MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Did You Know: ఈ భూమిపై పుట్టిన తరువాత కేవలం 5 నిమిషాలు మాత్రమే జీవించే ప్రాణి ఏది?

Did You Know: ఈ భూమిపై పుట్టిన తరువాత కేవలం 5 నిమిషాలు మాత్రమే జీవించే ప్రాణి ఏది?

Did You Know: ప్రపంచంలో ఎన్నో ప్రాణులు ఉన్నాయి. వాటిలో ఒకటి మాత్రం కేవలం పుట్టిన తరువాత అయిదు నిమిషాలు మాత్రమే బతుకుతుంది. పిల్లలకు జన్మనిచ్చి మరణిస్తుంది. ఆ జీవి ఏదో మీకు తెలుసా?

1 Min read
Author : Haritha Chappa
Published : Sep 30 2026, 08:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
అయిదు నిమిషాలు మాత్రమే జీవించే జీవి
Image Credit : Gemini AI

అయిదు నిమిషాలు మాత్రమే జీవించే జీవి

ప్రపంచంలో వేల కొద్దీ రకరకాల జీవులు ఉన్నాయి. అన్నింటిలో అతి ప్రత్యేకమైనది ఒకటుంది. అది పుట్టిన అయిదు నిమిషాలకే మరణిస్తుంది. ప్రపంచంలో ఉన్న తక్కువ ఆయుష్షు కలిగిన జీవుల్లో ఒకటి. దానిపేరు 'మేఫ్లై' (Mayfly). ఇది ఒక తూనీగలాగా కనిపిస్తుంది. నీటిలో పుట్టే ఈ కీటకాలు తమ జీవితకాలంలో అత్యధిక సమయాన్ని లార్వా దశలోనే గడుపుతాయి. కాలక్రమేణా అభివృద్ధి చెంది కీటకాలుగా మారిన తర్వాత, కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే బతికి తరువాత మరణిస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎందుకలా?
Image Credit : Gemini AI

ఎందుకలా?

లార్వాల నుంచి కీటకాలుగా మారిన ఈ మేఫ్లై జీవుల ప్రధాన లక్ష్యం జీవన చక్రం కొనసాగించడమే. రెక్కలు ఏర్పడిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఇవి వేరే కీటకాలతో జతకట్టడం, సంతానోత్పత్తి చేయడం పూర్తి చేస్తాయి. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే ఇవి ప్రాణాలు కోల్పోతాయి. పుట్టిన అయిదు నిమిషాలకే లేదా అత్యల్ప సమయంలోనే మరణించే ఈ స్వభావం కారణంగానే ప్రకృతిలో ఇవి ఎంతో ఆసక్తికరమైన జీవులుగా గుర్తింపు పొందాయి.

33
ఈ కీటకాలు ఎంతో ముఖ్యం
Image Credit : sussexwildlifetrust

ఈ కీటకాలు ఎంతో ముఖ్యం

జీవిత కాలం అత్యంత స్వల్పమైనప్పటికీ, ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో ఈ కీటకాలు కీలక పాత్ర పోషిస్తాయి. జలచరాలకు ఇవి ప్రధాన ఆహారంగా ఉపయోగపడతాయి. భూమి మీద కేవలం కొన్ని నిమిషాల జీవితాన్ని మాత్రమే జీవించే ఈ చిన్న కీటకాలు, జీవ వైవిధ్యం, ప్రకృతి రహస్యాలకు మంచి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Brushing: టూత్ బ్రష్ vs వేప పుల్ల, నోటి ఆరోగ్యానికి ఏది మంచిది? ఏది వాడకూడదు? నిపుణులు ఏమంటున్నారు?
Recommended image2
Color Changing Lake: ఎడారిలో విచిత్రం.. ఏడాదంతా రంగులు మారే గులాబీ సరస్సు.. అసలు రహస్యం ఇదే
Recommended image3
Lemon Tree: బాల్కనీని కుండీల్లో నిమ్మ మొక్క పెంచండిలా.. గుత్తుగుత్తులుగా కాయలు కాస్తాయి
Related Stories
Recommended image1
Banana Business: వృథాగా పడేసే అరటి బోదెలతో వ్యాపారం.. ఏడాదికి రెండున్నర కోట్ల రూపాయల ఆదాయం
Recommended image2
Lemon Tree: బాల్కనీని కుండీల్లో నిమ్మ మొక్క పెంచండిలా.. గుత్తుగుత్తులుగా కాయలు కాస్తాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved