనవారు అవసరం లేదు… మినిమం మార్కులతో పాసయినా సరిపోతుంది. అందుకే 35 లేదా 33 వంటి తక్కువ పాస్ మార్కును పెట్టడం వల్ల ఈ ఉద్యోగాలకు చాలా మందిని వేగంగా అర్హులుగా చేయగలిగారు. ఈ విధానం వలస ప్రభుత్వానికి బాగా ఉపయోగపడింది. చాలా మంది భారతీయులు సివిల్ సర్వీస్, ఇతర పరిపాలన ఉద్యోగాల్లో చేరడానికి ఇది వీలు కల్పించింది.

45
తక్కువ పాస్ మార్కుల వెనుక కారణం ఏంటి?
Image Credit : Gemini AI

తక్కువ పాస్ మార్కుల వెనుక కారణం ఏంటి?

50% కాకుండా 35% మార్కును ఎందుకు ఎంచుకున్నారు? అంటే దీనికీ ఒక థియరీ ఉంది. బ్రిటిష్ వ్యవస్థ కొన్ని పరీక్షలకు 33% మార్కును పాస్ మార్క్‌గా పరిగణించేది. ఇందులో చిన్నచిన్న మార్పులు చోటుచేసుకుని 35% పాస్ మార్కుల రూల్ వచ్చినట్లు చెబుతుంటారు. 

మరో వాదన ప్రకారం… అప్పట్లో విద్యార్థులు ఎదుర్కొన్న సవాళ్లు, ముఖ్యంగా విదేశీ భాష అయిన ఇంగ్లీషులో చదవడం కష్టతరం కావడంతో తక్కువ పాస్ మార్కు పెట్టడం ఆచరణాత్మక నిర్ణయంగా మారింది. విద్యను అందరికీ అందుబాటులోకి తేవడమే దీని ఉద్దేశం. ఎక్కువ మంది ఫెయిల్ అవ్వకుండా చూడటం, తద్వారా ఎక్కువ మందిని చదువు వైపు ప్రోత్సహించడం దీని లక్ష్యం. అకడమిక్ నైపుణ్యం కంటే, ప్రాక్టికల్ అక్షరాస్యతకే ప్రాధాన్యం ఇచ్చారు.

55
స్వతంత్ర భారతంలోనూ కొనసాగుతున్న 35 మార్కుల రూల్
Image Credit : Getty

స్వతంత్ర భారతంలోనూ కొనసాగుతున్న 35 మార్కుల రూల్

1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది… అయినాా ఆంగ్లేయులు అలవాటు చేసిన విద్యావిధానమే కొనసాగించారు మన పాలకులు. వివిధ రాష్ట్ర, కేంద్ర బోర్డులలో 35% పాస్ మార్క్ ఒక ప్రామాణిక పద్ధతిగా మారింది. ఉత్తమ పనితీరును ప్రోత్సహించడానికి పాస్ మార్కును పెంచాలనే చర్చలు తరచుగా జరిగినా, 35 మార్కులే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. లక్షలాది మంది భారతీయ విద్యార్థుల విద్యా జీవితాన్ని ఈ మార్కులే నిర్దేశిస్తున్నాయి. ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలనా సాధనంగా ఉన్న ఈ వారసత్వం, ఇప్పుడు భారతీయ విద్యార్థులకు కనీస అర్హతను నిర్దేశిస్తోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
విద్య
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Facts : వాటర్ బాటిల్‌పై అడ్డంగా గీతలుంటాయి కదా.. ఎందుకో తెలుసా?
Recommended image2
IRCTC Ultimate Ooty Tour: బడ్జెట్‌లో హైదరాబాద్ నుంచి ఊటీ, కూనూర్ ట్రిప్.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Recommended image3
River : వేల కిలోమీటర్లు ప్రయాణించి... సముద్రంలో కలవక ముందే కనుమరుగయ్యే నది ఏది?
Related Stories
Recommended image1
TS Inter Exams: ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడితే, క్రిమినల్ కేసు..!
Recommended image2
Entrance Exams : పదో తరగతి తర్వాత ఫ్రీగా ఇంటర్ చదవాలా..? అయితే తప్పక రాయాల్సిన ప్రవేశ పరీక్షలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved