- Home
- Feature
- Indian Village: ఈ గ్రామంలో ఇంకా రాజు పెత్తనమే కొనసాగుతోంది, భారత చట్టాలు ఇక్కడ పనిచేయవు
Indian Village: ఈ గ్రామంలో ఇంకా రాజు పెత్తనమే కొనసాగుతోంది, భారత చట్టాలు ఇక్కడ పనిచేయవు
Indian Village: భారతదేశంలోనే ఉన్నా ఈ దేశ చట్టాలు వర్తించని ఒకే ఒక గ్రామం ఉంది. అక్కడ ఇంకా రాజు పెత్తనమే సాగుతోంది. మన దేశ రాజ్యాంగం, చట్టాలు ఇక్కడ పెద్దగా పనిచేయవు. ఆ గ్రామం ఏ రాష్ట్రంలో ఉందో తెలుసా?

ఈ గ్రామం వెరీ స్పెషల్
భారతదేశంలో ఉన్న ఒక గ్రామం. కానీ అక్కడి పాలన, న్యాయ వ్యవస్థ మాత్రం ఎంతో ప్రత్యేకం. ఈ గ్రామానికి ప్రత్యేక పరిపాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థ ఉన్నాయి. ఇక్కడ భారత చట్టాలను పెద్దగా పట్టించుకోరు. స్థానిక సంప్రదాయాల ప్రకారం గ్రామంలోని సమస్యలను తమ ప్రత్యేక వ్యవస్థ ద్వారానే పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆ వ్యవస్థకు ఒక పెద్దమనిషిని ఎంచుకుంటారు. అతడే ఆ గ్రామానికి రాజుగా వ్యవహరిస్తారు. ఈ గ్రామం పేరు మలానా. హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న విలేజ్. ఇక్కడ దేశ రాజ్యాంగం, చట్టాలు అక్కడ కూడా అమలులో ఉంటాయి. కానీ వాటిని పట్టించుకోకుండా స్థానిక సంప్రదాయాల ప్రకారం గ్రామంలోని సమస్యలను పరిష్కరించుకుంటారు. ప్రకృతి అందాల మధ్య ఉండే ఈ గ్రామానికి వందల ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు నమ్ముతారు. ఇక్కడి ప్రజలు తమ సంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. గ్రామంలో జరిగే వివాదాలను పరిష్కరించేందుకు ప్రత్యేక పాలనా వ్యవస్థ కూడా ఉంది. అందుకే మలానాను ప్రపంచంలోని పురాతన ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఒకటిగా కొందరు అభివర్ణిస్తారు.
రెండు సభలతో గ్రామ పాలన
మలానాలో గ్రామ పాలన కోసం రెండు సభలు పనిచేస్తాయి. దిగువ సభను కనిష్ఠాంగ్ అని, ఎగువ సభను జ్యేష్ఠాంగ్ అని పిలుస్తారు. గ్రామానికి సంబంధించిన వివాదాలు, ఆస్తి తగాదాలు, సంప్రదాయాలకు సంబంధించిన అంశాలను ఈ సభల్లో చర్చిస్తారు. గ్రామ ప్రజలు తమ సమస్యలను పెద్దల ముందుంచి పరిష్కారం కోరుతారు. ఈ వ్యవస్థలో జమ్లూ దేవతకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. గ్రామ ప్రజల నమ్మకం ప్రకారం, దేవత ఆదేశాలకు ఎంతో విలువ ఉంటుంది. అందుకే కొన్ని ముఖ్యమైన నిర్ణయాల్లో దేవత అభిప్రాయాన్ని తీసుకుంటారు. అయితే ఈ సంప్రదాయ పాలనా వ్యవస్థ దేశంలోని న్యాయస్థానాలకు ప్రత్యామ్నాయం కాదు. తీవ్రమైన నేరాలు, చట్టపరమైన సమస్యల విషయంలో ప్రభుత్వ చట్టాలే వర్తిస్తాయి.
పర్యాటకులు జాగ్రత్త
మలానా గ్రామానికి వెళ్లే పర్యాటకులు అక్కడి ఆచారాలను గౌరవించాలి. ఇళ్ల గోడలు, వస్తువులు, పవిత్ర ప్రాంతాలను అనుమతి లేకుండా తాకకూడదని స్థానిక సంప్రదాయాలు చెబుతాయి. కొన్ని ప్రాంతాల్లోకి బయటి వ్యక్తుల ప్రవేశంపై కూడా ఆంక్షలు ఉంటాయి. ఈ నియమాలను ఉల్లంఘిస్తే జరిమానా విధించే సంప్రదాయం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక్కడి ప్రజలు కనాషి అనే ప్రత్యేక భాషను మాట్లాడతారు. తమ సంస్కృతి, సంప్రదాయాలను తరతరాలుగా కాపాడుకుంటున్నారు. పర్వతాల మధ్య దాగి ఉన్న ఈ గ్రామం ప్రత్యేక జీవన విధానం, భిన్నమైన పాలనా సంప్రదాయాలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. అయితే మలానా గురించి తెలుసుకునేటప్పుడు స్థానిక ఆచారాలకు ఇచ్చే ప్రాధాన్యాన్ని, దేశ చట్టాల పరిధిని వేర్వేరుగా అర్థం చేసుకోవాలి.

