MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Facts : నుదిటినే బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? కుంకుమ, చందనం, విభూతి, పసుపు.. ఏది పెట్టుకుంటే ఏమిటర్థం?

Facts : నుదిటినే బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? కుంకుమ, చందనం, విభూతి, పసుపు.. ఏది పెట్టుకుంటే ఏమిటర్థం?

హిందూమతంలో నుదుట బొట్టు పెట్టుకోవడం ఒక ముఖ్యమైన సంప్రదాయం. దీని వెనుక కేవలం మతపరమైన నమ్మకాలే కాదు, కొన్ని సైంటిఫిక్ కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో చాలామందికి తెలియదు… కాబట్టి ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 13 2026, 08:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బొట్టు పెట్టుకోవడం వెనక ఇంత స్టోరీ ఉందా?
Image Credit : Gemini AI

బొట్టు పెట్టుకోవడం వెనక ఇంత స్టోరీ ఉందా?

Why Tilak is Applied: హిందూ సంప్రదాయంలో పూజలు, పండుగలు, పెళ్లిళ్లు లేదా ఏదైనా శుభకార్యం మొదలుపెట్టేటప్పుడు నుదుట బొట్టు పెట్టడం చూస్తూనే ఉంటాం. ఇది శతాబ్దాలుగా వస్తున్న ఆచారం. తిలకం కేవలం ఒక మతపరమైన గుర్తు మాత్రమే కాదు అది గౌరవానికి, నమ్మకానికి, శుభాకాంక్షలకు కూడా చిహ్నం. కుంకుమ, చందనం, పసుపు, భస్మం (విభూది) లేదా సిందూరంతో తిలకం దిద్దుతారు. అయితే ఒక్కో సంప్రదాయంలో, ఒక్కో పద్ధతిలో పెట్టే తిలకానికి వేర్వేరు అర్థాలు ఉంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అసలు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు?
Image Credit : Getty

అసలు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు?

హిందూ సంప్రదాయంలో బొట్టు పెట్టుకోడాన్ని శుభానికి, పాజిటివ్ ఎనర్జీకి సంకేతంగా భావిస్తారు. పూజ తర్వాత బొట్టు పెట్టుకున్నారంటే, ఆ వ్యక్తి దేవుడి ఆశీస్సులు తీసుకున్నాడని అర్థం. అలాగే ఇంటికి వచ్చిన అతిథులకు, సైనికులకు, విద్యార్థులకు లేదా ఏ ముఖ్యమైన వ్యక్తికైనా తిలకం దిద్ది స్వాగతం పలకడం అంటే వారికి గౌరవం ఇవ్వడం, శుభం కలగాలని కోరుకోవడం. దసరా, దీపావళి, రక్షాబంధన్, భాయ్ దూజ్, పెళ్లిళ్ల వంటి సందర్భాల్లో కుటుంబ సభ్యులు ఒకరికొకరు బొట్టు పెట్టుకుని సుఖసంతోషాలు, మంచి భవిష్యత్తు కలగాలని ప్రార్థిస్తారు.

35
నుదురు మీదే బొట్టు ఎందుకు పెట్టాలి?
Image Credit : AI Generated

నుదురు మీదే బొట్టు ఎందుకు పెట్టాలి?

సాధారణంగా బొట్టును రెండు కనుబొమ్మల మధ్య నుదుటిపై పెడతారు. యోగా, ధ్యాన సంప్రదాయాల్లో ఈ ప్రదేశాన్ని 'ఆజ్ఞా చక్రం' (Ajna Chakra) అని పిలుస్తారు. దీన్ని ఏకాగ్రత (concentration), ఆత్మపరిశీలన (Self-Examination), మానసిక సమతుల్యతకు (Mental Balance) కేంద్రంగా చూస్తారు.

బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న సైన్స్‌పై కొన్ని పరిశోధనలు జరిగాయి. చందనంతో బొట్టు పెట్టుకుంటే చర్మానికి చల్లగా అనిపిస్తుంది, ఎందుకంటే చందనానికి సహజంగానే శీతలీకరణ గుణం ఉంటుంది. నుదుటిపై సున్నితంగా తాకడం వల్ల కొంతమందికి మానసిక ప్రశాంతత లభిస్తుంది, మనసును ఒకేచోట నిలపడానికి సహాయపడుతుంది. పూజల సమయంలో తిలకం పెట్టుకునే ప్రక్రియ, ఆ వ్యక్తిని మానసికంగా ఆ కార్యక్రమంతో కనెక్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.

45
రకరకాల తిలకాలకు అర్థాలేంటి?
Image Credit : Getty

రకరకాల తిలకాలకు అర్థాలేంటి?

హిందూమతంలో చాలా రకాల తిలకాలు వాడుకలో ఉన్నాయి. వాటికి వేర్వేరు ప్రాముఖ్యతలు కూడా ఉన్నాయి.

1. కుంకుమ బొట్టు

శుభకార్యాలు, పూజలు, పండుగల్లో దీన్ని ఎక్కువగా వాడతారు. దీన్ని అదృష్టానికి, సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు.

2. చందనం తిలకం

చాలా ఆలయాల్లో, మతపరమైన కార్యక్రమాల్లో గంధంతో బొట్టు పెడతారు. ఇది శాంతికి, పవిత్రతకు, భక్తికి గుర్తు.

3. భస్మం (విభూది) తిలకం

శైవ సంప్రదాయంలో శివభక్తులు భస్మాన్ని తిలకంగా ధరిస్తారు. ఇది జీవితం అశాశ్వతత్వానికి, వైరాగ్యానికి ప్రతీకగా పరిగణిస్తారు.

4. పసుపు బొట్టు

పసుపును చాలా శుభకార్యాల్లో, ముఖ్యంగా పెళ్లిళ్ల వంటి వేడుకల్లో వాడతారు. దీన్ని శుభప్రదంగా, పవిత్రంగా భావిస్తారు.

55
బొట్టు కేవలం హిందూమతంలోనే పెట్టుకుంటారా?
Image Credit : pinterest

బొట్టు కేవలం హిందూమతంలోనే పెట్టుకుంటారా?

ప్రధానంగా ఇది హిందూ సంప్రదాయానికి సంబంధించిందే అయినా, భారతీయ సంస్కృతిలో చాలా సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ దీన్ని వాడతారు. చాలా చోట్ల అతిథులకు తిలకం దిద్ది స్వాగతం పలుకుతారు. ఇది గౌరవానికి, ఆదరణకు చిహ్నంగా మారింది.

రోజూ బొట్టు పెట్టుకోవడం తప్పనిసరా?

ఇది పూర్తిగా వ్యక్తిగత నమ్మకం, సంప్రదాయంపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది రోజూ పూజ తర్వాత బొట్టు పెట్టుకుంటారు. మరికొందరు కేవలం గుడికి వెళ్లినప్పుడు, పండుగలప్పుడు లేదా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే పెట్టుకుంటారు, కొందరు అస్సలు పెట్టుకోరు. ఎవరి ఇష్టానుసారం బొట్టు పెట్టుకోవాలా, వద్దా అన్నది ఆదారపడి ఉంటుంది.

తిలకం వెనుక ఉన్న సామాజిక ప్రాముఖ్యత

తిలకం కేవలం మతపరమైన గుర్తింపు మాత్రమే కాదు, ఇది ఒక పురాతన సామాజిక బంధం కూడా. కుటుంబంలో, సమాజంలో, మతపరమైన కార్యక్రమాల్లో ఇది ప్రజలను కలుపుతుంది. ఉదాహరణకు విద్యార్థులు పరీక్షలకు వెళ్తున్నప్పుడు, కుటుంబ సభ్యులు వారి నుదుట బొట్టు పెట్టి విజయం కలగాలని ఆశీర్వదిస్తారు. అలాగే సైనికులకు లేదా క్రీడాకారులకు తిలకంతో స్వాగతం పలకడం వారికి ఇచ్చే గౌరవానికి, శుభాకాంక్షలకు గుర్తు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రపంచంలో విమానాశ్రయాలు లేని దేశాలివే.. మరి ఆ దేశాలకు ఎలా వెళ్తారు.?
Recommended image2
అమెరికాలో క‌రెంట్ ఎందుకు పోదు.? ఇంత‌కీ అక్క‌డ విద్యుత్ వ్యవస్థ ఎలా ప‌నిచేస్తుంది?
Recommended image3
Jalebi/Tang Huan: మన జిలేబీకి చైనా వెర్షన్ ఇది.. దీని పేరేంటో తెలుసా?
Related Stories
Recommended image1
వితంతువులు బొట్టు, పూలు పెట్టుకోవచ్చా?
Recommended image2
ఎవరికి ఏ షేప్ బొట్టు అందాన్ని ఇస్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved