MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Village in Ocean: కాకినాడలో సముద్రం మధ్యలో ఓ చిన్న గ్రామం.. అక్కడ 118 కుటుంబాలు ఎలా బతుకుతున్నాయి?

Village in Ocean: కాకినాడలో సముద్రం మధ్యలో ఓ చిన్న గ్రామం.. అక్కడ 118 కుటుంబాలు ఎలా బతుకుతున్నాయి?

Village in Ocean: ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడకు దగ్గర్లో బంగాళాఖాతం మధ్యలో ఓ చిన్న గ్రామం ఉంది. సముద్రం మధ్యలో ఉన్న గ్రామంలో జీవిస్తున్న వారు ఎలా బతుకుతున్నారు? వారి జీవన విధానం ఎలా ఉంటుంది?

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 09 2026, 11:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
సముద్రం మధ్యలో గ్రామం
Image Credit : Wikipedia

సముద్రం మధ్యలో గ్రామం

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ తీరానికి సమీపంలో ఉన్న బంగాళాఖాతంలో ఒక దీవి ఉంది. అదే హోప్ ఐలాండ్. ఇందులో పుత్రయ్య పాకలు గ్రామం ఉంది. చుట్టూ సముద్రపు నీరు, మధ్యలో ఇసుక నేల, ఆ నేలపై కట్టిన ఇళ్లు.. ఇలా ఉంటుంది ఈ దీవి. గోదావరి నది నుంచి కొట్టుకొచ్చిన ఇసుక పేరుకుపోవడంతో ఈ దీవి ఏర్పడింది. దాదాపు 16 కిలోమీటర్ల పొడవున్న ఈ దీవి ఒడ్డు నుంచి చూస్తే ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇక్కడి అందమైన ప్రకృతి వెనుక స్థానిక ప్రజల కష్టాల జీవితం దాగి ఉంది. 2022లో వచ్చిన ఓ నివేదిక ప్రకారం, ఇక్కడ 118 కుటుంబాలు నివసించేవి. సముద్రం మధ్యలో ఉండటంతో వీరి జీవన విధానం మిగతా ప్రాంతాల ప్రజలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఆ ప్రజలు ఎలా బతుకుతారు?
Image Credit : Skyscanner

ఆ ప్రజలు ఎలా బతుకుతారు?

హోప్ ఐలాండ్‌లోని పుత్రయ్య పాకలు గ్రామంలో నివసించే మత్స్యకార కుటుంబాలు ఎక్కువగా చేపల వేటపై ఆధారపడతాయి. సముద్రంలో చేపలు పట్టి వాటిని కాకినాడ తీరానికి తీసుకెళ్లి అమ్ముతారు. బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులు కొనాలన్నా పడవలో ప్రయాణించాల్సిందే. ఇంటికి కావాల్సిన వస్తువులను కూడా పడవల్లోనే తీసుకురావాలి. వాతావరణం అనుకూలంగా లేకపోతే ఈ ప్రయాణం మరింత కష్టంగా మారుతుంది. సముద్రంలో అలలు ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లడం ప్రమాదకరం. అందుకే ఇక్కడి ప్రజల రోజువారీ జీవితం సముద్రపు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. చేపలు బాగా దొరికితేనే కుటుంబాలకు మంచి ఆదాయం లభిస్తుంది.

33
వారికి ఇవన్నీ కష్టమే
Image Credit : Wikipedia

వారికి ఇవన్నీ కష్టమే

హోప్ ఐలాండ్‌లో నివసించే కుటుంబాలకు రోజువారీ అవసరాలు తీర్చుకోవడం చాలా కష్టం. తాగునీటి కొరత, విద్య, వైద్య సదుపాయాల లోపం వంటి సమస్యలు గతంలో వార్తల్లోకి వచ్చాయి. పిల్లలు చదువుకోవాలంటే తీర ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే వెంటనే ఆసుపత్రికి చేరుకోవడం కష్టమే. పడవలో ప్రయాణించి కాకినాడకు చేరుకోవాల్సి ఉంటుంది. మరోవైపు, ఈ దీవి ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టే ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటి. ప్రకృతి అందాలకు నిలయంగా ఉన్న హోప్ ఐలాండ్‌ను చూడాలని చాలామందికి ఆసక్తి కలగొచ్చు. అయితే అక్కడ నివసించే ప్రజలకు మెరుగైన తాగునీరు, విద్య, వైద్యం, రవాణా సదుపాయాలు అందించడం ఎంతో అవసరం. సముద్రం మధ్యలో ఉన్న ఈ చిన్న దీవిలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ తమ జీవితాలను కొనసాగిస్తున్నారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ప్రయాణం
ఆంధ్ర ప్రదేశ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Care Tips: హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందా? అసలు నిజమేంటి.. డాక్టర్లు ఏం చెప్తున్నారు?
Recommended image2
మరణం తర్వాత మ‌నిషి శరీరంలో ఏం జరుగుతుంది? మొదట మారేది ఇదే..
Recommended image3
Godavari: గోదావరి నది సముద్రంలో కలిసే చోట కనిపించే అద్భుతం.. ‘అన్నా చెల్లెళ్ల గట్టు’
Related Stories
Recommended image1
Godavari: గోదావరి నది సముద్రంలో కలిసే చోట కనిపించే అద్భుతం.. ‘అన్నా చెల్లెళ్ల గట్టు’
Recommended image2
Rahul Gandhi: రాహుల్ గాంధీ ఆస్తులు ఎన్ని కోట్లు? ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved