MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • HORN OK PLEASE : లారీల వెనక 'OK' అని ఎందుకు రాస్తారు? దీని అర్థం 'సరే' కాదు, మరేంటో తెలుసా?

HORN OK PLEASE : లారీల వెనక 'OK' అని ఎందుకు రాస్తారు? దీని అర్థం 'సరే' కాదు, మరేంటో తెలుసా?

మనం రోడ్ల మీద వెళ్లేటప్పుడు లారీల వెనుక 'HORN OK PLEASE' అని రాసి ఉండటం చూస్తుంటాం. ‘’HORN PLEASE'' రాస్తే సరిపోతుందిగా.. మధ్యలో ఈ 'OK' ఎందుకు? అని అనుకుంటాం. కానీ ఇలా రాయడం వెనక ప్రత్యేక కారణం ఉంది… అదేంటో తెెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 09 2026, 01:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
లారీల వెనకాల 'OK' అని ఎందుకు రాస్తారు?
Image Credit : Asianet News

లారీల వెనకాల 'OK' అని ఎందుకు రాస్తారు?

మనం హైవేలపై ప్రయాణించేటప్పుడు పెద్దపెద్ద సరుకు రవాణా లారీలు, ట్రక్కులు పక్కనుండి వేగంగా దూసుకెళుతుంటాయి. ఇలా లారీలు మనల్ని ఓవర్ టేక్ చేసినప్పుడు లేదా వాటివెనకాల మన వాహనం వెళుతున్నప్పుడు ఓ విషయాన్ని కచ్చితంగా గమనిస్తాం… అదే ‘’HORN OK PLEASE'' అనే పదాలు రాసివుండటం. ఇక్కడ HORN PLEASE'' అంటే లారీని ఓవర్ టేక్ చేసేటప్పుడు హారన్ కొట్టండి… డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని పక్కకు తీసుకుని సైడ్ ఇస్తాడని అర్థం. మరి మధ్యలో ఈ ‘OK’ ఎందుకుంటుంది?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
HORN OK PLEASE వెనక ఇంతస్టోరీ దాగుందా..!
Image Credit : ChatGPT

HORN OK PLEASE వెనక ఇంతస్టోరీ దాగుందా..!

మనం 'ఓకే' అనే పదాన్ని ప్రతిరోజూ ఎన్నోసార్లు ఉపయోగిస్తాం... దీనర్థం సరే అని. కానీ లారీల వెనక ఉండే 'ఓకే' కి మాత్రం మరో మీనింగ్ ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే దాదాపు 80 ఏళ్లు వెనక్కి రెండవ ప్రపంచ యుద్ధ కాలానికి వెళ్లాలి.

1939 నుండి 1945 వరకు రెండో ప్రపంచ యుద్దం జరిగింది.. ఈ సమయంలో ఇండియాలో తీవ్రమైన పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది... దీంతో వాహనాలను కిరోసిన్ తో నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే పెట్రోల్ లేదా డీజిల్ కంటే చాలా త్వరగా మండే స్వభావం ఈ కిరోసిన్ కు ఉంటుంది.. ఇది ప్రమాదకరం కావడంతో వాహనాలను మరింత జాగ్రత్తగా నడపాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఈ లారీ కిరోసిన్ తో నడుస్తుంది అని ఇతర వాహనదారులకు తెలియజేసేందుకు వెనకాల 'OK' అని రాయడం ప్రారంభించారు. OK అంటే ON Kerosine (కిరోసిన్ తో నడిచే వాహనం) అన్నమాట.

'HORN OK PLEASE'అంటే లారీని ఓవర్ టేక్ చేయాలంటే ముందు హారన్ మోగించాలని చెప్పడమే కాదు ఇది కిరోసిన్ తో నడిచే వాహనం అనికూడా అర్థం. ప్రమాదాలను నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ OK అన్న పదం రెండో ప్రపంచ యుద్ద సమయంలో మొదలై ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ తో లారీలు నడుస్తున్నా ఓకే అనే పదాన్ని రాయించుకోవడం ఓ సాంప్రదాయంగా మారింది.

35
OK వెనకున్న ఇంకో స్టోరీ
Image Credit : Gemini AI

OK వెనకున్న ఇంకో స్టోరీ

లారీల వెనకాల 'OK' అనే పదాన్ని రాయడంవెనక మరో కథ కూడా ప్రచారంలో ఉంది. టాటా ఆయిల్ మిల్స్ కంపెనీకి చెందిన 'OK' అనే సబ్బు/డిటర్జెంట్ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి గతంలో లారీలపై 'OK' అని రాసేవారని ఒక థియరీ చెబుతోంది. ఆ తర్వాత అది లారీల అలంకరణలో ఒక భాగమైపోయిందని అంటారు. అయితే దీనికి కూడా కచ్చితమైన చారిత్రక ఆధారం లేదు. కాబట్టి 'OK = On Kerosene' అయినా, 'OK = యాడ్ బ్రాండ్' అయినా... ఈ రెండు కథలూ నిరూపితమైన నిజాలు కావు.

45
Horn OK Please అని ఇప్పటికీ ఎందుకు రాస్తారు?
Image Credit : Asianet News

Horn OK Please అని ఇప్పటికీ ఎందుకు రాస్తారు?

కాలం మారింది… ఇప్పటి లారీల్లో ఆధునిక మిర్రర్లు, కెమెరాలు, సెన్సార్ల లాంటి ఎన్నో సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అయినా కూడా 'Horn OK Please' అనేది భారత లారీ కల్చర్‌లో ఒక సింబల్‌గా మారిపోయింది.

లారీల వెనుక రాసే ఈ రాతలు కేవలం సమాచారం కోసం మాత్రమే కాదు దేవుడి పేర్లు, కవితలు, సామెతలు, ఫన్నీ కొటేషన్లు, హెచ్చరికలతో ఇవి ఇండియాకే ప్రత్యేకమైన 'ట్రక్ ఆర్ట్' కల్చర్‌లో ఒక భాగమయ్యాయి. అయితే అనవసరంగా హారన్ కొట్టడాన్ని ప్రోత్సహిస్తోందని భావించి మహారాష్ట్రలో 'Horn OK Please' అనే స్లోగన్‌పై చర్యలు కూడా తీసుకున్నారు. అయినా కూడా ఈ వాక్యం ఇప్పటికీ భారత రోడ్లపై కనిపిస్తూనే ఉంది.

55
OK మీనింగ్ ఇదే..
Image Credit : Asianet News

OK మీనింగ్ ఇదే..

'Horn OK Please' అంటే లారీని ఓవర్‌టేక్ చేసే ముందు హారన్ కొట్టి డ్రైవర్‌కు చెప్పాలనేది వాడుకలో ఉన్న అర్థం. కానీ అందులోని 'OK' అనే పదం అసలు ఎలా వచ్చిందనేది ఇప్పటికీ కచ్చితంగా ఎవరికీ తెలియదు. 'On Kerosene' అనేది బాగా పాపులర్ అయిన థియరీనే అయినా, దాన్ని చారిత్రక నిజం అని చెప్పలేం. ఈ రెండు అక్షరాల వెనుక ఉన్న అసలైన ఇంట్రెస్టింగ్ విషయం ఇదే!

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
భారతీయ ఆటోమొబైల్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Color Changing Lake: ఎడారిలో విచిత్రం.. ఏడాదంతా రంగులు మారే గులాబీ సరస్సు.. అసలు రహస్యం ఇదే
Recommended image2
Lemon Tree: బాల్కనీని కుండీల్లో నిమ్మ మొక్క పెంచండిలా.. గుత్తుగుత్తులుగా కాయలు కాస్తాయి
Recommended image3
Banana Business: వృథాగా పడేసే అరటి బోదెలతో వ్యాపారం.. ఏడాదికి రెండున్నర కోట్ల రూపాయల ఆదాయం
Related Stories
Recommended image1
Interesting Facts : జైళ్లను అద్దెకిచ్చే దేశమేదో తెలుసా?
Recommended image2
Facts : ఏ జంతువుకు ఎన్నిపళ్ళు ఉంటాయి? నోట్లో ఒక్క పన్ను లేని జీవి 14 వేల పళ్లుండే జీవిని తినేస్తుందా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved